Water plants siege
-
ఖమ్మంలో 31 వాటర్ ప్లాంట్ల సీజ్
సాక్షి, ఖమ్మం అర్భన్ : ఖమ్మంలోని వాటర్ ప్లాంట్లపై కార్పోరేషన్, రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. 31 ప్లాంట్లను సీజ్ చేశారు. హైకోర్ట్ ఆదేశాలతో ఈ దాడులు చేసినట్టు ప్లాంట్ల యజమానులతో చెప్పారు. ఇదీ నేపథ్యం ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారంగా వాటర్ ప్లాంట్లు నడుపుతున్న తాము.. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటైన ప్లాంట్ల కారణంగా నష్టపోతున్నామంటూ కొందరు (ప్లాంట్ల యజమానులు) గతంలో ఆందోళనకు దిగారు. దీనిపై సంబందిత అధికారులు స్పందించనట్టయితే తామంతా ప్లాంట్లు బంద్ చేస్తామన్నారు. ప్లాంట్ల యజమానుల సంఘం నాయకులతో ఆర్డీఓ చర్చించారు. అనుమతి లేని ప్లాంట్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంఘం ఆధ్వర్యంలో ప్లాంట్ల యజమానులు ఆందోళన విరమించారు. ఈ దాడులు ఎందుకంటే... అనుమతి, ట్రేడ్ లైసెన్స్ లేని, నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లు నగరంలో 31 ఉన్నట్టుగా గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు ఖమ్మం కార్పోరేషన్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణఫర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో నగరంలోని ఖానాపురం, బల్లేపల్లి, పాండురంగాపురం, కైకొండాయిగూడెం, బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ప్లాంట్లపై దాడులు చేశారు. సీజ్ చేయడానికి ముందుగానే వీటి యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. కొన్ని ప్లాంట్లలో నిర్వహణ లోపాలను, అపరిశుభ్రతను చూసిన అధికారులు నివ్వెర పోయారు. ‘‘శుద్ధ జలం పేరుతో జనానికి అంటగడుతున్నది ఈ నీళ్లా..?’’ అనుకుంటూ అవాక్కయ్యారు. ఆ ప్లాంట్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో ఏసీపీ రాంచందర్‌రావు, అర్భన్ డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ, భాస్కర్, వీఆర్ఓలు బాలయ్య, ఆర్.వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
కమ్మర్‌పల్లిలో వాటర్ ప్లాంట్ల సీజ్
కమ్మర్పల్లి : కమ్మర్పల్లి మండలంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న వాటర్ ప్యూరిఫైరింగ్ ప్లాంట్లను సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కమ్మర్‌పల్లిలో 4, హాసాకొత్తూర్‌లో 2, బషీరాబాద్‌లో 1, చౌట్పల్లిలో 1, కోనాసముందర్‌లో 1 వాటర్ ప్లాంట్‌ను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భిక్షపతి, వీఆర్వోలు మూసి వేయించారు. వాటర్ ప్లాంట్ల యజమానులకు ఇదివరకే నోటీసులు ఇచ్చామని ఆర్ఐ తెలిపారు. సీజ్ చేసిన ప్లాంట్లను తెరవకూడదని, తెరిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారన్నారు. -
రంగు పడితే ఓకే!
వైఎస్సార్సీపీ మద్దతుదారుల 29 వాటర్ ప్లాంట్లు సీజ్ ముందస్తు నోటీసులు లేకుండానే సీజ్ చేసిన అధికారులు నిబంధనలు పాటించలేదంటూ బుకాయింపు అదే రీతిలో నడుస్తున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడని వైనం ధర్మవరం : వైఎస్సార్సీపీ నాయకులు, మద్దతుదారులను దెబ్బ తీయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పని చేస్తున్నారు. చౌక ధరల దుకాణాలు, ఇతరత్రా ప్రభుత్వ పథకాలను నిర్వహిస్తున్న వారందరినీ అకారణంగా తొలగిస్తూ ఆర్థికంగా దెబ్బ తీస్తున్నారు. ఇందులో భాగంగా వారి కన్ను వాటర్ ప్లాంట్లపై పడింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ వైఎస్సార్సీపీ మద్దతుదారులకు సంబంధించిన ప్లాంట్లన్నింటినీ సోమవారం అధికారులతో సీజ్ చేయించారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా తక్కువ ధరకే శుద్ధి జలాలను అందజేయాలన్న తలంపుతో నాలుగేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం పట్టణంలో ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. కేవలం రూ.2కే 20 లీటర్ల వాటర్ క్యాన్ అందించే వారు. ఆ ప్లాంట్లు అప్పటి నుంచి ఇప్పటి దాకా తక్కువ ధరకు ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారుు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట కొన్ని వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే అదే పద్ధతిలో వాటర్ ప్లాంట్లు నడుస్తున్నందున ప్రజలు వాటిని పెద్దగా ఆదరించలేదు. దీంతో ముందున్న వాటిని మూసేస్తే కొత్తవి ఏర్పాటు చేయవచ్చనే కక్షతో వైఎస్సార్సీపీ మద్దతుదారులకు చెందిన 29 వాటర్ ప్లాంట్లను సీజ్ చేయించారు. నోటీస్ లేదు.. సమాచారం లేదు.. వాస్తవానికి ఏదైనా ఆస్తిని సీజ్ చేయడానికి మున్సిపల్ అధికారులు తొలుత వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. కానీ ముందస్తు సమాచారం, నోటీసు జారీ చేయకుండానే మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకులను వెంటేసుకుని వెళ్లి వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే.. నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్లను నడపడం లేదని చెబుతున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వాటిని సీజ్ చేశారని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. పచ్చరంగు ఉంటే ఓకే.. ఇదిలా ఉంటే టీడీపీ నేతలకు చెందిన వాటర్ ప్లాంట్లు, వైఎస్సార్సీపీ మద్దతు దారులకు చెందిన వాటర్ ప్లాంట్లు పక్కపక్కనే ఉన్నా వారు నడిపిన రీతిలోనే వీరూ నడుపుతున్నా.. అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చాలా రోజులుగా ఉన్న పాంట్లలో కొన్నింటిని టీడీపీ నేతలు కొని పచ్చ రంగు వేశారు. అధికారులు వాటి దరిదాపులకు కూడా వెళ్లక పోవడం చర్చనీయూంశమైంది. రామ్‌నగర్, యర్రగుంట సర్కిల్లో నడుస్తున్న ప్లాంట్లకు నీటిని మున్సిపాలిటీ నుంచే తీసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్‌ను సాక్షి వివరణ కోరగా.. ‘వాటర్ ప్లాంట్లు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయి.. అందుకే సీజ్ చేశామ’ని తెలిపారు. టీడీపీ నాయకులు నడుపుతున్న వాటర్ ప్లాంట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయూ.. అని అడిగితే నిబంధనలకు అగుణంగా లేకపోతే నోటీసులు జారీ చేసి సీజ్ చేస్తామని చెప్పారు.