కమ్మర్‌పల్లిలో వాటర్ ప్లాంట్‌ల సీజ్
కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి మండలంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న వాటర్ ప్యూరిఫైరింగ్ ప్లాంట్లను సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కమ్మర్‌పల్లిలో 4, హాసాకొత్తూర్‌లో 2, బషీరాబాద్‌లో 1, చౌట్‌పల్లిలో 1, కోనాసముందర్‌లో 1 వాటర్ ప్లాంట్‌ను మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి, వీఆర్‌వోలు మూసి వేయించారు. వాటర్ ప్లాంట్ల యజమానులకు ఇదివరకే నోటీసులు ఇచ్చామని ఆర్‌ఐ తెలిపారు. సీజ్ చేసిన ప్లాంట్లను తెరవకూడదని, తెరిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారన్నారు.