జూరాల రైతుకు కన్నీళ్లే
జూరాల ప్రాజెక్టులో 5.4 టీఎంసీల నీరున్నప్పుడే నీరు విడుదల చేస్తామని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ఇప్పుడు నీటినిల్వ 5.85టీఎంసీలకు చేరింది. అయినా, సాగునీరు లేదు.. కేవలం తాగు నీటికే విడుదల చేయాలని కృష్ణా వాటర్‌బోర్డు తీర్మానించింది. ఈ తీర్మానంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళనలో పడ్డారు.
జూరాల : కృష్ణా ట్రిబ్యునల్ యాజమాన్య బోర్డు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల ద్వారా కేవలం తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జూరాల ఆయకట్టు రైతులకు కన్నీళ్లు మిగిల్చేలా ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి జూరాలకు ఇన్‌ఫ్లో వస్తుండడంతో పాటు కర్ణాటకలో నారాయణపూర్ ఆయకట్టుకు విడుదలవుతున్న నీటి పరిమాణం, రీ జనరేట్ వాటర్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఈ అంశాన్ని పక్కనబెట్టారు. దీంతో మరోసారి కృష్ణాబోర్డు సమావేశమయ్యేదాకా జూరాల ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది.
ఐదు రోజులుగా జూరాల రిజర్వాయర్‌కు స్థా నిక వర్షాలతో పాటు పై నుంచి రీజనరేట్ వాటర్ వ స్తుండడంతో ఇన్‌ఫ్లో రోజురోజుకు పెరుగుతూ వస్తుం ది. ఇలా ఐదురోజుల్లోనే ఒక టీఎంసీ నీటినిల్వ రిజర్వాయర్‌లో పెరిగింది. కర్ణాటకలో గత రబీ సీజన్లో క్రాప్‌హాలిడే ఉన్నప్పటికీ జూరాల రిజర్వాయర్‌లో ఉన్న ఐదు టీఎంసీల నీటి ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతీ రబీ సీజ న్‌లోనూ నాలుగేళ్లుగా నారాయణపూర్ ఆయకట్టు రీజనరేట్ వాటర్‌పై ఆధారపడి సాగునీటిని అందించారు. గ త నెల 21న నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్ర ధాన కాలువల ద్వారా సాగునీటిని విడుద ల చేయడం ప్రారంభించారు.
వాస్తవానికి పది రోజుల్లోనే నారాయణపూర్ ఆయకట్టుకు విడుదలైన నీటిలో 10శాతం నీళ్లు జూరాలకు ఇన్‌ఫ్లోగా చేరాల్సి ఉంది. కర్ణాటకలో నదిలో ఉన్న అక్రమ మినీ పథకాల కారణంగా జూరాలకు చేరాల్సిన రీజనరేట్ వాటర్ నెల ఆలస్యమైంది. ఈ నెల 20న రాయచూర్ జిల్లాలో కురిసిన వర్షాలతో నదిలో నీటి ప్రవాహం పెరిగి జూరాలకు ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. మొదటిరోజు 850 క్యూసెక్కులతో ప్రారంభమైన ఇన్‌ఫ్లో బుధవారం నాటికి 941 క్యూసెక్కులుగా ఉంది. ఈ ఐదురోజుల్లో దాదాపు ఒక టీఎంసీ నీటినిల్వ రిజర్వాయర్‌లో పెరిగినట్లయింది.
డెడ్‌స్టోరేజీ నుంచి బయటపడి...
జూరాల రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ఇందులో 5 టీఎంసీల మి నిమం లెవల్‌కు తగ్గితే డెడ్‌స్టోరేజీగా నిర్ణయించారు. ఈ నెల 20 నాటికి జూరాల రిజర్వాయర్ నీటినిల్వ కేవలం 4.8 టీఎంసీలతో డెడ్‌స్టోరేజీలోకి వెళ్లింది. ఇలాంటి తరుణంలో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమైన ఇన్‌ప్లో డెడ్‌స్టోరేజీ నుంచి జూరాల రిజర్వాయర్‌ను గట్టెక్కిం చింది. ప్రస్తుతం జూరాల రిజర్వాయర్‌లో డెడ్స్టోరజీని దాటి అదనంగా 0.85 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. ఈ తరుణంలో రెండు ప్రధాన కాలువల ద్వారా 800 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తే నారుమడులను సిద్ధం చేసుకునేందుకు ఈ నీళ్లు ఉపయోగపడతాయి.
ఆయకట్టులో నారు మడులను సిద్ధం చేసుకోవడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఈ లోగా కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు విడుదలవుతున్న నీటిలో రీజనరేట్ వాటర్ జూరాల రిజర్వాయర్‌కు చేరితే ఈ సీజన్ వరకు ఆ నీటి ని ఆయకట్టుకు కొనసాగించేందుకు అవకాశం ఉంటుం ది. రీ జనరేట్ వాటర్ జూరాల రిజర్వాయర్‌కు చేరకుండానే కర్ణాటకలో ఆవిరైతే ఆయకట్టులో పంట ప్రశ్నార్థకమవుతుంది. దీనిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు.
ఐఏబీ సమావేశంలో నీటి విడుదలపై నిర్ణయం...
జూలై 23న జరిగిన జిల్లా ఐఏబీ సమావేశంలో జూరాల ఆయకట్టుకు ఆగస్టు 4నుంచి నీటి విడుదలను చేయాల ని తీర్మానించారు. తీర్మానం చేసినప్పుడు జూరాల రిజ ర్వాయర్‌లో నీటినిల్వ 5.4 టీఎంసీలు మాత్రమే ఉంది. ఆగస్టు 4వ తేదీన 5.2 టీఎంసీల నీటినిల్వ ఉన్నప్పటికీ 3వ తేదీ సాయంత్రం వరకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 3వ తేదీన జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డులో ప్రాజెక్టుల నుంచి సాగునీటికి నీటివిడుదల చే యడం లేదని తాగునీటికి మాత్రమే విడుదల చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పట్లో జూరాల నుం చి నీటి విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతం జూ రా ల రిజర్వాయర్‌లో నీటినిల్వ 5.85 టీఎంసీలకు చేరింది.
317 మీటర్లకు చేరితేనే ఆయకట్టుకు నీళ్లు... సీఈ ఖగేందర్.
జూరాల ఆయకట్టులో పంటలకు సాగునీటిని ప్రస్తుతం ఉన్న నీటిమట్టంతో విడుదల చేయలేం. కర్ణాటక నుంచి జూరాల రిజర్వాయర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో వర్షాల ద్వా రానే వస్తుంది. పూర్తిగా రీ జనరేట్ వాటర్ రావడం ప్రా రంభమైనట్లు సమాచారం లేదు. మరో పదిరోజులు గ డిస్తే రీజనరేట్ వాటర్ వస్తుందా..? స్థానిక వర్షాలతో ఇ న్‌ఫ్లో వస్తుందా అన్నది స్పష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయకట్టుకు నీళ్లిచ్చి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కన్నా 317 లెవల్‌కు నీటిమట్టం చేరితే ఖరీఫ్‌కు నీళ్లిచ్చేందుకు ఆలోచించవచ్చు.