Waterfalls Scheme
-
ప్రాజెక్టుల పనులు గాలికి
=సముద్రం పాలవుతున్న మూడు నదుల వర్షపు నీరు =ఏటా 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడుకే =నత్తనడకన కౌండిన్య ప్రాజెక్టు పనులు =ఊసేలేని కైగల్ ఎత్తిపోతల పథకం పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కైగల్ నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు పనులను అధికారులు, పాలకులు గాలికొదిలేశారు. ఫలితంగా ఏటా 150 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీరు తమిళనాడు రాష్ట్రం గుండా బంగాళాఖాతంలో కలసిపోతోంది. పలమనేరు, న్యూస్‌లైన్: రామసముద్రం మండలంలో పుట్టే కౌండిన్య నది పుంగనూరు, పెద్దపంజాణి, గంగవరం, పలమనేరుల మీదుగా కౌండిన్య అడవి నుంచి తమిళనాడు రాష్ర్టంలోకి పయనిస్తుంది. ఈ నదిపై పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద మూడేళ్ల క్రితం కౌండిన్యా-1 ( వైఎస్ఆర్ జలాశయం) ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు తగినన్ని నీళ్లు లేకపోవడంతో దీనికి అనుసంధానంగా 2012 జనవరిలో గంగన శిరస్సు (కౌండిన్య-2) పనులను ప్రారంభించారు. ఈ పనులూ ఆరు నెలల క్రితం ఆగిపోయూరుు. బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ వద్ద ఎత్తిపోతల పథకానికి కిరణ్ సర్కార్ రెండేళ్ల క్రితం అంచనాలు సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు. ఏటా 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడుకే కౌండిన్య, ఎగినేరి, కైగల్ నదుల నుంచి వర్షాకాలంలో 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడు గుండా బంగాళాఖాతంలోకి చేరుతోంది. ఈ నీటికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం పలమనేరు మండల సరిహద్దులోని గుడియాత్తం సమీపంలో మోర్ధనా ప్రాజెక్టును నిర్మించింది. ఇక్కడి నుంచి వెళ్లే వృథా జలాలు మోర్ధనా ప్రాజెక్టుకు చేరి అక్కడి ప్రాంతవాసుల అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇదే పని మన పాలకులు ఎందుకు చేయలేదని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. నత్తనడకన కౌండిన్య ప్రాజెక్టు పనులు పలమనేరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మూడేళ్ల క్రితం కౌండిన్య నదిపై కాలువపల్లె వద్ద రూ.53 కోట్లతో పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్ఆర్ జలాశయం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా రెండో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఎనగిరేరు వద్ద గంగన్న శిరస్సు నదిపై మరో రిజర్వాయర్‌ను నిర్మించే పనులు రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 55 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీటిని జలాశయంలో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ నీటిని పైప్లైన్ల ద్వారా వైఎస్ఆర్ జలాశయానికి మళ్లించి పట్టణవాసుల దాహార్తిని తీర్చవచ్చు. అలాగే బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ వద్ద దుముకురాళ్ల జలపాతం నుంచి వృథాగా వెళ్లేనీటిని ఎత్తిపోతల పథకం ద్వారా బెరైడ్డిపల్లె, పలమనేరు మండలాల్లోని చెరువులకు మళ్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు అంచనాల దశలోనే ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఈ నదుల విషయం మళ్లీ గుర్తుకొచ్చింది. దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు వృథాగా పోతున్న నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే.. ఎత్తిపోతల సాధ్యం
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే పాలమూరు ఎత్తిపోతల పథకం సాధ్యమవుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం పరిగిలోని కొప్పుల శారదా గార్డెన్స్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రం - వర్తమాన సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు భారీగా హాజరయ్యారు. సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదని.. ఇది పాలకుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై ఆధిపత్యం కోసమే ఆంధ్రా ప్రాంత ప్రజలను పాలకులు రెచ్చగొడుతున్నారన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఏ సందర్భంలోనూ అనలేదని స్పష్టం చేశారు. 57 ఏళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటే.. అది ఏకాఏకి నిర్ణయం ఎలా అవుతుందని ప్రశ్నించా రు. రాష్ట్ర అసెంబ్లీ, రాజ్యసభ, లోక్‌సభల్లో నెలల తరబడి తెలంగాణ వెనుకబాటుపై చర్చలు జరిగాయన్నారు. హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే ఊరుకోం: ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సదస్సులో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా పాలకులు హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే ఊరుకునేది లేదని, సమైక్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగాలు, భూములు అన్ని కోల్పోయామని, ఇప్పుడు తెలుగు జాతి కలిసుండాలంటున్న ఆంధ్రా పాలకులకు అభివృద్ధి విషయంలో తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ‘ఇది నిజాం కట్టిన చారిత్రక హైదరాబాద్.. హైదరాబాద్‌లేని తెలంగాణ వద్దు, కాంగ్రెస్ మరోమారు మోసం చేయబోతున్నది.. మనం ఇప్పుడే అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీలు ఇక్కడ తెలంగాణ అంటూనే అక్కడ సమైక్యాంధ్ర అంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోమారు మోసం చేసేందుకుయత్నిస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ పునర్నిర్మానంలోనూ తాము భాగస్వాములుగా ఉంటామన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం తెలివిలేదని, హైదరాబాద్ శాంతి భద్రతలు ఢిల్లీ చేతిలో పెట్టమనటం సిగ్గుచేటన్నారు. నిన్నటి వరకు జై తెలంగాణ అన్న బీజేపీ నేడు వెనకడుగు వేస్తున్నదన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్, జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, వికారాబాద్ డిప్యూటీ డీఈఓ హరి శ్చందర్, టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కే.హన్మంతు, టీజీవీవీ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి బస్వరాజ్, ఉపాధ్యక్షులు వెంకట్రాం, నియోజకవర్గ చైర్మన్ బసిరెడ్డి, టీజీవీపీ రాష్ట్ర నాయకులు జగన్, రమేష్, జేఏసీ జిల్లా కన్వీనర్ సదానందం, పరిగి సర్పంచ్ విజయమాల తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు సాయిచంద్ కళా బృందం పాటలతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కల్కొడ నర్సింహులు, ఆంజనేయులు, లక్ష్మి, విజయలక్ష్మి, మునీర్, చెర్క సత్తయ్య, గోపాల్, మదన్‌రెడ్డి, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.