Watershed scheme
-
బంజరు ‘బంగారం’
సాక్షి, అమరావతి: ఎలాంటి పంటలకూ పనికి రాని 6.20 లక్షల ఎకరాల బంజరు భూములను వాటర్‌షెడ్ పథకాలతో బంగారు భూములుగా మార్చి సాగులోకి తేవడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పీఎంజీఎస్‌కేవై 2.0 కార్యక్రమంలో భాగంగా వాటర్‌షెడ్ డెవలప్మెంట్ విభాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకాలు చేపడతారు. ఇందుకయ్యే ఖర్చును 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2022–26 మధ్య ఐదేళ్లలో కొత్తగా వాటర్‌షెడ్ పథకాలకు ప్రణాళికలు పంపాలని కేంద్రం తాజాగా కోరింది. మన రాష్ట్రం నుంచి గరిష్టంగా 2.50 లక్షల హెక్టార్ల (6.20 లక్షల ఎకరాలు) ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఇందుకు రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బంజరు భూములను ఎంపిక చేశారు. కనీసం 2,500 హెక్టార్ల బంజరు ఉండే ప్రాంతాన్ని ఒక ప్రాజెక్టు (ప్రాంతం)గా తీసుకొని 61 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో 5,000 హెక్టార్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాజెక్టు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు గ్రామాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అధికారులు అదనంగా మరో 30 ప్రాజెక్టులతో 75 వేల హెక్టార్లు (1.85 లక్షల ఎకరాలు) అభివృద్దికి ప్రతిపాదనలు ముందస్తుగా సిద్ధం చేశారు. ఈ నెల 4న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మొత్తం 91 ప్రాజెక్టుల పరిధిలో 3.25 లక్షల హెక్టార్లతో ప్రతిపాదనలను రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు కేంద్ర అధికారులకు అందజేశారు. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రాష్ట్రంలో కనీసం 4 లక్షల మంది రైతు, కూలీల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. నిధుల పెంపు, నిబంధనల్లోనూ మార్పు పీఎంజీఎస్‌కేవై 1 లో రాష్ట్రంలో ఇప్పటికే దశల్లో వాటర్‌షెడ్ కార్యక్రమాలు జరిగాయి. ఆ పథకాల్లో అభివృద్దికి హెక్టారుకు గరిష్టంగా రూ.12 వేలు మాత్రమే కేటాయించారు. ఇంత తక్కువ నిధులతో చెక్ డ్యాంల నిర్మాణం, భూమిలో తేమ శాతం పెంపు, ఇతర కార్యక్రమాలతో పాటు ఆ ప్రాంతంలోని కూలీల కుటుంబాలకు వ్యవసాయ ఆధారిత జీవనోపాధి కల్పనలో సత్ఫలితాలు రాలేదు. ఈ నేపధ్యంలో పీఎంజీఎస్‌కేవై – 2లో వాటర్‌షెడ్ కార్యక్రమాల నిర్వహణకు హెక్టారుకు రూ.22 వేల నుంచి రూ.28 వేలు కేటాయించాలని నిర్ణయించారు. దీనికి తోడు గతానికి భిన్నంగా మెరుగైన ఫలితాలు దక్కేలా నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఒక ప్రాజెక్టులో చేపట్టే పనుల ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులివ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం గతంలో ఎక్కువ శాతం నిధులిచ్చిన పనులకు ఇప్పుడు తక్కువ కేటాయించాలని, గతంలో తక్కువ శాతం నిధులిచ్చిన పనులకు ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. -
కుంటనక్కలు!
వజ్రకరూరులో వాటర్‌షెడ్‌లో అవినీతి బాగోతం – చాలా చోట్ల ఫారంపాండ్స్ లేకుండానే బిల్లులు స్వాహా – ఏడాదిన్నర వ్యవధిలో రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు – పెద్ద పెద్ద గుంతలను ఫారంపాండ్స్గా చూపిన పరిస్థితి – రూ.కోటికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు – పనులు ప్రారంభించడం.. విలేయడం కరువును చూసి మీరు పారిపోకూడదు. మిమ్మల్ని చూసి కరువే పారిపోవాలి. ప్రభుత్వం తరపున నీటి సంరక్షణ చర్యలు చేపట్టాం. వాటి ద్వారా వర్షం నీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలు పెంపొందించుకోవాలి. సేద్యపు కుంటలతో సిరుల పంట పండాలి. – రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలివి.. అధికారులను చూసి మీరు భయపడకూడదు. మమ్మల్ని చూస్తే వాళ్లకే వణుకు పుడుతుంది. ప్రభుత్వం తరపున చేపట్టే పనులన్నీ మేమే చేస్తాం. అవి ఉన్నా..లేకున్నా బిల్లులు మాత్రం చేయండి. ఆ తర్వాత మేం చూసుకుంటాం. – ఇదీ తెలుగుదేశం పార్టీ నేతల తీరు.. అనంతపురం టౌన్/వజ్రకరూరు : భూగర్భ జలాలు వృద్ధి చెందాలంటే వర్షపు నీటిని ఒడిసి పట్టడమే ప్రత్యామ్నాయం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సేద్యపు కుంటల(ఫారంపాండ్స్) తవ్వకానికి చర్యలు చేపట్టింది. వజ్రకరూరు వాటర్‌షెడ్ పరిధిలో చేపట్టిన సేద్యపు కుంటల పనులు తెలుగుదేశం పార్టీ నేతలకు సిరుల పంట పండించాయి. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయడం.. పని ప్రారంభించి సగంలోనే నిలిపేసి నిధులు బొక్కేసిన వైనం వెలుగు చూస్తోంది. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఫారంపాండ్స్కు రూ.కోటికి పైగా ఖర్చు చేశారు. పోనీ సేద్యపు కుంటలైనా ఉన్నాయా అంటే అదీ లేదు. అందినకాడికి దోచుకోవడమే పరమావధిగా అధికారులతో కలిసి అక్రమాలకు తెరతీశారు. ఏడాదిన్నర వ్యవధిలో రూ.కోటికి పైగా ఖర్చు 2009–10లో మొదటి బ్యాచ్ కింద వజ్రకరూరు వాటర్‌షెడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి గత ఏడాది ప్రాజెక్ట్ కాల పరిమితి ముగిసే నాటికి 243 సేద్యపు కుంటలు తవ్వించి రూ.103.55 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. ఇందులో ఉపాధి హామీ నిధులు రూ.101.76 లక్షలు, వాటర్‌షెడ్ నిధులు రూ.1.80 లక్షలు వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత 2015 ఏప్రిల్ నుంచి (2016 సెప్టెంబర్‌లో ప్రాజెక్ట్ ముగిసింది) ఏకంగా 232 ఫారంపాండ్స్ నిర్మించి రూ.101.83 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. రాగులపాడులో 113 ఫారంపాండ్స్కి రూ.104.67 లక్షలకు పరిపాలన అనుమతి రాగా.. 113 పనులు చేసి రూ.50.33 లక్షలు ఖర్చు చేశారు. వజ్రకరూరు అవినీతి బాగోతం ప్రాంతం ఫారంపాండ్స్ అనుమతి వ్యయం(రూ.లక్షల్లో) నిర్మాణం వ్యయం(రూ.లక్షల్లో) తట్రకల్లు 35 32.66 35 17.86 లక్షలు వజ్రకరూరు 42 32.42 41 13.83 బోడిసానిపల్లి 6 5.04 6 1.68 గంజికుంట 47 48.11 47 19.82 ఎన్‌ఎన్‌పీ తండా 1 రూ.3వేలు అన్నీ అవినీతి ‘లెక్కలే’.. సేద్యపు కుంటల నిర్మాణానికి వెచ్చించిన నిధుల తీరు ఒక్కసారి పరిశీలిస్తే అవినీతి ‘లెక్క’ ఇట్టే అర్థమవుతుంది. వాటర్‌షెడ్ పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ కింద మొత్తం 242 ఫారంపాండ్స్కు గాను రూ.222.35 లక్షలకు, ఐడబ్ల్యూఎంపీ కింద రెండు ఫారంపాడ్స్కు రూ.76 వేలతో పరిపాలన అనుమతి వచ్చింది. మంజూరైన (242) పనులన్నీ ప్రారంభించిన అధికారులు రూ.కోటికి పైగా ఖర్చు చేశారు. కానీ చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల అసలు సేద్యపు కుంటల ఆనవాళ్లే కనుమరుగయ్యాయి. విచిత్రంగా చిన్నపాటి గుంతలను తవ్వి వాటినే ఫారంపాండ్స్గా చూపి బిల్లు చేసుకున్నారు. అధికార పార్టీ నేతల అండతో డ్వామా అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారనే విషయం స్పష్టమవుతోంది. నిబంధనల మేరకు ఈ పనులన్నీ కూలీలతో చేయించాలి. కానీ ఇక్కడ యంత్రాలతో తూతూ మంత్రంగా చేపట్టి నిధులు బొక్కేశారు. పెద్ద పెద్ద గుంతలను ఫారంపాండ్స్గా చూపారు. కొన్ని ఫారంపాండ్స్ ఇప్పటికే పూడిపోయాయి. తట్రకల్లు సమీపంలోని వంకలో నిబంధనలకు విరుద్ధంగా ఫారంపాండ్ పనులు చేపట్టారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఆ భూములను సాగు చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ తవ్విన ఫారంపాండ్లను పూడ్చివేశారు. తట్రకల్లులో ఓబన్న, బోయ ఆంజనేయస్వామి, శ్రీనివాసులు పొలాల వద్ద నిర్మించిన సేద్యపు కుంటలు ప్రస్తుతం పూడిపోయాయి. ఇలా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
బీడు భూములకు మహర్దశ
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లాలోని బీడు భూములకు మహర్దశ రానుంది. ప్రతి వర్షం చుక్క సాగుకు ఉపయోగకరంగా మరల్చడం, అడుగంటి పోతున్న భూగర్భజలాలు పెంపుకోసం ఇటు సాగునీటి వనరుల పెంపు, అటు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న వాటర్ షెడ్ పనుల కోసం జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ పనుల కింద రూ. 23 కోట్లు మంజూరు అయినట్లు ఉపాధి హామీ పథకం జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు విడుదలైన రూ.23.37 కోట్లతో జిల్లాలోని ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లి గ్రామంలో రూ.705 లక్షలతో, చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో 578.61 లక్షలతో, పాల్వంచలోని పాయకారి యానంబైలులో 634.64 లక్షలతో, కొత్తగూడెం మండలంలోని చుంచుపల్లి గ్రామంలో 419.72 లక్షలతో ఆయా ఏజెన్సీల ఆధ్వర్యంలో పనులు చేపడుతామని అధికారులు వెల్లడించారు. ఏరియా గుర్తింపుకు ప్రమాణాలు.. కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టే వాటర్ షెడ్ పనులకు రైతులకు, కూలీలకు ఉపయోగపడటంతోపాటు పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు పెంచేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ల్యాండ్‌రెవెన్యూ న్యూఢిల్లీ సంచాలకులు వాటర్‌షెడ్ ఏరియాను గుర్తించేందుకు 13 ప్రమాణికాలను సూచించారు. ఇందులో వాటర్ షెడ్ పనులు చేపట్టే ప్రాంతంలో పేదరిక జనాభా శాతం,ఎస్సీ,ఎస్టీ జనాభాశాతం, సరాసరి దినసరి కూలిశాతం, చిన్న, సన్న కారు రైతుల శాతం, భూగర్భ జలాలస్థితి, తేమ సూచిక, వర్షాధారపు భూమి విస్తీర్ణం. తాగునీటి పరిస్థితి, కొరత, బంజర భూములు/క్షీణతకు గురైన భూములు, భూమి ఉత్పాదక శక్తి, వాటర్ షెడ్ పథకం అమలు చేస్తున భూములకు దూరం, సమమైన భూములలో వివిధ గ్రామాలు/ మైక్రో వాటర్‌షెడ్ సమూహాలు, గుట్టలలో ఉన్న వివిధ గ్రామాల సమూహం. మొదలగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా సగటున 1000-5000 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన కొన్ని గ్రామాల సముదాయం ఒక్క ప్రాజెక్టుగా చేపడుతారని జిల్లా వాటర్ షెడ్ నిర్వాహకాధికారి విజయ్‌చందర్ తెలిపారు. ఎంపిక చేసిన ప్రాజెక్టును 4నుండి 7 సంవత్సరాల కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. నిరుపేదలకు జీవనోపాధి... వాటర్‌షెడ్ పథకంలో ప్రాజెక్టు నిధుల నుంచి 9 శాతం బడ్జెట్ కేటాయించారు. ఇందులో 5 శాతం నిధులు సెర్ఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు. మిగిలిన 4 శాతం నిధులు డ్వామా పరిధిలో వాటర్‌షెడ్ పథకంలోని గ్రామాల్లో ఉన్న గ్రామ సమాఖ్యల ద్వారా వ్యవసాయ ఆధారిత జీవనోపాధి, వ్యవసాయేతర జీవనోపాధికి సమకూరుస్తారు. ఈ నిధులను డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ద్వారా ఖర్చు చేస్తారు. అదేవిధంగా వాటర్‌షెడ్ పథకంలో సహజ వనరుల యాజమాన్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి 56 శాతం నిధులు కేటాయించారు. క్షీణిస్తున్న సహజ వనరులైన భూమి, నీరు, పచ్చదనం, పశు సంపద, మానవ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. భూమిని ఎత్తు నుంచి పల్లపు ప్రాంతం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి హామీ పథకం సమన్వయంతో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి పనులు చేపట్టేందుకు కార్యక్రమం రూపొందించారు. దీనికింద చెక్‌డ్యామ్ లు, చెక్ వాల్స్, రాతి కట్టడాలు, ఫారంపాండ్, నాడెప్ కంపోస్ట్ ఎరువు గుంత, నీటి నిల్వ కందకాలు, చిన్న ఊట కుంట, ఊటగుంత, రోడ్డు ఇరువైపులా మొక్కల పెంపకం, గట్లపై మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు.