wax
-
ఆ యాపిల్స్‌తో ప్రమాదం
సాక్షి, కోల్‌కతా : ప్లాస్టిక్ గుడ్లపై కలకలం రేగిన క్రమంలో తాజాగా మైనం పూతతో వస్తున్న యాపిల్స్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. గతంలో ప్లాస్టిక్ కోడిగుడ్లపై నెలకొన్న ఆందోళనతో కలత చెందిన వినియోగదారులు ప్రస్తుతం యాపిల్స్‌పై మైనం పూతపై సాగుతున్న ప్రచారంతో బెంబేలెత్తుతున్నారు. యాపిల్స్ తాజాగా, నిగనిగలాడేలా కనిపించేందుకు కొందరు వ్యాపారులు షూలు, కార్లను పాలిష్ చేసేందుకు ఉపయోగించే పెట్రోపాన్ పారాఫిన్, మైనంను పండ్ల పైపూతగా వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోల్‌కతాలోని డం డం రోడ్లో ఇలాంటి యాపిల్స్‌ను కొందరు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దుకాణాలపై దాడులు చేసిన పోలీసులు సింతిమోర్ ప్రాంతంలోని ఇద్దరు దుకాణదారులను అరెస్ట్ చేశారు. నగరంలోని అతిపెద్ద హోల్‌సేల్ పండ్ల మార్కెట్ నుంచి ఈ యాపిల్స్ నగరమంతటా సరఫరా అవుతున్నాయని విచారణలో దుకాణదారులు తెలిపారు. కాగా, కోల్‌కతా అంతటా మైనం పూసిన యాపిల్స్ విక్రయిస్తున్నారని, ఇది ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని స్ధానిక కౌన్సిలర్ గౌతం ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను కోల్‌కతా మేయర్ దృష్టికి తీసుకువెళతానని ఘోష్ చెప్పారు. -
ఢిల్లీకి వచ్చిన మరో 'మోదీ'..!
న్యూ ఢిల్లీః లండన్ లోని మేడమ్ తుస్సాడ్ మ్యూజియంలో పెట్టేందుకు తయారు చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మైనపు విగ్రహం ఢిల్లీకి చేరుకుంది. నిర్మాణం పూర్తయి మ్యూజియంలో కొలువుదీరేందుకు సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని ప్రధాని మోదీకి చూపించేందుకు తుస్సాడ్ మ్యూజియం కళాకారుల బృందం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆయన లండన్ వెళ్ళి చూసే అవకాశం లేకపోవడంతో ఢిల్లీలోనే స్వయంగా తిలకించేందుకు వీలు కల్పించారు. త్వరలో ప్రపంచ ప్రఖ్యాత తుస్సాడ్ మ్యూజియంలో కొలువుదీరనున్న తన విగ్రహాన్ని చూసిన మోదీ.. కళాకారులపై ప్రశంసల జల్లు కురిపించారు. వారిని అపర బ్రహ్మలుగా కీర్తించారు. ఆయన మైనపు విగ్రహాన్ని ప్రజలందరూ కూడ సందర్శించేందుకు వీలుగా ఏప్రిల్ 28న ఢిల్లీలో ప్రదర్శనకు ఉంచుతారు. ముఖ్యంగా లండన్ లోనే కాక సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాగ్ లోని టుస్సాడ్ సంగ్రహాలయాల్లో కూడ మోదీ మైనపు విగ్రహాన్ని ఉంచేందుకు నిర్ణయించారు. ప్రపంచ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ప్రధాని మోదీ విగ్రహాన్ని రూపొందించేందుకు ఈ సంవత్సరం ప్రారంభంలో మ్యూజియం కళాకారులు, నిపుణులు ఢిల్లీలో భారత ప్రధాని మోదీని ఆయన ఇంట్లో కలుసుకున్నారు.