వే టూ ఎస్ఎంఎస్ ఇక వే2...
హైదరాబాద్ : ఇప్పటివరకు నెట్లో ఉచిత ఎస్ఎంఎస్ సేవలందించిన వేటూ ఎస్ఎంఎస్ డాట్‌కమ్ (way2sms.com) ఇపుడు వే2గా మారింది. దాదాపుగా 2 మిలియన్ల పెట్టుబడితో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంతోపాటు ఎనిమిది భారతీయ భాషలలో ఉచిత ఎస్ఎంఎస్లు,న్యూస్ కంటెంట్‌ను అందించనున్నట్లు సంస్ధ సీఈవో రాజు వనపాల తెలిపారు.
దీనికి సంబంధించి కొంత మంది కంటెంట్ రైటర్స్‌ని కూడా నియామకం చేసుకున్నామని ఆయన తెలిపారు. వినియోగదారులకు యాడ్స్ చికాకు ఉండకుండా ఎస్ఎంఎస్ సేవలును మరింత పటిష్ట పరుస్తున్నట్లు సీఈవో రాజు వనపాల అన్నారు. 5 మిలియన్ యూజర్లు ఈ యాప్‌ను వాడుతున్నారని వీటి సంఖ్యను భారీగా పెంచుకోనున్నట్లు ఆయన తెలియచేశారు.