Ways and Means
-
రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్బీఐ భారీ షాక్!
ముంబై: మహమ్మారి కరోనా పరిస్థితిలో మెరుగుదల దృష్ట్యా, రాష్ట్రాలు– కేంద్ర పాలిత ప్రాంతాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లను (డబ్ల్యూఎంఏ) రూ.51,560 కోట్ల నుంచి రూ.47,010 కోట్లకు తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం నిర్ణయించింది. ఆదాయాలు– చెల్లింపులకు మధ్య అసమతుల్యతను నివారించడానికి ప్రభుత్వాలకు ఆర్బీఐ ఇచ్చే తాత్కాలిక అడ్వాన్‌లే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. కోవిడ్–19కి సంబంధించిన అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని, ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు డబ్ల్యూఎంఏ పరిమితిని రూ.51,560 కోట్లకు పెంచింది. ఇది మార్చి 31వ తేదీ వరకూ అమల్లో ఉంది. కోవిడ్–19 నియంత్రణలను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూఎంఏ, ఓవర్ డ్రాఫ్ట్ టైమ్‌లైన్‌ను యథాస్థితికి తీసుకురావాలని ఆర్బీఐ సమీక్షా సమావేశం నిర్ణయించినట్లు సెంట్రల్ బ్యాంక్ అధికారిక ప్రకటన తెలిపింది. నేటి నుంచి అమల్లోకి... 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పొందే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్)... భారత ప్రభుత్వం జారీ చేసిన సెక్యూరిటీలలో వారి పెట్టుబడుల పరిమాణానికి అనుసంధానమై ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవర్ డ్రాఫ్ట్‌పై వడ్డీ రేటు రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు– రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) ముడిపడి ఉంటుందని పేర్కొంది. అడ్వాన్స్ బకాయి ఉన్న అన్ని రోజులకు వడ్డీని వసూలు చేయడం జరుగుతుందని కూడా తెలిపింది. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో భారత ప్రభుత్వానికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ. 1,50,000 కోట్లుగా ఆర్బీఐ నిర్ణయించింది. -
ఎగుమతిదారులకు ఆర్బీఐ ఊరట
ముంబై: ఎగుమతిదారులకు ఆర్బీఐ ఉపశమన చర్యలను ప్రకటించింది. కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వస్తు, సేవల ఎగుమతిదారులకు ఊరట కల్పించింది. విదేశీ కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు స్వీకరించడం, భారత్‌కు పంపుకునేందుకు 15 నెలల గడువు ఇచ్చింది. ఎగుమతి చేసిన తేదీ నుంచి ఈ గడువు అమల్లోకి వస్తుంది. అది కూడా ఈ ఏడాది జూలై 31 వరకు ఎగుమతి చేసే వాటికి ఇది వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ గడువు ఎగుమతి చేసిన నాటి నుంచి 9 నెలలుగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘వేస్ అండ్ మీన్స్’ కింద తాను ఇచ్చే రుణాల పరిమితిని 30% పెం చాలని నిర్ణయించింది. ప్రభుత్వాల ఆదా యాలు, చెల్లింపుల మధ్య అంతరాన్ని అధి గమించేందుకు వేస్‌అండ్‌మీన్స్ కింద తాత్కాలిక రుణాలను ఇస్తుంటుంది. వాస్తవానికి వేస్‌అండ్‌మీన్స్ పరిమితిని సమీక్షించేందుకు ఆర్బీఐ ఓ సలహా కమిటీని ఏర్పాటు చేయగా, కమిటీ నుంచి నివేదిక ఇంకా రావాల్సి ఉంది. కౌంటర్ సైక్లికల్ క్యాపిటల్ బఫర్ (సీసీవైబీ)ను ప్రస్తుతం అమలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు సమయానుకూలంగా నిర్వహించాల్సిన నగదు నిల్వలను సీసీవైబీగా పేర్కొంటారు. -
వేస్ అండ్ మీన్స్ను ఆశ్రయించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: చరిత్ర పునరావృతమైంది. రాష్ట్రం మళ్లీ ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. గతంలో చంద్రబాబు పాలనలో తరచూ వేస్ అండ్ మీన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.బాబు తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన 1995 నుంచి తిరిగి గద్దె దిగేవరకు రాష్ట్రానిది ఓవర్ డ్రాఫ్టుల పరిస్థితే. మళ్లీ అదే గడ్డు పరిస్థితిని ఇప్పుడు ఆయన హయాంలోనే రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రంతో మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవని తెలిపారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ప్రభుత్వం వేజ్ అండ్ మీన్స్ను ఆశ్రయించింది. సోమవారం రూ.470 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లింది. వేస్ అండ్ మీన్స్కు వె ళ్లడం అంటే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడమే. ఈ విధానంలో రూ.1,500 కోట్లవరకు వెళ్లవచ్చని రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్నారు. ఆపై అవకాశం లేదు. ఈ నిధులు అయిపోతే ఇక ఓవర్‌డ్రాఫ్ట్ ఒక్కటే దిక్కు. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఓవర్‌డ్రాఫ్టుకు త్వరలో వెళ్లవచ్చని తెలుస్తోంది. ఆ దిశకూ వెళ్లే అవకాశముందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఇక బడ్జెట్లో పేర్కొన్న మేరకు రాష్ట్రం తన సెక్యూరిటీల విక్రయం ద్వారా జనవరి నుంచి మార్చి వరకు రూ.3 వేల కోట్లు అప్పు చేసే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ఇదివరకే కేంద్రం ఇందుకు అనుమతించింది. ఈ అప్పు చేసుకునే అవకాశమున్నప్పటికీ దాన్ని వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్కు వెళ్లడం గమనార్హం. -
ఆర్థిక చిక్కుల్లో రాష్ట్రం
వేస్ అండ్ మీన్స్ను ఆశ్రయించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: చరిత్ర పునరావృతమైంది. రాష్ట్రం మళ్లీ ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. గతంలో చంద్రబాబు పాలనలో తరచూ వేస్ అండ్ మీన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.బాబు తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన 1995 నుంచి తిరిగి గద్దె దిగేవరకు రాష్ట్రానిది ఓవర్ డ్రాఫ్టుల పరిస్థితే. మళ్లీ అదే గడ్డు పరిస్థితిని ఇప్పుడు ఆయన హయాంలోనే రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రంతో మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవని తెలిపారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ప్రభుత్వం వేజ్ అండ్ మీన్స్ను ఆశ్రయించింది. సోమవారం రూ.470 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లింది. వేస్ అండ్ మీన్స్కు వె ళ్లడం అంటే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడమే. ఈ విధానంలో రూ.1,500 కోట్లవరకు వెళ్లవచ్చని రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్నారు. ఆపై అవకాశం లేదు. ఈ నిధులు అయిపోతే ఇక ఓవర్‌డ్రాఫ్ట్ ఒక్కటే దిక్కు. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఓవర్‌డ్రాఫ్టుకు త్వరలో వెళ్లవచ్చని తెలుస్తోంది. ఆ దిశకూ వెళ్లే అవకాశముందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఇక బడ్జెట్లో పేర్కొన్న మేరకు రాష్ట్రం తన సెక్యూరిటీల విక్రయం ద్వారా జనవరి నుంచి మార్చి వరకు రూ.3 వేల కోట్లు అప్పు చేసే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ఇదివరకే కేంద్రం ఇందుకు అనుమతించింది. ఈ అప్పు చేసుకునే అవకాశమున్నప్పటికీ దాన్ని వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్కు వెళ్లడం గమనార్హం.