ఎగుమతిదారులకు ఆర్‌బీఐ ఊరట | Covid-19: RBI announces relief for exporters | Sakshi
Sakshi News home page

ఎగుమతిదారులకు ఆర్‌బీఐ ఊరట

Published Thu, Apr 2 2020 6:17 AM | Last Updated on Thu, Apr 2 2020 6:17 AM

Covid-19: RBI announces relief for exporters - Sakshi

ముంబై: ఎగుమతిదారులకు ఆర్‌బీఐ ఉపశమన చర్యలను ప్రకటించింది. కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వస్తు, సేవల ఎగుమతిదారులకు ఊరట కల్పించింది. విదేశీ కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు స్వీకరించడం, భారత్‌కు పంపుకునేందుకు 15 నెలల గడువు ఇచ్చింది. ఎగుమతి చేసిన తేదీ నుంచి ఈ గడువు అమల్లోకి వస్తుంది. అది కూడా ఈ ఏడాది జూలై 31 వరకు ఎగుమతి చేసే వాటికి ఇది వర్తిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ గడువు ఎగుమతి చేసిన నాటి నుంచి 9 నెలలుగానే ఉంది.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ కింద తాను ఇచ్చే రుణాల పరిమితిని 30% పెం చాలని నిర్ణయించింది. ప్రభుత్వాల ఆదా యాలు, చెల్లింపుల మధ్య అంతరాన్ని అధి గమించేందుకు వేస్‌అండ్‌మీన్స్‌ కింద తాత్కాలిక రుణాలను ఇస్తుంటుంది. వాస్తవానికి వేస్‌అండ్‌మీన్స్‌ పరిమితిని సమీక్షించేందుకు ఆర్‌బీఐ ఓ సలహా కమిటీని ఏర్పాటు చేయగా, కమిటీ నుంచి నివేదిక ఇంకా రావాల్సి ఉంది. కౌంటర్‌ సైక్లికల్‌ క్యాపిటల్‌ బఫర్‌ (సీసీవైబీ)ను ప్రస్తుతం అమలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు సమయానుకూలంగా నిర్వహించాల్సిన నగదు నిల్వలను సీసీవైబీగా పేర్కొంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement