WB govt
-
అమానుష ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లోని అమానవీయ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బెర్హంపూర్ లోని 430 పడకల మానసిక వ్యాధిగ్రస్థుల ఆస్పత్రిలో రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదును సుమోటో గా తీసుకున్న కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. అంజలి మెంటల్ హెల్త్ ఎన్జీవో సభ్యులు అగస్టు 15 న బెర్హంపూర్ లోని మెంటల్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ కట్టు బట్టలు కూడా లేకుండా ఉన్న రోగుల దయనీయ స్థితి వారి కంట పడింది. మురికిగా ఉన్న వారి పరుపులు, తీవ్ర దుర్వాసనతో కూడిన టాయిలెట్లను ఫోటోలు తీసి ఎన్ హెచ్ఆర్సీ కి పంపారు. దీనిపై స్పందించడానికి హాప్పిటల్ సూపరింటిండెంట్, వైద్య శాఖ అధికారులు నిరాకరించారు. -
ప్రభుత్వ ప్రకటనలు తీసుకుంటున్నారా? జాగ్రత్త!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తన సభ్యులకు సూచించింది. ఐఎన్ఎస్ కార్యవర్గం కమిటీ సోమవారం ఇక్కడ సమావేశమైంది. తన సభ్య పత్రికలకు కొన్నింటికి ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రకటనల బిల్లులు చెల్లించకపోవడంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా పరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల డబ్బులు రాక ఈ పత్రికలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే బకాయిలు చెల్లించాలని కార్యవర్గం కోరినట్లు ఐఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి వి.శంకరన్ ఓ ప్రకటలో తెలిపారు. గత ప్రభుత్వ హయాం నాటి బకాయిలను చెల్లించొద్దని బెంగాల్ ప్రభుత్వం అనుకుంటోదన్న వార్తలపై కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ఈ వైఖరి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని కార్యవర్గం పేర్కొనట్లు తెలిపారు.