Weapons Transfer
-
అతీక్ బ్రదర్స్ హత్య: అష్రాఫ్ చివరి మాట గుడ్డూ గురించే.. ఎవరీ గుడ్డూ ముస్లిం?
న్యూఢిల్లీ: గుడ్డూ ముస్లిం.. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎవరీ గుడ్డూ అంటూ అంతా ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ శనివారం రాత్రి ముగ్గురు యువకుల కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ మరణించడం తెలిసిందే. కాల్పులకు క్షణాల ముందు అష్రాఫ్ నోట వచ్చిన చివరి మాట గుడ్డూ గురించే. మెయిన్ బాత్ యే హై కీ గుడ్డూ ముస్లిం... (నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం గుడ్డూ ముస్లిం...) అని అంటూనే సోదరులిద్దరూ కాల్పులకు బలయ్యారు. గుడ్డూ అతీక్ అహ్మద్ ముఖ్య అనుచరుడు. తుపాకుల బదులు బాంబులు వాడటం ఇతని స్టైల్. బాంబులు విసిరి ప్రత్యర్థులను అంతం చేయడంలో దిట్ట. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే ఉమేశ్ పాల్ హత్య జరిగింది. ఆ సమయంలో గుడ్డూ బైక్ వెనుక కూర్చొని నాటు బాంబులు విసురుతున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అతీక్ మరణానంతరం అతడి నేరసామ్రాజ్యం గుడ్డూ చేతికి వెళ్తుందని ప్రచారం సాగుతోంది. దాంతో యూపీ పోలీసుల నజర్ ఇప్పుడు అతనిపైనే ఉంది. ఉమేశ్ హత్య కేసులో 10 మంది నిందితుల్లో గుడ్డూ పేరూ ఉంది. ఆ పది మందిలో ఇప్పటిదాకా ఆరుగురు హతం కాగా గుడ్డూతో సహా మిగతా వారంతా పరారీలో ఉన్నారు. గుడ్డూ ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నమ్మినబంటు గుడ్డూ ముస్లిం ప్రయాగ్‌రాజ్‌లో పుట్టాడు. చిన్న వయసులోనే నేర సామ్రాజ్యంతో పరిచయం ఏర్పడింది. లక్నోకు మకాం మార్చి పలు నేరాల్లో పాలుపంచుకున్నాడు. బడా వ్యక్తులతో సన్నిహితంగా మెలిగాడు. ఓ టీచర్ హత్య కేసులో 1997లో అరెస్టయ్యాడు. బలమైన సాక్ష్యాల్లేక విడుదలయ్యాడు. బిహార్‌కు వెళ్లి నేరాలు కొనసాగించాడు. 2001లో మళ్లీ అరెస్టవగా అతీక్ బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం గుడ్డూ అనారోగ్యం పాలై పరిస్థితి విషమించగా అతీక్ రూ.8 లక్షలు ఖర్చు చేసి గుడ్డూను బతికించాడు. అందుకు కృతజ్ఞతగా ఉమేశ్‌పై గుడ్డూ బాంబులు విసిరి హత్య చేశాడు. అతీక్‌కు నమ్మినబంటుగా పేరుతెచ్చుకున్నాడు. అతీక్ కోసం పాకిస్తాన్ నుంచి పంజాబ్ మీదుగా ఆయుధాలను భారత్‌కు అక్రమంగా రవాణా చేసేవాడని పోలీసులు వెల్లడించారు. అన్నీ అనుమానాలే ప్రయాగ్‌రాజ్/లక్నో/న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్లు అతీక్, అష్రాఫ్ హత్య విషయంలో పోలీసుల తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అంతటి కరడుగట్టిన నేరగాళ్లను రాత్రిపూట ఎందుకు ఆసుపత్రికి తీసుకొచ్చారు? పైగా వారున్న వాహనాన్ని గేటు బయటే ఆపి నడిపించుకుంటూ ఎందుకు వచ్చారు? మీడియా కంటపడకుండా ఆసుపత్రి లోపలి దాకా వాహనంలో ఎందుకు తీసుకురాలేదు? పైగా ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టు విచారణలో సోదరులిద్దరూ ఒప్పుకున్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటి కేసుల్లో నిందితుల్ని మీడియాతో సహా ఎవరి కంటా పడనివ్వకూడదు. దాన్నీ తుంగలో తొక్కారు. హంతకులు ముగ్గురూ విలేకరుల ముసుగులో వచ్చి కాల్పులు జరపడం తెలిసిందే. మీడియా ప్రతినిధులను తనిఖీ చేయకుండానే గ్యాంగ్స్టర్ల దగ్గరికి అనుమతించడం వెనక కుట్ర ఉండొచ్చంటున్నారు. వారు 20 తూటాల దాకా కాల్చినా నిందితుల వెన్నంటే ఉన్న పోలీసుల్లో మాత్రం ఎవరికీ ఏమీ కాకపోవడం నమ్మశక్యంగా లేదంటున్నారు. నిందితులను సోమవారం ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు. విచారణకు సిట్ అతీక్ శరీరంలో 9 తూటాలున్నట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. 8 తూటాలు ఛాతీ, వీపు నుంచి దూసుకెళ్లగా మరోటి తలలో కనిపించింది. అష్రాఫ్ తలపై ఒకటి, వీపుపై నాలుగు తూటా గాయాలను గుర్తించారు. ఈ హత్యోదంతంపై దర్యాప్తుకు సతీశ్ చంద్ర, సత్యేంద్ర ప్రసాద్, ఓం ప్రకాశ్ సభ్యులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనిపై విచారణకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ వేయడం తెలిసిందే. -
ఇరాన్ అక్రమ ఆయుధ రవాణాకు అమెరికా చెక్
దుబాయ్: ఇరాన్ నుంచి యెమెన్‌కు ఆయుధాల అక్రమ రవాణాను అమెరికా అడ్డుకుంది. ఒమన్, పాకిస్తాన్ సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో వెళ్తున్న చేపలు పట్టే నౌకను అమెరికా నావికా దళాలు అడ్డగించి 1,400 కలష్నికోవ్ తరహా రైఫిళ్లు, మెషీన్ గన్స్, రాకెట్ గ్రనేడ్ లాంచర్లతోపాటు దాదాపు 2.3 లక్షల రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. చాన్నాళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌కు ఇచ్చేందుకు వీటిని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలపై హౌతీ రెబల్స్ పోరు కొనసాగిస్తున్నారు. ఆయుధాలను అమెరికా క్షిపణి విధ్వంసక యూఎస్ఎస్ ఓకేన్ యుద్ధ నౌకలోకి ఎక్కించి, చేపల పడవను సముద్రంలో ముంచేశారు. -
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. బ్రహ్మోస్‌ది 500 కి.మీల రేంజ్ కాగా, నిర్భయ్‌ది 800 కి.మీ.ల రేంజ్. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్ క్షిపణి 300 కి.మీ.ల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్ సిద్ధంగా ఉంచింది. ఎస్‌యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్‌నికోబార్‌లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద నిర్భయ్ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశ్ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్ క్షిపణిలోని రాడార్ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్‌ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్ దగ్గరలోని దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్‌ను ఆవిష్కరించిన రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్ఎఫ్ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయించారు. భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రాజ్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్‌నాథ్ చెప్పారు. -
ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లద్దాఖ్‌లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమైంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కోవడానికి గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని తరలించింది. వచ్చే నాలుగు నెలలు శీతాకాలంలో ఎత్తయిన పర్వత ప్రాంతమైన లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో చలి మైనస్ 25 డిగ్రీల వరకు వెళుతుంది. ఆ సమయంలో డ్రాగన్ దేశం ఎలాంటి కుయుక్తులు పన్నినా దీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్టు ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని చేరవేయడం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నారవాణే, మరికొందరు కమాండర్లతో బృందంగా ఏర్పడి స్వయంగా పర్యవేక్షించారు. జూలై నుంచి మొదలు పెట్టిన ఈ ప్రక్రియని పకడ్బందీ ప్రణాళికతో నరవాణె రూపొందించి అమలయ్యేలా చూశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు తూర్పు లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాలైన చుషుల్, డెమ్‌చోక్‌లకు టీ–90, టీ–72 ట్యాంకులు, గన్స్, పదాతిదళానికి అవసరమయ్యే వాహనాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా 16 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతంలోని శిబిరాల్లో ఉండే జవాన్ల కోసం భారీగా ఆహార పదార్థాలు, దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, చమురు, చలి నుంచి రక్షణకి హీటర్లు తరలించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లద్దాఖ్‌లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామగ్రిని చేరవేయడం ఇదే మొదటిసారి. ఈ తరలింపు అత్యంత భారీ స్థాయిలో జరిగింది’’అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. రక్తం గడ్డ కట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకి అందించారు. ఈ సామగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన సి–130జే సూపర్ హెర్క్యులస్, సీ–17 గ్లోబ్‌మాస్టర్ హెలికాప్టర్లను వినియోగించారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఆ దేశం అంగీకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా మూడు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది. -
కశ్మీర్‌కు భారీగా ఆయుధాలు పంపించండి!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పంపించాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్ర చర్యలకు పాల్పడేందుకు భారత వ్యతిరేక శక్తులకు మరింత సాయమందించాలని సూచించిందని నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ ప్ర భుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల, ఈ ప్రాం తంలో భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై చైనా తయారీ మార్కిం గ్స్ ఉన్నట్లు గుర్తించారు. చొరబాట్లకు వీలు లేకుం డా భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఉగ్రవాదులను కానీ, ఆయుధాలను కానీ కశ్మీర్లోకి పంపించడం పాకిస్తాన్‌కు సాద్యం కావడంలేదు. దాంతో, ఎట్టి పరిస్థితుల్లో శీతాకాలం ప్రారంభమయ్యేలోపు సాధ్యమైనంత భారీ స్థాయిలో ఉగ్రవాదులను, ఆయుధాలను కశ్మీర్‌లోయలోకి పంపించాలని ఐఎస్ఐ భావిస్తోంది. నియంత్రణ రేఖ వెంట చొరబాట్లను అడ్డుకునే ఒక సమర్ధవంతమైన ప్రణాళికను భారత భద్రతాదళాలు రూపొందించాయి. గత 10 రోజుల్లో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ అస్థానా, సీఆర్పీఎఫ్ చీఫ్ ఏపీ మహేశ్వరి కశ్మీర్లో పర్యటించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ‘చొరబాటుదారుల విషయంలో భారత బలగాలు వ్యవహరించే తీరును ఐఎస్ఐ అధ్యయనం చేసింది. సాధారణంగా ఆయుధం లేకుండా, ఎవరైనా చొరబాటుకు ప్రయత్ని స్తే.. భారత బలగాలు కాల్పులు జరపవు. అందువల్ల ఆయుధాలు లేకుండా, చొరబాటుదారులను పంపించడం, ఆ తరువాత డ్రోన్లు, ఇతర మార్గాల ద్వారా ఆయుధాలను పంపించడం.. అనే వ్యూహాన్ని వారు ప్రారంభించారు. దానివల్ల చొరబాటుదారులు నియంత్రణ రేఖ వద్దనే కాల్చివేతకు గురయ్యే పరిస్థితి ఉండదు’ అని పాక్ ఆలోచనను పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ‘కశ్మీర్ లోయలో భారత వ్యతిరేక రిక్రూట్మెంట్లు పెరిగాయి. అయితే, వారికి ఆయుధాలు సమకూర్చడం సమస్యగా మారింది. అందువల్ల డ్రోన్లు, క్వాడ్కాప్టర్ల ద్వారా ఆయుధాలు పంపించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ఉత్తర కొరియాను రెచ్చగొడుతుంది వాళ్లే...
సాక్షి, న్యూయార్క్ : ఓవైపు ఉత్తర కొరియా అణు క్షిపణుల పరీక్షలపై ప్రపంచ దేశాలన్నీ అసహనంతో ఉండగా.. అమెరికా రచయిత, రక్షణ పరిశోధకుడు గోర్డాన్ చాంగ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. చైనానే ఉత్తర కొరియాకు ఆయుధాలను సరఫరా చేస్తోందంటూ ప్రకటన చేశారు. మరియా బట్రిరోమో ‘మార్నింగ్స్ విత్ మరియా’ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘‘వారి(ఉత్తర కొరియా) అణ్వాయుధ సామర్థ్యం వెనుక చైనా హస్తం ఉంది. జూలైలో జపాన్ మీదుగా నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణుల పరీక్షకు ప్రధాన సామాగ్రిని సమకూర్చింది డ్రాగన్ కంట్రీనే. పైగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య తీవ్రమైన ఉద్రిక్తకరమైన పరిస్థితులను చైనా సొమ్ము చేసుకుంటోంది. రెండు దేశాల మధ్య సమస్యను మరింత పెద్దగా చేసేందుకు చేయాల్సినవన్నీ చేస్తోంది’’ అని గోర్డాన్ ఆరోపించారు. అమెరికా రక్షణ పరిశోధకుడు, తూర్పు ఆసియా భద్రత నిపుణుడు గోర్డాన్ చాంగ్ ‘ది కమింగ్ కొలాప్స్ ఆఫ్ చైనా’ పుసక్తం ద్వారా రచయితగా కూడా పరిచయస్తుడే. చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్.. అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇన్నాళ్లూ వాటిని బంకర్లలో దాచిన ఉత్తరకొరియా ఇప్పుడు వాటిని పరీక్షిస్తూ తమ బలం చాటే యత్నం చేస్తోందని ఆయన తెలిపారు. ఇరు దేశాలతో ఒకేసారి దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించటం ద్వారా చైనా నాటకాలాడుతోందని ఆయన అంటున్నారు. ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు విధించేలా చైనాపై ఒత్తిడి తేవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గోర్డాన్ కోరుతున్నారు. -
ఆయుధాల కొనుగోళ్లలో భారత్ నం.2
వాషింగ్టన్: అమెరికా నుంచి 2008–15 మధ్య కాలంలో భారీగా ఆయుధాలను కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2008–15 మధ్య అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు కోసం భారత్ 34 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఈ జాబితాలో అమెరికాతో 93.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్న సౌదీ అరేబియా తొలిస్థానం దక్కించుకుంది. కాంగ్రెసనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంప్రదాయక ఆయుధాల బదిలీ, 2008–15’పేరిట తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఇదే నివేదికలో పొందు పరిచిన మరో జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2015 ఏడాదిలో ఆయుధాల అంతర్జాతీయ వ్యాపారం అత్యధికంగా చేసిన దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో నిలిచింది. 2015లో 40 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా వివిధ దేశాలకు విక్రయించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్..అమెరికా అమ్మిన ఆయుధాల్లో సగం కూడా విక్రయించలేదు.