webportal
-
దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్
సాక్షి, అమరావతి: కుటుంబ సమేతంగా అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలని అనుకుంటున్నవారు ఇంతకు ముందులా ఎక్కువగా హైరానా పడాల్సిన పనిలేదు. 10–15 రోజుల ముందే వ్రతం టికెట్‌ను ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లాలనుకునే వారు నెలరోజుల ముందే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఆలయం వద్ద దేవదాయశాఖ గదులను బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో పలు ఆలయాల్లో వివిధ రకాల పూజలు, దర్శన టికెట్లతోపాటు ఆయా ఆలయాల వద్ద నివాసిత గదుల బుకింగ్ వంటివన్నీ ఇప్పుడు ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చింది. పూజలు, దర్శనం టికెట్లు, వసతి గదులను ఆలయం వద్దకు వెళ్లి మాత్రమే తీసుకోవాల్సిన ఇబ్బందులు తొలిగిపోయాయి. తాము వెళ్లే తేదీని ముందే నిర్ణయించుకున్న భక్తులు ఇంటివద్ద నుంచే ముందుగానే సేవా టికెట్లను, గదులను బుక్ చేసుకోవచ్చు. తమ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటిలో ఈ తరహా సేవలన్నీ ఉమ్మడిగా ఒకచోట ఆన్లైన్లో పొందేందుకు దేవదాయ శాఖ కొత్తగా https://www.aptemples.ap.gov.in వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని ఆలయాల్లో కొన్ని రకాల సేవలకు మాత్రమే దేవదాయశాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్ నిర్వహించగా.. ఇప్పుడు మొదటి దశలో 175 ప్రముఖ ఆలయాలన్నింటిలో అన్ని రకాల సేవలను ఈ కొత్త వెబ్‌పోర్టల్ ద్వారా భక్తులు ముందస్తుగా పొందేందుకు వీలు కల్పించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, మహానంది, విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి, అంతర్వేది, అరసవెల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, కసాపురం నెక్కింటి ఆంజనేయస్వామి.. మొత్తం 16 ఆలయాల్లో స్వామి సేవలు, దర్శన టికెట్లు, గదుల కేటాయింపు వంటివన్నీ ముందస్తుగానే ఆన్లైన్లో పొందేందుకు అందుబాటులోకి ఉంచింది. అడ్వాన్స్ బుకింగ్ గడువు వివిధ ఆలయాల్లో అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా నిర్ణయించారు. మొదటి దశలో మొత్తం 175 పెద్ద ఆలయాల్లో, తర్వాత దశలో ఓ మోస్తరు ఆలయాల్లోనూ ఈ తరహా ముందస్తు ఆన్లైన్ సేవలు ఈ వెబ్‌పోర్టల్ ద్వారానే అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. -
పిల్లలు లేరా.. అయితే ఉందిగా ఒక మార్గం!
నెహ్రూనగర్(గుంటూరు జిల్లా): పండంటి బిడ్డ కోసం పెళ్లయిన దగ్గర నుంచి దంపతులంతా తాపత్రయపడుతుంటారు. అయితే, ప్రస్తుత యాంత్రిక జీవనంలో దాన్ని నోచుకోక ఎంతో మంది ఆవేదనకు గురవుతున్నారు. పిల్లలు పుట్టడం కష్టతరమవుతుంది. కొంత మంది ఎంతో ఖర్చుపెట్టి కృత్రిమంగా పిల్లల్ని కంటున్నారు. మరికొంత మంది అదీ కూడా అవకాశం లేక అల్లాడుతున్నారు. అటువంటి వారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. చదవండి: సీతా ఫలంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? 2011 సంవత్సరం నుంచి అందుబాటులోకి దత్తత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2011 నుంచి చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని నియమ, నిబంధనల్ని ఏర్పాటు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 149 మంది చిన్నారుల్ని స్వదేశంలో, ఏడుగురిని ఇతర దేశాల వారికి అధికారులు దత్తత ఇచ్చారు. చిన్నారుల్ని దత్తతకు ఇచ్చేటప్పుడు అన్ని నియమ, నిబంధనలకు లోబడి అర్హత కలిగిన దంపతులకు మాత్రమే అప్పగిస్తారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి దత్తత తీసుకునే దంపతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న www.cara. nic.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦వెబ్ సైట్లోకి వెళ్ళి న్యూ రిజి్రస్టేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦బేసిక్ ఇన్ఫార్మేషన్ ఇవ్వాలి( వయస్సు, పెళ్లి తదితర వివరాలు) ♦దంపతుల్లో ఎవరిదో ఒకరి పాన్‌కార్డ్‌తో రిజిస్టర్ అయిన వెంటనే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ (మెయిల్‌కి, మొబైల్) వస్తుంది. ♦యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయిన తరువాత తగిన ధ్రువ పత్రాలైన రెసిడెన్స్ సరి్టఫికెట్, బర్త్ సరి్టఫికెట్(10వ తరగతి మార్క్ లిస్ట్, 10లోపు చదివిన వారైతే స్టడీ సర్టిఫికెట్స్), ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఉద్యోగి అయితే జీతం సరి్టఫికెట్, ఇతరులైతే 1.50లక్షకు పైగా పత్రం పొందాల్సి ఉంటుంది), పెళ్లి సరి్టఫికెట్, డాక్టర్ సర్టిఫికెట్ ( ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు, ప్రాణాంతకరమైన వ్యాధులుగాని లేవని ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ డాక్టర్ నుంచి) తీసుకోవాలి. –దంపతులిద్దరూ కలిసి దిగిన ఫోటోల్ని వెబ్సైట్లో ఆప్‌లోడ్ చేయాలి. ♦తరువాత ఈ వివరాలన్నీ మహిళా, శిశు సంక్షేమ శాఖ లాగిన్లోకి వెళతాయి. ♦ఇచ్చిన వివరాలు సక్రమంగా ఉన్నాయా...లేవా? అని శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేకంగా కేటాయించిన సిబ్బంది దంపతుల ఇంటికి వెళ్లి విచారణ(హోం స్టడీ) చేపడతారు. ♦అంతా సక్రమంగా ఉంటే ఆ వివరాల్ని ఐసీడీఎస్ పీడీ లాగిన్‌కి వెళుతుంది. ♦అక్కడ నుంచి వారి సీనియార్టీ ప్రకారం చిన్నారుల్ని దత్తత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ♦అర్జీదారు కోరుకున్న బిడ్డను రిఫర్ చేస్తూ వారి మొబైల్‌కు సమాచారం అందుతుంది. ఆ సమాచారం మేరకు 48 గంటల్లో కారా వెబ్ సైట్లో లాగిన్ అయి సదరు బిడ్డ నచ్చితే రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ♦రిజర్వు చేసుకున్న బిడ్డను ఇరవై రోజుల్లోపు పోలికలు సరిపోల్చుకుని బిడ్డ నచ్చినట్లయితే, దత్తత ఏజెన్సీ వద్దకు వెళ్ళి ఆమోదం తెలియజేసి రూ.40వేల డీడీ సమరి్పంచి పొందవచ్చు. ♦బిడ్డను పొందిన వారం రోజుల్లోపు సదరు దత్తత ఏజెన్సీ వారు సమరి్పంచిన ధ్రువపత్రాలన్నింటినీ స్థానిక కుటుంబ న్యాయస్థానంలో సమరి్పంచి కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేస్తారు. ♦ప్రతిది వారి మెయిల్, మొబైల్‌కి ఆప్ టూ డేట్ కారా వెబ్ సైట్ నుంచి వస్తూ ఉంటుంది. ♦ప్రస్తుతం 2018–19 ఎన్రోల్ చేసుకున్న వారికి సీనియార్టీ ప్రకారం పూర్తి పారదర్శకంగా పిల్లలను దత్తత కింద అప్పగిస్తున్నారు. ♦పిల్లల్ని అప్పగించిన తరువాత కూడా రెండు సంవత్సరాల పాటు దత్తత తీసుకున్న చిన్నారుల్ని శిశు సంక్షేమ శాక అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. వయస్సును బట్టి బిడ్డల అప్పగింత ♦తల్లిదండ్రుల వయస్సు 55 సంవత్సరాలు మించకూడదు. ♦తల్లి, తండ్రి వయస్సు ఇద్దరిది కలిపి 90 సంవత్సరాలుగా ఉంటే(తండ్రికి 50, తల్లికి 40 వయస్సు) 0 నుంచి 4 సంవత్సరాల పాప/బాబు దత్తత ఇస్తారు. ఇద్దరి వయస్సు కలిపి 100 సంవత్సరాలు ఉంటే 4 నుంచి 8 సంవత్సరాలలోపు పిల్లల్ని దత్తతకు ఇస్తారు. ♦సింగిల్ పేరెంట్ 45 సంవత్సరాలు కలిగి ఉన్న తండ్రికి మగ బిడ్డను ఇస్తారు. అదే తల్లికి అయితే మగ/ఆడ బిడ్డను దత్తకు ఇస్తారు. పారదర్శకంగా ప్రక్రియ దత్తత ప్రక్రియ అంతా కూడా కారా అనే వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా జరుగుతుంది. పిల్లలు కావాలనుకున్న దంపతులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే వారి సీనియార్టీ ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాలలోపు వయస్సున్న పిల్లలను దత్తత తీసుకోవచ్చు. జిల్లాలో శిశు గృహాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్ని పెంచలేము అనే వారు ఇక్కడ అందజేస్తే వారిని దత్తత ఇస్తారు. – బి. మనోరంజని, పీడీ, ఐసీడీఎస్ గుంటూరు -
జిల్లాపై సర్కారు చిన్నచూపు
– కృష్ణా పుష్కరాల వెబ్సైట్లో కనిపించని జిల్లా సమాచారం – ఆంధ్రా ప్రాంత జిల్లాలకే దక్కిన ప్రాధాన్యం సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా.. ఒకప్పటి ఆంధ్రరాష్ట్ర రాజధాని. రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని జిల్లా. దక్షిణ కాశీగా పేరుగాంచిన.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం కూడా ఇదే జిల్లాలో ఉంది. పవిత్ర కష్ణానది కూడా కర్నూలు జిల్లా వద్దనే ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. సంగమేశ్వరం వద్ద సప్తనదులతో కలిసి శ్రీశైల పాతాళాగంగలో మల్లన్న పాదాలను తాకి అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు చేరుతుంది. అంతటి ప్రాశ్యస్తం కలిగిన జిల్లాను కృష్ణా పుష్కరాల వేళ తెలుగుదేశం ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు భక్తుల్లో వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న పుష్కరాల సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసే వెబ్సైట్లో పొందుపరచకపోవడం భక్తుల వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. పోర్టల్‌లో జిల్లా పుష్కర సమాచారం ఏదీ: కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు దక్కాల్సిన ప్రచారం దక్కడం లేదని చెప్పడానికి ఇదో నిదర్శనం. సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రెండు ప్రాంతాల మధ్య విభేదాలు పెంచుతున్నాయి. తాజాగా కష్ణా పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం వెబ్ పోర్టల్‌ను అలాగే అండ్రాయిడ్ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. అందులో కర్నూలు జిల్లాకు స్థానం దక్కపోవడంపై సీమ నేతలు, ప్రజలు, భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో వీటిని నిర్వహించేందుకు సర్కారు అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం భారీ నిధులను సర్కారు వెచ్చించింది. అదేవిధంగా ఈ పుష్కరాల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రంపై దృష్టి సారించేలా కష్ణా పుష్కరాలకు సంబంధించిన వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్‌ను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ మూడు జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులు, ఘాట్ల వివరాలు, సౌకర్యాలు తదితర అంశాలను ఇందులో పొందుపరిచారు. అయితే కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వరం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పుష్కర వివరాలను మాత్రం అందులో పొందుపరచలేదు. జిల్లాలో జరుగుతున్న పుష్కర ఘాట్ల ఏర్పాట్లతోపాటు దేవాలయాల విశిష్టతకు సంబంధించిన సమాచారం వెబ్‌పోర్టల్, యాప్‌లలో లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కేంద్రంగా ప్రచార ఆర్భాటం: 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలకు సంబంధించిన వివరాల కోసం దేశవిదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వెబ్సైట్ పైనే ఆధారపడతారు. అలాంటి వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రభుత్వం అంది వచ్చిన ప్రతి అంశంపై రాజధాని కేంద్రంగా ప్రచార ఆర్భాటం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కల్కూర చంద్రశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.