Wedding gown
-
మాస్క్‌లకి పెళ్లి కళ
కరోనా మూలంగా మాస్క్‌లు రోజువారి జీవితాల్లో భాగమైపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్కులు వాడుతున్నారు. వీటిలో ఒకసారి వాడి పడేసేవే ఎక్కువ. దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని గ్రహించిన యూకే వెడ్డింగ్ ప్లానర్స్ వినూత్న ఆలోచనతో మాస్కులతో మంచి డ్రెస్‌ను డిజైన్ చేశారు. వాడి పడేసిన 1500 మాస్కులతో వెడ్డింగ్ గౌనును రూపొందించారు. రీ సైకిల్ చేసిన పీపీఈ కి ట్‌తో గౌనుకు ఆకారాన్ని తీసుకొచ్చి అందమైన తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌ను తయారుచేశారు. వెడ్డింగ్ ప్లానర్ వెబ్సైట్ ‘హిట్చ్‌డ్’ (Hitched) ఈ గౌను రూపకల్పనకు పూనుకోగా, డిజైనర్ సిల్వర్‌వుడ్ గౌనును రూపొందించారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్‌లో కేసులు తగ్గి వివిధ కార్యక్రమాలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో హిట్చ్‌డ్ మాస్కులతో సరికొత్త వెడ్డింగ్ గౌనును రూపొందించి మోడల్‌కు వేసి ఫోటోలు తీయడంతో ఈ గౌను వెలుగులోకి వచ్చింది. ‘‘ఏటా రూపొందించే వెడ్డింగ్ గౌన్లకు భిన్నంగా పర్యావరణ హితంగా సరికొత్త గౌన్లు తయారు చేయాలనుకున్నాం. ఈ క్రమంలోనే మాస్కులను ఈ విధంగా కూడా వాడవచ్చని మెస్సేజ్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే... వాడేసిన మాస్కులను శుభ్రపరిచి వెడ్డింగ్ గౌన్‌ను రూపొందించాం. మాస్కులతో వెడ్డింగ్ గౌన్ మరింత అందంగా వచ్చింది’’అని హిట్చ్‌డ్ ఎడిటర్ సారా అలార్డ్ చెప్పారు. -
పారాచూట్... ఫొటోషూట్
వెస్ట్రన్ వెడ్డింగ్‌లో బ్రైడల్ వేర్ ఇండియన్ ఫ్యాషన్‌లో బ్రైట్ వేర్ హద్దులు చెరిపేసి ఫొటోషూట్స్‌లో గ్రేట్‌గా వెలిగిపోతోంది పారాచూట్ డ్రెస్. పారాచూట్ మోడల్లో గౌన్లు మాత్రమే కాదు స్కర్ట్స్ కూడా రూపొందించారు డిజైనర్లు. గౌన్లు మాత్రం ఇప్పటికీ పాశ్చాత్యుల వివాహ సమయంలో పెళ్లికూతురు ధరించే డ్రెస్సులుగా పేరుపడిపోయాయి. ఇటీవల మన దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్స్, ప్రొఫైల్ పిక్స్.. కి ఈ పారాచూట్ డ్రెస్ తెగ సందడిచేస్తోంది. ప్లెయిన్ షిఫాన్, సిల్క్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించే ఈ డ్రెస్సు ధరిస్తే లీల్లీ, లావెండర్ పూలు గుర్తుకురాకుండా ఉండవు. రెక్కలు విప్పార్చుకుంటూ ఎగిరే సీతాకోకచిలుక కళ్లముందు మెదలకుండా ఉండదు. రక్షణ గౌను రెండవ ప్రపంచ యుద్ధంలో మేజర్ క్లాడ్ హెన్సింగర్కు జరిగిన ప్రమాదంలో పారాచూట్‌ను దుప్పటిగా ఉపయోగించాడు. తనను రక్షించిన నైలాన్ పారాచూట్ క్లాత్‌ను గౌనుగా రూపొందించమని తన ఫ్రెండ్ రూత్‌కు చెప్పాడు. రూత్ ఆ పారాచూట్‌తో వెడ్డింగ్ గౌను డిజైన్ చేసి, 1947లో జరిగిన వారి పెళ్లికి ధరించింది. ఆ తర్వాత ఆమె కూతురు, కోడలు కూడా వారి వివాహ సమయంలో ఈ గౌనును ధరించారు. ఈ పారాచూట్ మోడల్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ విహంగ డ్రెస్. ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి డ్రెస్సింగ్ -
తుపానులో ‘పెళ్లి’ తంటాలు.. ఫోటోలు వైరల్
కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదన్నట్టు.. వానొచ్చినా...వరదొచ్చినా.. తమ పెళ్లి ముచ్చట కాస్తా జరిగి తీరాల్సిందే అని ఒక జంట నిశ్చయించుకుంది. భారీ వరదల మధ్య ప్రమాదకరమైన నదిని దాటి మరీ ఈ జంట వివాహ వేడుకను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పెళ్లి దుస్తుల్లో వధూవరుల ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఒక్కటైన జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు. స్థానిక వార్తాపత్రిక ఫిలిప్పీన్ స్టార్ ప్రకారం,టైఫూన్ క్వింటా కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా వివాహబంధంతో ఒక్కట వ్వాలనుకున్నారు రోనీ గుళీపా, జెజిల్ మసూలా. వరదలతో పోటెత్తిన లుయాంగ్ నదిని దాటుకుని చర్చికి వెళ్లి అక్టోబర్ 23న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి గౌనులో వధువు, సూట్ ధరించిన వరుడు ఇద్దరూ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ జంటతో పాటు స్నేహితులు, బంధువులు కూడా ఇబ్బందులు పడుతూ పెళ్లికి హాజరు కావడం విశేషం. వేడుక అనంతరం అంతా ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పెళ్లి ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. బంధువుల్లో ఒకరైన జోసెఫిన్ బోహోల్ సబనాల్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఫ్యాషన్ సూత్ర..
అడుగుల్లో తడబాటు... మాటల్లో తత్తరపాటు... చూపుల్లో నునుసిగ్గులు... చెంపల్లో కెంపులు... ఇవన్నీ కలగలిసి కదలివచ్చే నవవధువు సొగసు చూడతరమా... సంప్రదాయం ఏదైతేనేం... అందం, అలంకారం ఆమెదే. పెళ్లి వేడుకలో అప్పటిదాకా ముచ్చట్లలో మునిగిపోయి ఉన్న అతిథులంతా అటెన్షన్లోకి వచ్చారంటే దాని అర్థం పెళ్లికూతురి ఆగమనమే. అందుకే అన్ని రకాల సంప్రదాయాల్లోనూ నవవధువు అలంకారానికి అంత ప్రాధాన్యత. ముఖ్యంగా క్రైస్తవుల వివాహ వేడుకల్లో అయితే టాక్ ఆఫ్ ది ఈవెంట్ వధువు ధరించే వెడ్డింగ్ గౌన్. పెళ్లి వేడుకల్లో ఒక్కో సంప్రదాయూనిది ఒక్కో విలక్షణత. ఏ సంప్రదాయుంలోనైనా పెళ్లిళ్లలో వధువు అలంకరణే కీలకం. నిజానికి నిశ్చితార్థం నాటి నుంచే పెళ్లి ఏర్పాట్లు మొదలవుతారుు. ఎప్పటికీ నిలిచిపోయే తీపి జ్ఞాపకంగా పెళ్లి వేడుకను వులచుకునేందుకు అందరూ తవు తవు సృజనాత్మకత మేరకు, వనరుల మేరకు తాపత్రయుపడతారు. అదే విధంగా క్రైస్తవుల పెళ్లిళ్లలో వధువు అలంకరణను అత్యంత కీలకంగా భావిస్తారు. క్రైస్తవుల పెళ్లి ఏర్పాట్లు సాధారణంగా పెళ్లి తేదీకి దాదాపు వుూడు నెలల వుుందుగానే మొదలవుతారుు. పెళ్లి, రిసెప్షన్లకు వేదికల ఎంపిక, ఆహ్వాన పత్రికల ఎంపిక, వుుద్రణ, తోటి పెళ్లికూతురి ఎంపిక, ఆభరణాలు, అలంకరణ సావుగ్రి, ఇతర యూక్సెసరీస్ కొనుగోలు వంటివన్నీ ఒక పద్ధతి ప్రకారం చకచకా సాగిపోతారుు. వీటన్నింటి హడావుడి ఒకెత్తయితే... వధువు ధరించే ఆభరణాలతో పాటు పెళ్లి రోజున వధువు ధరించే వెడ్డింగ్ గౌన్ ఒక్కటీ ఒకెత్తు. అందుకే దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి అందించేందుకు సిటీలో పలు బొటిక్‌లు సిద్ధంగా ఉన్నాయి. వెడ్డింగ్ వస్త్ర... క్రైస్తవుల పెళ్లిళ్లలో వధువులు సాధారణంగా స్వచ్ఛతకు సంకేతంగా తెలుపు రంగు గౌన్ ధరిస్తారు. నగరంలో ఈ వైట్ గౌన్స్‌ని రెడీమేడ్‌గా విక్రరుుంచే దుకాణాలు ఉన్నారుు. ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లెక్కలేనన్ని డిజైన్లలో వెడ్డింగ్ గౌన్లు దొరుకుతున్నారుు. గౌన్ల ధరలు చాలా వరకూ విభిన్న వర్గాలకు అందుబాటులోనే ఉంటున్నాయి. అయినా అదీ భరించలేని వారికి వెడ్డింగ్ డ్రెస్‌ను అద్దెకు ఇచ్చే షాపులూ ఉన్నారుు. అవేవీ నప్పవనుకుంటే, వుుందుగానే నిపుణులైన టైలర్ల వద్ద ప్రత్యేకంగా కుట్టించుకోవచ్చు. పెళ్లిలో తనకు తోడుగా ఉన్న తోటి పెళ్లికూతుళ్లకు కూడా వస్త్రాభరణాలను పెళ్లికూతురు కానుకగా ఇవ్వడం ఆనవారుుతీ. ఇందుకోసం కూడా వుుందుగానే వస్త్రాలను, ఆభరణాలను, ఇతర అలంకరణ సావుగ్రిని కొనుగోలు చేస్తారు. వెడ్డింగ్ గౌన్, చేతులకు గ్లౌస్, బొకే, ఇతర ఆభరణాలకు తోడుగా పెళ్లి రోజున వధువు వుుఖాన్ని పలచగా కప్పి ఉంచే మేలివుుసుగును ధరిస్తుంది. దీంతో పెళ్లి అలంకరణ పూర్తరుునట్లే. ఫ్యాషన్ సూత్ర.. పెళ్లికి ఎలాంటి గౌన్ ధరించాలనేది వుుందుగానే నిర్ణరుుంచుకోవాలి. బాల్ గౌన్, స్లింకీ నంబర్, ఏ-లైన్, ఫిష్ టెరుుల్ వంటి వెరైటీలు అందుబాటులో ఉన్నారుు. వీటన్నింటినీ ఓసారి ట్రై చేసి, తవు శరీరాకృతికి బాగా నప్పేది ఖరారు చేసుకోవాలి. భారత్‌లో ఎక్కువ వుందిది కాస్త డార్క్ కాంప్లెక్షన్. మేనివన్నెకు తగిన రంగులో వెడ్డింగ్ గౌన్ ఎంపిక చేసుకుంటే గ్రాండ్‌గా కనిపిస్తారు. తెలుపులోనే చిన్నచిన్న తేడాలతో ఐవరీ, క్రీమ్‌కలర్, స్నోవైట్ వంటి రంగుల్లో వెడ్డింగ్ గౌన్లు దొరుకుతున్నారుు. గోల్డ్, సిల్వర్ యూక్ససరీస్ వీటికి బాగా సూటవుతారుు. వీటికి అనుగుణంగానే అంబర్, పీచ్, రస్ట్, బ్రిక్ రెడ్, వార్మ్గ్రీన్, కేమెల్ వంటి రంగుల్లో కలర్థీమ్స్ ఎంచుకోవచ్చు. పెళ్లి సవుయుంలో వధువు చేత ధరించే బొకేలో సాధారణంగా తెలుపురంగు గులాబీలు లేదా ఆర్కిడ్స్ వాడతారు. గౌనుకు నప్పే బొకే ఎంపిక చేసుకుంటే, పెళ్లి వుండపంలో నవవధువు దేవకన్యలా మెరిసిపోతుంది. - నీతా సంజయ్‘జాస్పర్ బ్రైడల్ కలెక్షన్’ స్టోర్ -
.పెళ్లి గౌనుతో.. పదేళ్లుగా..
పెళ్లి గౌను వేసుకుని ఎంజాయ్ చేస్తున్న ఈ మహిళ.. గత పదేళ్లుగా ఇదే డ్రస్ వేసుకుంటోంది! నమ్మకున్నా.. ఇది నిజం. ఈమె పేరు జియాంగ్ జన్ఫెంగ్(47). చైనాలోని జిమోకు చెందిన జియాంగ్ నిరుపేద. 18 ఏళ్ల వయసులో ఈమెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి.. ఓ వయసు మళ్లిన వ్యక్తికి అమ్మేశారు. జియాంగ్ పెళ్లాడిన ఆ ముసలాడు ఈమెను చాలా చిత్రహింసలు పెట్టాడు. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. నిర్బంధంలో పెట్టాడు. చాన్నా ళ్లు చిత్రహింసలు భరించిన జియాంగ్ ఓరోజు అక్కడి నుంచి తప్పించుకుని.. పారిపోయింది. ఆమెకో మహిళ పరిచయమైంది. ఆశ్రయం కల్పించింది. తన సోదరుడు జూను పరిచయం చేసింది. జియాంగ్ జూకు నచ్చింది. జూకు జియాంగ్ నచ్చాడు. దీంతో 2004లో పెళ్లి చేసుకున్నారు. అన్నేళ్లు చిత్రహింసలు తప్ప.. జీవితంలో ఆనందమన్నది ఎరుగని జియాంగ్.. ఆ రోజును జీవితాంతం గుర్తుండిపోయేలా చేసేందుకు.. పెళ్లి గౌనును జీవితాంతం ధరించాలని నిర్ణయించింది. గత పదేళ్లుగా దాన్నే పాటిస్తోంది. పొలం పనుల్లోకి వెళ్లినా.. ఈ గౌనుతోనే పనిచేస్తుంది. అందరూ విచిత్రంగా చూసినా.. తన జీవితానికి వసంతాన్ని ప్రసాదించిన తన భర్త జూకు గుర్తుగా దీన్ని వేసుకుంటున్నట్లు ఆమె చెబుతోంది.