Wedding Insurance
-
పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమా
పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. దీన్ని తరాలు గుర్తిండిపోయేలా వైభవంగా జరపాలనుకుంటారు. పెళ్లి బట్టల షాపింగ్ నుంచి వధువు అత్తారింట్లో కాలుమోపే వరకు రూ.లక్షలు ఖర్చు చేస్తారు. మొన్నామధ్య అనంత్ అంబానీ పెళ్లికి ముఖేశ్ అంబానీ కుంటుంబం కోట్లల్లో ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయి. పెళ్లిలో ఎలాంటి అవాంతరం జరగకుండా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఆస్తి నష్టం కలిగి, బంధువులు గాయాలపాలైతే..పెళ్లి చేస్తున్న కుటుంబ సభ్యులకు తీరని వ్యథగా మారుతుంది. అలాంటి వారికోసం చాలా బీమా కంపెనీలు వివాహ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినా ఈ బీమా ఆర్థికంగా ఆదుకుంటుంది.వివాహ వేడుక స్థాయి, సర్వీసులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సర్వీసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది.లయబిలిటీ కవరేజీ..పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటిది జరిగితే ఈ కవరేజీ వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ థర్డ్ పార్టీకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు.ఏదైనా కారణాల వల్ల పెళ్లి రద్దైనా లేదా వాయిదా పడినా క్యాన్స్లేషన్ కవరేజీ ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. విలువైన వస్తువులు పాడైనా దాని కోసం ప్రత్యేకంగా కవరేజీ అందిస్తున్నారు. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా.. ‘అటైర్ కవరేజీ’ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవాలి. -
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్‌తో బ్యాండ్ బాజా బారాత్, షాన్‌దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్‌తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. -
బీమా కంపెనీల ఆఫర్.. పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు!
మన దేశంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం.. అంటే రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. పెళ్లి అనేది జన్మ జన్మల బంధం అని అంటారు. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు(మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్) అని అంటారు. అయితే, అలాంటి పెళ్లిళ్లు కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా లేదా రద్దు కావడం జరగుతుంటాయి. కేవలం గత రెండేళ్ల కాలంలో కరోనా కారణంగా అనేక పెళ్లిళ్లు వాయిదా పడిన సంఘటనలు, రద్దు అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి మరో రూపం ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా వివాహాలు రద్దయితే అటు ఆడపెళ్లి వారికి, ఇటు మగపెళ్లి వారికి చాలా ఆర్థిక నష్టం చేకూరుతుంది. అయితే ఇకపై ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి పెళ్లిళ్లపైనా కూడా పలు కంపెనీలు బీమాను అందిస్తున్నాయి. ఈ మేరకు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పేరుతో పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? వివాహ బీమా అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల వివాహం రద్దు అయిన, ఏదైనా ఇతర నష్టం జరిగిన భీమా కంపెనీలు డబ్బులు చెలిస్తాయి. అయితే, కొన్ని నిబందనలను మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వివాహ బీమా అనేది స్థూలంగా నాలుగు కేటగిరీల కింద వర్తిస్తుంది. లయబులిటీస్ కవరేజ్: పెళ్లి వేడుక సమయంలో జరిగే ప్రమాదాల వల్ల తృతీయపక్షాల ఆస్తులకు ఏమైనా నష్టం జరిగితే ఈ భీమా కవర్ చేస్తుంది. క్యాన్సిలేషన్ కవరేజ్: అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా పెళ్లి రద్దు కావడం వల్ల జరిగే నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. ఆస్తుల నష్టం: పెళ్లి వేడుకల సమయంలో యజమాని ఆస్తులకు ఏదైనా నష్టం కలిగితే ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత ప్రమాదం: కొన్ని సార్లు పెళ్ళికి అని బయలుదేరుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులకు ఎదురయ్యే ఖర్చులకు ఈ బీమా వర్తిస్తుంది. బీమా ప్రీమియం ఎంత? పెళ్లి అనివార్య కారణం వల్ల ఆగిపోయినప్పుడు లభించే వివాహ బీమా అనేది మీరు ఎంత బీమా చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి బీమా ప్రీమియం అనేది మీకు ఇచ్చే హామీ మొత్తంలో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు రూ.10 లక్షల వివాహ బీమా కావాలంటే, అప్పుడు మీరు రూ.7,500 నుంచి 15,000 ప్రీమియం చెల్లించాలి. (చదవండి: అయ్యో! అదృష్టం తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయిందే) -
ధీమాగా పెళ్ళి చేద్దాం
వెడ్డింగ్ ఇన్సూరెన్స్... ఇప్పుడిప్పుడే దేశంలో ప్రాచుర్యం పొందుతోంది. ఏదైనా అనుకోని సంఘటనల వల్ల పెళ్ళి వాయిదా పడినా లేక రద్దు అయిన సందర్భాల్లో చేసిన వ్యయానికి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ఈ బీమా వేటికి వర్తిస్తుంది? వీటి కాలపరిమితి ఎంత? ప్రీమియం ఎంత? వంటి అంశాలపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. భారతీయ సంప్రదాయంలో వివాహం ఓ అనిర్వచనీయమైన, అద్వితీయమైన వేడుక. భారతీయులు పెళ్లికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా భారీగా ఖర్చుచేస్తారు. దేశంలో సగటున ఒక్కో పెళ్ళికి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని ప్రాథమిక అంచనా. అదే ధనవంతులైతే ఈ ఖర్చు కోట్లలోనే ఉంటుంది. ఇంత వేడుకగా చేసుకునే కార్యక్రమం కొన్ని సందర్భాల్లో వాయిదా పడటమో, లేక రద్దు కావడమో జరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో అప్పటికే చేసిన ఖర్చు అంటే.. కల్యాణ మండపం, కేటరింగ్, డెకరేషన్ వంటి వాటికి ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. దీంతో ఆర్థికంగా తీవ్ర నష్టం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అక్కరకు వస్తుంది. వేటికి బీమా... ఏదైనా ప్రకృతి వైపరీత్యం, అగ్నిప్రమాదం, తీవ్రవాదుల దాడులు, బంద్‌ల వలన ఆగిపోయినా, పెళ్ళి కూతురు, పెళ్ళికొడుక్కి అస్వస్థత లేదా ప్రమాదం సంభవించినా, లేదా సమీప బంధువులు చనిపోవడం వలన ఆగిపోయిన సందర్భాల్లో ఈ బీమా కవరేజ్ వర్తిస్తుంది. పెళ్ళికొడుకు లేదా పెళ్ళి కూతురు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కొని వివాహం ఆగిపోతే కూడా బీమా రక్షణ లభిస్తుంది. ఇటువంటి సమయంలో పెళ్ళి కోసం చేసి, వెనక్కి తీసుకోలేని ఖర్చులను బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇవే కాకుండా కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ఇతర సంఘటనలు అంటే... పెళ్ళిలో ఏదైనా దొంగతనం జరిగితే, ఆహారం కలుషితమై దాని వలన అతిథులకు అస్వస్థత సంభవిస్తే వాటికి కూడా బీమా రక్షణ ఉంది. కట్నం కోసం, లేదా వరుడు, వధువుల మధ్య అపోహలతో వివాహం రద్దయిన సందర్భాల్లో, తీవ్రవాద సంబంధిత దాడులు, పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురు కిడ్నాప్ వంటి సంఘటనల వల్ల ఆగిపోతే మాత్రం బీమా రక్షణ ఉండదు. పాలసీ తీసుకునే ముందే వేటికి బీమా రక్షణ ఉంటుంది వేటికి ఉండదన్న విషయంపై అవగాహన పెంచుకోండి. ఎంతకాలం? సాధారణంగా ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌లు వారం రోజుల నుంచి 15 రోజుల వరకు బీమా రక్షణను కల్పిస్తాయి. పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురిని చేయడం, లేదా సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలు మొదలయ్యే 24 గంటల ముందు నుంచి పెళ్ళి తంతు ముగిసే వరకు బీమా రక్షణ ఉంటుంది. ప్రీమియం ఎంత? వీటికి చెల్లించే ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఎంచుకున్న బీమా మొత్తం ఆధారంగా ప్రీమియం ఉంటుంది. బీమా రక్షణ మొత్తాన్ని శుభలేఖల ముద్రణ, కేటరింగ్, కల్యాణ మండపాలు, రవాణా వంటివాటికి ఇచ్చిన అడ్వాన్స్‌ను బట్టి లెక్కిస్తారు. సాధారణంగా బీమా మొత్తంలో కనిష్టంగా 0.7% నుంచి గరిష్టంగా 2 శాతం వరకు ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు ఒక ప్రైవేటు బీమా కంపెనీ రెండు లక్షల నుంచి 8 లక్షల మొత్తానికి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కోసం రూ.3,800 నుంచి రూ.14,500 వరకు ప్రీమియం వసూలు చేస్తోంది. అదే పెళ్ళికి వచ్చిన వారికి కూడా బీమా రక్షణ కావాలంటే అదనంగా మరో రూ.1,000 చెల్లించాలి. ఎవరు ఇస్తున్నారు? దాదాపు అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలు వెడ్డింగ్ బెల్స్ పేరుతో ఈ పాలసీలను అందిస్తున్నాయి. అలాగే ప్రైవేటు కంపెనీలు ఐసీఐసీఐ లాంబార్డ్, బజాజ్ అలయెంజ్ వంటి కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇలా ప్రత్యేకంగా అందించకపోయినా ఈవెంట్ ఇన్సూరెన్స్ రూపంలో ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నప్పటికీ ఇవి అంతగా ఆదరణ పొందడం లేదు. శుభకార్యక్రమమైన పెళ్ళి ఏదైనా అవాంతరం వలన ఆగిపోతే... అన్న పదాన్ని భారతీయులు అంగీకరించకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఏజెంట్లు పేర్కొంటున్నారు. క్లెయిమ్ ఎలా?.. ఏదైనా సంఘటన వల్ల వేడుక రద్దు అయితే 30 రోజుల్లోగా సమాచారాన్ని బీమా కంపెనీకి తెలపాలి. దీనికి సంబంధించిన కాగితాలను జతచేస్తూ క్లెయిమ్ ఫాం అందజేయాలి. చేసిన ఖర్చుకు సంబంధించి ప్రతీ పైసాకి ఆధారాలు జతచేయాలి. అదే దొంగతనం వంటి సంఘటనలు జరిగితే జరిగిన ఆర్థిక నష్టాన్ని ధ్రువీకరించే ఎఫ్ఐఆర్ కాపీని కూడా జత చేయాల్సి ఉంటుంది. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం