మన దేశంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం.. అంటే రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. పెళ్లి అనేది జన్మ జన్మల బంధం అని అంటారు. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు(మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్) అని అంటారు. అయితే, అలాంటి పెళ్లిళ్లు కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా లేదా రద్దు కావడం జరగుతుంటాయి. కేవలం గత రెండేళ్ల కాలంలో కరోనా కారణంగా అనేక పెళ్లిళ్లు వాయిదా పడిన సంఘటనలు, రద్దు అయిన సంఘటనలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు కరోనా మహమ్మారి మరో రూపం ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా వివాహాలు రద్దయితే అటు ఆడపెళ్లి వారికి, ఇటు మగపెళ్లి వారికి చాలా ఆర్థిక నష్టం చేకూరుతుంది. అయితే ఇకపై ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి పెళ్లిళ్లపైనా కూడా పలు కంపెనీలు బీమాను అందిస్తున్నాయి. ఈ మేరకు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పేరుతో పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి.
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
వివాహ బీమా అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల వివాహం రద్దు అయిన, ఏదైనా ఇతర నష్టం జరిగిన భీమా కంపెనీలు డబ్బులు చెలిస్తాయి. అయితే, కొన్ని నిబందనలను మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వివాహ బీమా అనేది స్థూలంగా నాలుగు కేటగిరీల కింద వర్తిస్తుంది.
లయబులిటీస్ కవరేజ్: పెళ్లి వేడుక సమయంలో జరిగే ప్రమాదాల వల్ల తృతీయపక్షాల ఆస్తులకు ఏమైనా నష్టం జరిగితే ఈ భీమా కవర్ చేస్తుంది.
క్యాన్సిలేషన్ కవరేజ్: అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా పెళ్లి రద్దు కావడం వల్ల జరిగే నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది.
ఆస్తుల నష్టం: పెళ్లి వేడుకల సమయంలో యజమాని ఆస్తులకు ఏదైనా నష్టం కలిగితే ఇది వర్తిస్తుంది.
వ్యక్తిగత ప్రమాదం: కొన్ని సార్లు పెళ్ళికి అని బయలుదేరుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులకు ఎదురయ్యే ఖర్చులకు ఈ బీమా వర్తిస్తుంది.
బీమా ప్రీమియం ఎంత?
పెళ్లి అనివార్య కారణం వల్ల ఆగిపోయినప్పుడు లభించే వివాహ బీమా అనేది మీరు ఎంత బీమా చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి బీమా ప్రీమియం అనేది మీకు ఇచ్చే హామీ మొత్తంలో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు రూ.10 లక్షల వివాహ బీమా కావాలంటే, అప్పుడు మీరు రూ.7,500 నుంచి 15,000 ప్రీమియం చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment