Well bore
-
నలుగురిని మింగిన ఊటబావి
బంటుమిల్లి: ఊటబావి నాలుగు నిండుప్రాణాలను బలితీసుకుంది. పూడిక తీసేందుకు బావిలో దిగినవారు ఒకరి తర్వాత మరొకరు ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బంటుమిల్లి గ్రామానికి చెందిన కొండా నాగేశ్వరరావు అడితి (కర్రలు) వ్యాపారి. తన నివాసం వద్ద ఉన్న ఊటబావి పూడిక తీయడానికి తన కుమారుడు కొండా రంగా(35) ద్వారా గ్రామంలోని బీఎన్ఆర్ కాలనీకి చెందిన కూలీ వంజల రామారావు(60)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రామారావు తనకు సహాయంగా కుమారుడు వంజల లక్ష్మణ్(35), శ్రీనివాసరావు(53)ను తీసుకుని వచ్చాడు. పూడిక తీసేందుకు శుక్రవారం మధ్యాహ్నం బావిలోకి దిగారు. ముందుగా శ్రీనివాసరావు దిగి నాలుగు బకెట్ల మట్టిని తోడాక ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతను కేకలు వేయగా.. రామారావు, లక్ష్మణ్ తాడువేసి పైకి లాగే ప్రయత్నం చేశారు. అయితే, శ్రీనివాసరావుకు ఆక్సిజన్ అందకపోవడంతో పట్టుకున్న తాడును వదిలి బావిలో పడిపోయాడు. ఆ వెంటనే రామారావు బావిలోకి దిగి ఊబిలో పడిపోయాడు. తన తండ్రి పడిపోయాడని తెలుసుకున్న లక్ష్మణ్ హడావుడిగా వచ్చి బావిలోకి దిగి ఇరుక్కుపోయాడు. ముగ్గురు ప్రమాదంలో చిక్కుకున్నారని రక్షించేందుకు రంగా బావిలోకి దిగాడు. ఒకరి కోసం మరొకరు బావిలోకి దిగి ఊపిరాడక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బంటుమిల్లిలో విషాదం.. ఊటబావిలో ఊపిరి ఆడక మృతి చెందిన నలుగురి మృతదేహాలను గ్రామస్తులు అతికష్టంపై వెలికి తీశారు. అప్పటి వరకు మాట్లాడుతున్న వారు కళ్ల ఎదుటే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుల భార్యలు, పిల్లల ఆర్తనాదాలు చూసి స్థానికులు చలించిపోయారు. మృతిచెందిన వారిలో రంగాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏమైందో తెలియని పసిపిల్లలు తమ తండ్రుల మృతదేహాలను చూపిస్తూ ‘అమ్మా... నాన్న..’ అంటూ కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహణ నిర్మాణ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ హుటాహుటిన బంటుమిల్లికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
కొంపముంచిన దావత్
కామారెడ్డి క్రైం: అప్పటిదాకా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఓ యువకుడిని బావి రూపంలో మృత్యువు కబళించింది. మద్యం మత్తులో కాలు జారి బావిలో పడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహం 20 గంటలపాటు గా లించాక లభించింది. ఈ సంఘటన కామారెడ్డిలో గురువారం కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ్‌గల్లీకి చెం దిన మైసరి పార్వతీ–మురళీకి ఇద్దరు సంతానం. వీరిలో పెద్దవాడు రాజేష్(26)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో రెడిమేడ్ దుస్తుల దుకాణం పెట్టుకుని కొంత కాలం నడిపించి లాభాలు సరిగా రాకపోవడంతో ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. మంగళ వారం రాత్రి రాజేష్, అతడి స్నేహితులు కలిసి మ ద్యం సేవించేందుకు పెద్ద చెరువు సమీపంలోకి వెళ్లారు. చెరువు కట్ట పక్కనే ఉన్న మత్తడి వద్ద వ్య వసాయ బావికి కొద్ది దూరంలో మద్యం తాగారు. సుమారు 11 గంటల ప్రాంతంలో బావి పక్కనే ఉన్న దారి గుండా తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకు న్న రాజేష్ బంధువులు, స్నేహితు లు, స్థానికులు పె ద్ద ఎత్తున బావి వద్దకు చేరుకున్నారు. మృ తదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బావిలోతుగా ఉండి మృతదేహం లభించ లేదు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బుధవారం ఉదయం నుంచి బావిలోని నీటిని మోటార్ల ద్వారా ఖాళీ చేయించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాజేష్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పట్టణ ఎస్‌హెచ్‌వో రామక్రిష్ణ తెలిపారు. -
ప్రాణం తీసిన పూడిక బావి
భీమదేవరపల్లి(హుస్నాబాద్) : ఎండిపోతున్న మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు తాపత్రయపడిన యువరైతు తన వ్యవసాయ బావి పూడికతీసేందుకు ఉపక్రమించాడు. దురదృష్టావశాత్తు వ్యవసాయ బావిలోనుంచి క్రేన్ సాయంతో పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్‌కు గ్రామానికి చెందిన బొల్లంపల్లి రాకేష్(30) అనే యువ రైతు దుర్మరణం పాలయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గట్లనర్సింగపూర్‌కు చెందిన బొల్లంపల్లి యోహోన్, కొంరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కలదు. పెద్ద కుమారుడైన రాకేష్ డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయం చేస్తున్నాడు. వీరికున్న ఎకరం వ్యవసాయ భూమిలో వర్షకాలంలో పత్తి పంట సాగు చేస్తే దిగుబడి రాలేదు. దీంతో యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొక్కజొన్న పంట చేతికొచ్చె సమయంలోనే వ్యవసాయ బావిలో నీటి మట్టం తగ్గిపోవడంతో పంట వల్లుమోహం పట్టింది. దీంతో పంటను రక్షించుకునేందుకు గత రెండు రోజుల క్రితమే క్రేన్ సాయంతో తండ్రి యోహోన్, కుమారుడు రాకేష్‌తో పాటుగా కూలీలతో వ్యవసాయ బావిలో పూటీకతీత పనులు చేపట్టారు. కాగా బుధవారం బావిలోని విద్యుత్ మోటర్ పనిచేయకపోవడంతో మోటర్‌ను పైకి తీసేందుకు రాకేష్ బావిలోకి దిగాడు. క్రేన్ వైర్ మోటర్‌కు అమర్చి మోటర్‌పై రాకేష్ కూర్చుండి పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో రాకేష్ బావిలో పడగా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా మారిన రాకేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. మృతదేహాన్ని సర్పంచ్ సల్పాల రాధికతిరుపతితో పాటు పలువురు సందర్శించి నివాలులర్పించారు. కాగా రాకేష్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్యాల ప్రకాశ్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లంపల్లి షడ్రక్ ప్రభుత్వాన్ని కోరారు. -
‘దారి’ తీసిన గొడవ
♦ రాళ్ల దాడిలో ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం ♦ వికారాబాద్ జిల్లాలో ఘటన దోమ: దారికి అడ్డంగా బైక్ పెట్టడంతో మొదలైన గొడవ చివరకు ఒకరి ప్రాణాన్ని బలి గొంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం ఐనాపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడ్ల రాజు కొన్నిరోజుల క్రితం తన పొలంలో బోరుబావి తవ్వించాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం స్నేహితులు యాదయ్య, నరేందర్, బుగ్గయ్య, నర్సింలుతో కలసి విందు ఏర్పాటు చేశాడు. రాజు పొలానికి వెళ్లే దారిలోనే గ్రామానికి చెందిన సుజాజొద్దీన్ (50) పొలం ఉంది. గురువారం సాయంత్రం ఆయన కుమారులు సైఫొద్దీన్, అహ్మద్ తమ పొలం దగ్గర దారికి అడ్డంగా బైక్ నిలిపి ఉంచడంతో యాదయ్య వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యాదయ్య విందులో ఉన్న తన స్నేహితులకు చెప్పడం తో వారు అక్కడికి వచ్చి ఘర్షణకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సుజాజొద్దీన్ రాత్రి మరోవర్గానికి చెందిన వారిని పిలిపించి సర్ది చెప్పాడు. అనంతరం వారిని మరోసారి తిరిగి పిలిపించడంతో గొడవ మొదలైంది. దీంతో సుజాజొద్దీన్, అహ్మద్, సైఫొద్దీన్లపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సుజాజొద్దీన్ మృతి చెందగా.. సైఫొద్దీన్ పరిస్థితి విషమం గా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. వివరాలు సేకరించిన ఎస్పీ ఎస్పీ నవీన్‌కుమార్ శుక్రవారం ఘటన స్థలా నికి చేరుకొని గొడవకు దారి తీసిన కార ణాలను పరిగి డీఎస్పీ అశ్ఫక్, సీఐ ప్రసాద్, ఎస్ఐ ఖలీల్‌ను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పంచాయతీ నిధులకు ఫ్రీజింగ్
- నిలిచిన 14వ ఆర్థిక సంఘం, రాష్ర్ట ఆర్థిక సంఘం నిధులు - {V>Ð]l*ÌZÏ అభివృద్ధి పనులకు ఆటంకం - అప్పులు చేయాల్సి వస్తుందంటున్న సర్పంచులు - పనులకు నిధుల గ్రహణం - నిలిచిన ప్రభుత్వ నిధులు - ఆందోళనలో సర్పంచులు ఈ చిత్రంలో కనిపిస్తున్న బోరుబావి చిప్పలపల్లి గ్రామంలో వేసినది. ఇటీవల చిప్పలపల్లిలో తాగునీటికి ఇబ్బందులున్నాయని సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ బోరుబావి మంజూరు చేయించి బోరు వేయించారు. అక్కడ టీఎఫ్సీ నిధులతో సర్పంచ్ దేవయ్య రూ.35వేలు వెచ్చించి బోరుమోటారు బిగించారు. ఇక మంచినీటి సరఫరా జరుగుతుందనగా.. మోటారు ఇచ్చిన కంపెనీ డీలర్ బిల్లు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. టీఎఫ్సీ నిధులు రూ. 35వేలు డ్రా చేసేందుకు సిరిసిల్ల ఎస్టీవోకు వెళ్లారు. అక్కడ టీఎఫ్సీ నిధుల చెల్లింపులు నిలిపివేశామని అధికారులు చెప్పడంతో సర్పంచ్ దేవయ్య ఖంగుతిన్నారు. ఇప్పుడెలా అంటూ అప్పు చేసైనా డీలర్‌కు బిల్లులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. పంచాయతీ కార్మికులు సమ్మెతో పల్లెల్లోని డ్రెయినేజీల్లో దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే మరోవైపు పంచాయతీ నిధుల విడుదలకు గ్రహణం పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27వ తేదీ నుంచి పంచాయతీ నిధుల చెల్లింపులకు బ్రేక్ వేసింది. సిబ్బంది వేతనాలకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ.. ఇతర పనులకు సంబంధించిన నిధుల విషయంలో ఫ్రీజింగ్ విధించింది. ఆవేదన వ్యక్తం చేస్తున్న సర్పంచులు.. జిల్లాలో 1208 గ్రామాల పంచాయతీలకు నిధుల చెల్లింపులు నిలిపివేయడంపై సర్పంచులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల చెల్లింపులను ఎస్టీవోలు పూర్తిగా నిలిపివేశాయి. దీంతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని చెప్పుకుంటున్నా పంచాయతీ నిధుల చెల్లింపులపై ఆంక్షలు విధించడం సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. 2011లో పంచాయతీ నిధులపై ఫ్రీజింగ్ విధించిన ప్రభుత్వం మరోసారి తెలంగాణ ఏర్పాటు అనంతరం మొదటిసారిగా చెల్లింపులపై ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అడుగడుగునా ఆటంకాలు.. టీఎఫ్ఎసీ, ఎస్ఎఫ్సీ నిధుల చెల్లింపులపై ఆంక్షలు ఉండడంతో పల్లెలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గడచిన పదిరోజుల్లో చెల్లింపులు నిలిచిపోవడంతో పలు అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా వీధిదీపాలు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, మురుగుకాల్వల నిర్వహణ తదితర పనులపై ప్రభావం చూపుతోంది. అసలే పంచాయతీ పారిశుధ్య సిబ్బంది సమ్మె చేస్తుండగా, మరోవైపు ట్రెజరీల్లో ఆంక్షలు విధించడం పంచాయతీ సర్పంచులపై పెనుభారం మోపుతోంది. మోటార్ల రిపేరు, వీధిదీపాల అమరిక వంటి అంశాలను సర్పంచులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తక్షణమే ఫ్రీజింగ్ ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. ఫ్రీజింగ్ తక్షణమే ఎత్తివేయాలి పంచాయతీలకు అసలే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు ఫ్రీజింగ్ పెట్టడంతో నీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఎస్టీవో చుట్టూ నిత్యం తిరుగుతున్నాం. ఫ్రీజింగ్ తక్షణమే ఎత్తివేయాలి. - గాడిచెర్ల దేవయ్య, సర్పంచ్, చిప్పలపల్లి