T20 WC 2022: జట్టును ప్రకటించిన జింబాబ్వే.. కెప్టెన్ వచ్చేశాడు! వాళ్లు కూడా!
T20 World Cup 2022- Zimbabwe Squad: ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి జింబాబ్వే జట్టును ప్రకటించింది. తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమైన కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌తో పునరాగమనం చేయనున్నాడు. అదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్న పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని సైతం సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు.
15 మంది సభ్యులతో మెగా ఈవెంట్‌కు
వీరితో పాటు.. గాయాల నుంచి కోలుకున్న టెండాయి చటారా, వెల్లింగ్టన్ మసకద్జ, మిల్టన్ శుంబాలకు తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. కాగా క్రెయిగ్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఐసీసీ టోర్నీకి ఎంపిక చేసినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది.
కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో క్వాలిఫైయింగ్ దశలో అక్టోబరు 17న జింబాబ్వే ఐర్లాండ్‌తో తమ మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. అంతకంటే ముందు శ్రీలంక, నమీబియాలతో అక్టోబరు 10, 13 తేదీల్లో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.
టీ20 ప్రపంచకప్-2022కు జింబాబ్వే జట్టు:
క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), రియాన్ బర్ల్, రెగిస్ చకబ్వా, టెండాయి చటారా, బ్రాడ్లే ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, క్లైవ్ మడాండే, వెస్లీ మెధెవెరె, వెల్లింగ్టన్ మసకద్జ, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ, సికిందర్ రజా, మిల్టన్ శుంబా, సీన్ విలియమ్స్.
రిజర్వు ప్లేయర్లు:
టనక చివాంగా, ఇన్నోసెంట్ కైయా, కెవిన్ కసుజ, తడివానివాషె మరుమాని, విక్టర్ న్యౌచి.
చదవండి: కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని..
T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం!