West Indian legend
-
విండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం.. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు మృతి
వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు మృతి చెందారు. శుక్రవారం(డిసెంబర్ 8) వెస్టిండీస్ మాజీ ఆఫ్ స్పిన్నర్ క్లైడ్ బట్స్(66) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా.. మరో దిగ్గజం జో సోలమన్(93) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. జో సోలమన్.. గయానాకు చెందిన జో సోలమన్ వెస్టిండీస్ క్రికెట్లో కొన్నాళ్లపాటు కీలక బ్యాటర్‌గా కొనసాగాడు. 1958 నుంచి 1965 మధ్య విండీస్ తరపున 27 టెస్టులు ఆడిన సోలమన్.. 34 సగటుతో 1326 పరుగులు సాధించాడు. ముఖ్యంగా 1960లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సోలమన్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి ఆఖరి రోజు చివరి వరకు క్రీజులో నిలుచని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. క్లైడ్ బట్స్.. 1980లో వెస్టిండీస్ తరుపున క్లైడ్ బట్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటిలో విండీస్ ఫాస్ట్ బౌలర్లకు పేరు గాంచిన జట్టు. కానీ క్లైడ్ బట్స్ తన స్పిన్ బౌలింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. జాతీయ జట్టు తరపున కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ.. బట్స్‌కు దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్బుతమైన రికార్డు ఉంది. 87 ఫస్ట్‌క్లాస్, 32 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో గయానాకు బట్ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన కామేంటేటర్‌గా, 2000లో విండీస్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు. కాగా ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల మృతి పట్ల వెస్టిండీస్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. వారి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ విండీస్ క్రికెట్ ట్విట్ చేసింది. -
టీమిండియాకు సడన్ సర్ ప్రైజ్
ప్రస్తుతం వెస్డిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు వెస్డిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ సడన్ సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. తమను కలిసేందుకు స్వయంగా రిచర్డ్స్ లాంటి దిగ్గజ ఆటగాడు రావడంతో భారత క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంటిగ్వాలో వివియన్ రిచర్డ్స్ స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లను సోమవారం కలవడంతో పాటు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. విండీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైన టీమిండియా ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమతో విలువైన సమయాన్ని కేటాయించిన విండీస్ మాజీ ఆటగాడికి కోహ్లీ, రహానే, మురళీ విజయ్, రాహుల్, ధావన్, స్టూవర్ట్ బిన్నీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలను ప్రత్యేకంగా అభినందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సెంచరీల మోత మోగించిన విరాట్ ను మెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ దూకుడైన ఆటతీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు. కూల్ గా ఉంటూనే తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించే రహానేను ప్రశంసించాడు. స్టూవర్ట్ బిన్నీతో మాట్లాడుతూ అతడి తండ్రి మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీతో పాటు 1983 ప్రపంచకప్ రోజులను రిచర్డ్స్ గుర్తుచేసుకున్నాడు.