west indies star
-
ఆటకు శామ్యూల్స్ టాటా
కింగ్స్టన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు ఫైనల్స్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల శామ్యూల్స్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. 2018 డిసెంబర్లో శామ్యూల్స్ చివరిసారి వెస్టిండీస్ తరఫున (బంగ్లాదేశ్‌పై) అంతర్జాతీయ వన్డేలో బరిలోకి దిగాడు. 2000లో క్రికెట్లో అడుగుపెట్టిన శామ్యూల్స్ ప్రపంచ వ్యాప్తంగా పలు టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. కొలంబోలో జరిగిన 2012 టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై (56 బంతుల్లో 78; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు)... కోల్‌కతాలో జరిగిన 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శామ్యూల్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ప్రదర్శనతోనే విండీస్ రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు ఫైనల్స్‌లో శామ్యూల్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు కూడా లభించాయి. శామ్యూల్స్ కెరీర్లో వివాదాలూ ఉన్నాయి. 2008లో బుకీల నుంచి శామ్యూల్స్ డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015లో అతని బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఏడాదిపాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించారు. ఓవరాల్‌గా తన కెరీర్లో శామ్యూల్స్ 71 టెస్టులు ఆడి 3,917 పరుగులు (7 సెంచరీలు; 24 అర్ధ సెంచరీలు)... 207 వన్డేలు ఆడి 5,606 పరుగులు (10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు)... 67 టి20లు ఆడి 1,611 పరుగులు (10 అర్ధ సెంచరీలు) చేశాడు. టెస్టుల్లో 41 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టి20ల్లో 22 వికెట్లు కూడా తీశాడు. -
ఇంగ్లండ్‌లోనూ గేల్ మోత
చెమ్స్‌ఫోర్డ్ : టి20ల్లో విధ్వంసకర ఆటతీరుతో బెంబేలెత్తించే వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్.. కౌంటీల్లోనూ అదరగొట్టే రీతిలో అరంగేట్రం చేశాడు. తొలిసారిగా సోమర్సెట్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఆడిన గేల్ 59 బంతుల్లోనే 92 (8 ఫోర్లు; 6 సిక్సర్లు) పరుగులతో దుమ్మురేపాడు. తన ఆటతీరుతో నాట్‌వెస్ట్ టి20 బ్లాస్ట్‌లో భాగంగా శుక్రవారం ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్ చివరి బంతికి గెలిచింది. తొలి ఆరు పరుగులు చేసేందుకు 18 బంతులు ఆడిన గేల్ ఆ తర్వాత స్టేడియంలో బౌండరీలతో పరుగుల వరద పారించాడు. -
‘తీస్రా’... అంటే మైండ్‌గేమే: నరైన్
మిర్పూర్: స్పిన్ బౌలింగ్‌లో ‘తీస్రా’ అనేదే లేదని కేవలం అది మైండ్‌గేమ్ మాత్రమేనని వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు తీస్రా అజ్మల్ (పాక్) చేతిలో ఉన్న అస్త్రమేమీ కాదని బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేసేందుకు పన్నిన మైండ్‌గేమే అని వివరించాడు. సంప్రదాయ ఆఫ్ స్పిన్‌కు దూస్రా, తీస్రాలేవీ భిన్నమైనవి కావని అన్నాడు. ‘బ్యాట్స్‌మెన్‌ను బంతితో కంటే బుర్రతో పడేసే ఆటే ‘తీస్రా’. క్రికెట్ అనేది బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ గేమ్. బౌలర్లకే తక్కువ అవకాశాలు. అందుకనే ఇలాంటి మైండ్గేమ్లను ఆడతారు. నా బౌలింగ్‌లో ఆశ్యర్యకర డెలివరీలు, అంతుచిక్కని బంతులంటూ ఉండవు. కేవలం సాధ్యమైనంత మెరుగ్గా బౌలింగ్ చేయడమే నా లక్ష్యం. ఆసియాకప్‌లో భారత స్పిన్నర్ అశ్విన్ నా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించినట్లు విన్నాను. నేనైతే అతని బౌలింగ్ యాక్షన్ చూడలేదు. కాబట్టే కామెంట్ చేయను. అయినా ఎవరి ఇష్టం మేరకు వారి బౌలింగ్ శైలి ఉంటుంది. ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. పొలార్డ్ లేకపోయినా సత్తాగల ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.