west London
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం
లండన్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, భాస్కర్ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్‌కుమార్ యాదవ్, సురేష్ గోపతి, సురేష్‌రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్, తుకారాం రెడ్డి, రాఘవేందర్, గౌతమ్ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్ హృదయపూర్వక కృతజ్ఞతలు,సంతోషాన్ని వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్నెల్లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్వీబీటీసీసీ సభ్యుల భక్తి,సేవానిరతనిఇ ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు. -

లండన్ భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి
లండన్ : అగ్నిప్రమాదానికి గురైన గ్రెన్‌ఫెల్ టవర్ దుర్ఘటనలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా మంటలు అంతకంతకు ఎగసిపడుతున్నాయి. ఈ టవర్‌లో మొత్తం 120 ఫ్లాట్స్ ఉండగా...రెండో అంతస్తు నుంచి చివరి అంతస్తు వరకూ మంటలు వ్యాపించడంతో టవర్ పూర్తిగా అగ్నికీలలతో మూసుకుపోయింది. ఉదయం నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో టవర్ చాలా వరకు దెబ్బతింది. మంటల ధాటికి భవనం కూలిపోయేలా కన్పిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదే గనుక జరిగితే.. పెను ప్రమాదం తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రతను అదుపు చేయడానికి 200 మంది అగ్నిమాపక సిబ్బంది 40 ఫైర్ ఇంజన్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కొందరిని రక్షించగా...పై ఫ్లోర్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఓవైపు ఎగసిపడుతున్న మంటల కారణంగా సహాయకచర్యలకు సైతం ఆటంకంగా మారింది. టవర్ లోపలున్న వారైతే...ప్రాణాలు కాపాడుకునేందుకు బెడ్షీట్లను తాడులా కట్టుకొని కిందకు దూకేందుకు ప్రయత్నించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొబైల్, టార్చ్‌లైట్ సాయంతో ప్లాష్లైట్లు ఆన్‌చేసి తమను కాపాడాలని చేస్తున్న ఆర్తనాదాలు, హాహాకారాలతో టవర్ సమీపంలో భయానక పరిస్థితి నెలకొంది. మంటల ధాటికి అద్దాలు పగిలి పెద్దపెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయని, కొన్ని శిథిలాలు కూలిపోతున్నాయని స్థానికులు తెలిపారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో.. భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఏ క్షణాన్నైనా భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు. 1947లో ఈ టవర్‌ను నిర్మించగా, ఇటీవలే 10 మిలియన్ పౌండ్లతో మెరుగులు దిద్దారు. మరిన్ని వార్తలకు... లండన్‌లో భీకర అగ్నిప్రమాదం (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లండన్‌లో భీకర అగ్నిప్రమాదం
-
లండన్‌లో భీకర అగ్నిప్రమాదం
లండన్: బ్రిటన్‌లో భీకర అగ్నిప్రమాదం సంభవించింది. వెస్ట్ లండన్‌లోని 27 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాంకస్టర్ వెస్ట్ఎస్టేట్లోని గ్రెన్‌ఫెల్ టవర్ రెండో అంతస్తులో మంటలంటుకున్నాయి. పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. పక్కనున్న భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 40 ఫైరింజన్లతో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్థరాత్రి 1.16 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం) మంటలు చెలరేగినట్టు సమాచారం. 1974లో నిర్మించిన గ్రెన్‌ఫెల్ టవర్‌లో 120 ఫ్లాట్లు ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో ఎంత చిక్కుకున్నారన్నది వెల్లడికాలేదు. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతూ మండే అగ్నిగోళాన్ని తలపిస్తున్న భవనాన్ని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. జనం నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరగడంతో వందలాది మంది లోపలే చిక్కుకుపోయారు. పలువురు సజీవదహనం అయిపోవడం కళ్లారా కనిపిస్తోందని ప్రత్యక్షసాక్షులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపుగా అన్ని ఫ్లాట్లు మంటల్లో చిక్కుకుపోయాయి. లోపలున్న జనం బయటకు రావడానికి కూడా వీలులేనంతగా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది కూడా అతికష్టం మీద లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. లోపలున్న జనం సహాయం కోసం పెద్దఎత్తున హాహాకారాలు చేస్తున్నారు. మంటల ధాటికి భవనం కూలిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇదే జరిగితే పెనువిషాదం తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 27 అంతస్తులున్న ఈ భవంతి లోపలి రాకపోకలకు ఒకే మార్గం ఉంది. సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ ప్రమాదకరమని గతంలోనే అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చిన్న ప్రమాదమైన నష్టం అధికంగా ఉండే అవకాశం ఉందని, జాగ్రత్త వహించాలని ఆదేశించారు. అయినా అపార్ట్మెంట్ యాజమాన్యం పట్టించుకోకపోవడం పెను ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)