WhatsApp - Rumours
-
వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్న పింక్ లింక్
వైఎస్సార్: ఇటీవల వాట్సాప్‌లో వాట్పాప్ అప్డేట్ పేరుతో పింక్ లింక్ హల్చల్ చేస్తోంది. దీనిపై పోలీసులు మొబైల్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ మొబైల్ అప్లికేషన్ అయినా అప్డేట్ ప్లేస్టోర్‌లో మాత్రమే వస్తుంది. లింక్‌ల రూపంలో రాదు. లింక్ రూపంలో వచ్చిందంటే యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఇలాంటివి ఓపెన్ చేసినప్పుడు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఆ లింక్ షేర్ అవుతుందన్నారు. పొరపాటున ఓపెన్ చేసిన వారు వెంటనే పింక్ కలర్ వాట్సాప్, ఆన్లైన్ స్ట్రీమ్‌ను అన్ ఇన్స్‌స్టాల్ చేస్తే లింక్ షేర్ అవ్వకుండా ఆపవచ్చన్నారు. -
టీటీడీపై ఆ ప్రచారం అవాస్తవం.. నమ్మొద్దు
సాక్షి, తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ‘సేవ్’ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీటీడీ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ ట్విటర్ పేజీ ద్వారా స్పష్టత ఇచ్చింది. శ్రీవారికి కానుకల రూపంలో అందించిన కానుకల డిపాజిట్లను ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు చైర్మన్ కలిసి తప్పుదోవ పట్టించబోతున్నారనేది ఆ వాట్సాప్ సందేశం సారాంశం. అయితే ఈ ప్రచారంలో ఏ ఒక్కటీ నిజం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధారాల్లేని ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రజలెవ్వరూ ఇది నమ్మవద్దని, ఇతరులకు ఈ సందేశాలను ఫార్వర్డ్ చేయొద్దని టీటీడీ కోరుతోంది. అంతేకాదు ప్రధాని కార్యాలయం పేరిట అక్కడ కనిపిస్తున్న నెంబర్.. మన్‌కీ బాత్ ప్రొగ్రాంకు సంబంధించిందని స్పష్టం చేసింది. #FactCheck తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారంలో ఏ ఒక్కటీ నిజం కాదు. దీన్ని రాష్ట్ర ప్రజలెవ్వరూ నమ్మవద్దని, ఇతరులకు పంపవద్దని టీటీడీ కోరుతోంది. pic.twitter.com/PA6TzqokoX — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 14, 2022 -
వ్యాక్సిన్ తీసుకుంటే రూ.5 వేల రివార్డు! నిజమెంత..
ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది కేంద్రం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్, రాష్ట్రాన్ని బట్టి కొంత మేర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో 199.12 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇదిలా ఉంటే.. వాట్సాప్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 'కోవిడ్-19 టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం రూ.5వేలు రివార్డ్ అందిస్తోంది' అంటూ ఓ సందేశం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఆ మెసేజ్ హిందీలో ఉంది. అది 'ముఖ్యమైన సమాచారం.. ఎవరైతే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి ప్రధానమంత్రి సంక్షేమ నిధి నుంచి రూ.5వేలు అందుతాయి. ఈ అవకాశం జులై 30 వరకే. ' అని ఉంది. మరోవైపు.. తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలంటూ ఓ లింక్ సైతం ఏర్పాటు చేశారు. एक वायरल मैसेज में दावा किया जा रहा है कि जिन लोगों ने कोविड वैक्सीन लगवा ली है उन्हें एक ऑनलाइन फॉर्म भरने के बाद प्रधानमंत्री जन कल्याण विभाग द्वारा ₹5,000 प्रदान किए जा रहे हैं #PIBFactcheck: ▶️ इस मैसेज का दावा फर्जी है ▶️ कृपया इस फर्जी मैसेज को फॉरवर्ड न करें pic.twitter.com/AV8asQzexu — PIB Fact Check (@PIBFactCheck) July 12, 2022 ఫేక్‌న్యూస్‌ను వ్యాప్తి చేయొద్దు.. కరోనా వ్యాక్సిన్‌పై వాట్సప్‌లో వైరల్‌గా మారిన నేపథ్యంలో అది ఫేక్‌న్యూస్‌గా పీఐబీ ఫాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని సూచించింది.' ఈ మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేసే ముందు అది పూర్తిగా ఫేక్‌న్యూస్‌గా మీరు గుర్తుంచుకోవాలి. కరోనా టీకా తీసుకున్నవారికి రూ.5వేలు రివార్డ్ అందుతుందనే వార్త పూర్తిగా తప్పు.' అని పీఐబీ ఫాక్ట్ చెక్ తెలిపింది. అందులో ఉండే లింక్‌పైన ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని, అలాంటి వాటితో సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది. ఇదీ చదవండి: మంత్రి మహిళను కొట్టాడని వీడియో షేర్ చేసిన బీజేపీ.. 48 గంటలు డెడ్‌లైన్ -
మమ్మల్ని నమ్మండి.. వాట్సాప్ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత వివరాలు అడుగుతుందని.. ఫోన్లు, సందేశాలు స్టోరేజీ చేసుకుంటుందని.. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు పక్కదారి పడుతున్నాయని వాట్సాప్‌పై వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లనీ.. వాటికి తాము సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని వాట్సాప్ తెలిపింది. దీంతో మంగళవారం సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ స్పష్టత ఇచ్చింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ వదంతుల కారణంగా వారం రోజుల్లోనే వాట్సప్‌ను అన్ ఇన్స్టాల్ చేయడం.. అన్‌లైక్ చేయడం చేస్తున్నారు. వాట్సప్ వినియోగం ఆపేసి మిగతా యాప్‌లను వినియోగిస్తున్నారు. పెద్దసంఖ్యలో డౌన్లోడ్స్ ఆగిపోయి.. డిస్ లైక్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికారికంగా స్పందించి కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చివరి వరకు మీ వ్యక్తిగత వివరాలు మేం రక్షణగా ఉంటామని ప్రకటించింది. వాట్సాప్ ప్రకటనలో ముఖ్యమైన అంశాలు ఫేస్‌బుక్‌కు వాట్సాప్ వివరాలు పంపుతామని అబద్ధం. ఎలాంటి వివరాలు పంచుకోం. మీ వ్యక్తిగత చాట్ వివరాలు ఎవరికీ తెలపం. కొత్తగా ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నాం. కొత్త నిబంధనలను అంగీకరిస్తేనే వాట్సప్ వినియోగానికి అర్హులు. లేదంటే వారి ఖాతాను తొలగించేస్తాం. కొత్తగా అప్డేట్ చేసిన వర్షన్ ఫిబ్రవరిలో అమల్లోకి తెస్తాం. 400 మిలియన్ల వినియోగదారులు వాట్సాప్ కు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు మీ పరిచయస్తుల (కాంటాక్ట్స్) వివరాలు పంచుకోం. వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్ చేయం. మీ వివరాలన్నింటి విషయంలో గోప్యత పాటిస్తాం. మీరు సందేశాలు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు పంపిన లోకేషన్స్ కూడా వాట్సప్ పర్యవేక్షించదు. -
వాట్సప్ రూమర్లతో.. ఏడుగురి హత్య!
జార్ఖండ్‌లోని సింగ్భూమ్ జిల్లాలో కొంతమంది పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ వాట్సప్‌లో వదంతులు వ్యాపించడంతో రెండు వేర్వేరు ఘటనల్లో గ్రామస్తులు కొంతమందిని పట్టుకుని చితక్కొట్టారు. దాంతో ఏడుగురు మరణించారు. ఈ కేసులో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగలేదని పోలీసులు అంటున్నారు. వికాస్ కుమార్‌వర్మ, గౌతమ్ కుమార్ వర్మ, గంగేష్ గుప్తా అనే ముగ్గురినీ నగాడి అనే ప్రాంతంలో గ్రామస్తులు పట్టుకుని చితక్కొట్టి ప్రాణాలు తీసేశారు. వికాస్, గౌతమ్‌ల నాయనమ్మపై కూడా దారుణంగా దాడి జరిగింది. ఇక రాజానగర్‌లో కూడా నలుగురు వ్యక్తులను సొసొమౌలి గ్రామస్తులు పట్టుకుని వాళ్లు కిడ్నాపింగ్ గ్యాంగ్ సభ్యులన్న అనుమానంతో కొట్టి చంపేశారు. కొంతమంది వ్యక్తులు పిల్లలను కిడ్నాప్ చేసి, వాళ్ల శరీర భాగాలను అమ్మేస్తున్నారంటూ వాట్సప్‌లో రూమర్లు వ్యాపించాయి. దాంతో అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఏడుగురినీ గ్రామస్తులు పట్టుకుని చితక్కొట్టి మరీ ప్రాణాలు బలిగొన్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు చాలా శాంతంగా ఉంటారని, అయితే రూమర్ల కారణంగా వారిలో భయం పుట్టి అదే ఇలాంటి ఘటనలకు దారితీసిందని పోలీసు ఉన్నతాధికరులు అంటున్నారు. పోలీసులు వచ్చినప్పుడు కూడా గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని వాళ్లను అక్కడకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంగా చేసిన దాడిలో కొందరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పోలీసులు వేసుకొచ్చిన కార్లు, జీపులను కూడా తగలబెట్టేశారు. ఏడుగురి హత్యలు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జంషెడ్పూర్ ప్రాంతంలో వందలాది మంది గ్రామస్తులు పోలీసులతో గొడవపడ్డారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేసి, బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది. -
వాట్సాప్‌లో దేవులపల్లిపై దుష్ప్రచారం
కృష్ణశాస్త్రి నన్ను అప్పు అడగడం ఎంతమాత్రం వాస్తవం కాదు వివరణ ఇచ్చిన రచయిత గొల్లపూడి మారుతీరావు విశాఖ: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత దివంగత దేవులపల్లి కృష్ణశాస్త్రిపై వాట్సాప్‌లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, పాఠకులు, ఆయన అభిమానులు ఇది నమ్మవద్దని ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు తెలిపారు. దేవులపల్లి తన ఇంటికి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి, కళ్లనీళ్లు పెట్టుకొని కారు కొనుక్కునేందుకు అప్పు అడిగారని, ఆయనకు తాను ఇచ్చానని.. కట్టుకథలా రాసి వాట్సాప్‌లో పోస్టు చేయడం విచారకరమన్నారు. ఈ సందేశాన్ని చాలామంది తనకు పంపించారని.. దీనిని చదివి, తాను ‘సాక్షి’ ద్వారా వివరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చానన్నారు. సంపన్నుడైన కృష్ణశాస్త్రి తనను అప్పు అడగడం నిజం కాదని మారుతీరావు అన్నారు. వాట్సాప్ సందేశంలో చాలా తప్పులున్నాయని, దేవులపల్లి ఎప్పుడూ ఫియట్ కారులో పయనించలేదని, ఆయన అంబాసిడర్ కారు వాడేవారని చెప్పారు. గొంతు మూగబోయిన తర్వాత పలక మీద సుద్ద, బలపంతో రాసేవారని ప్రచారం చేస్తున్నారని, కృష్ణశాస్త్రి ఎప్పుడూ పుస్తకాల మీద రాసే వారని వివరణ ఇచ్చారు. ఇప్పటికీ ఆ పుస్తకాలు వారి కుమారుడు బుజ్జాయి దగ్గర ఉన్నాయని తెలిపారు. తనకంటే 45 ఏళ్లు పెద్దవాడైన శాస్త్రిగారితో కలసి పనిచేయడం తనలాంటి వారికి ఎంతో అదృష్టమని చెప్పారు. దేవులపల్లి ఏనాడూ తన ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేయలేదని, ఆయన తన ఇంటికే ఎన్నడూ రాలేదన్నారు. వాట్సాప్ ప్రచారంలో ఎనిమిదేళ్ల కింద ఆత్మకథలో తాను రాసుకున్న కొన్ని విషయాలను వక్రీకరించారన్నారు. తాను దేవులపల్లి గురించి పేర్కొన్నది 246వ పేజీలో స్పష్టంగా ఉందన్నారు. మద్రాసు ఆలిండియా రేడియోకు వచ్చి, తిరిగి వెళుతున్నప్పుడు ఆయనను సాగనంపడానికి వెళ్లిన తనకు.. ‘డబ్బులేదు.. కారు అమ్మేయాలనుకుంటున్నాను’ అని రాసి చూపించారన్నారు. ‘అదేం వద్దు. పాటలు రాయండ’ని తాను సూచించానని, ‘ఎవరూ రావడం లేద’ని ఆయన పేర్కొనడంతో.. ‘మీరు రాస్తానంటే నేను తీసుకువస్తాన’ని చెప్పానన్నారు. అలా అమెరికా అమ్మాయి సినిమా తీస్తున్న నవత కృష్ణంరాజు గారికి పరిచయం చేశానని.. ఆ సినిమాకు శాస్త్రి గారు రాసిన ‘పాడనా తెలుగుపాట.. పరవశనై నీ ఎదుట నా పాట’ మకుటాయమానంగా నిలిచిందన్నారు.