( ఫైల్ ఫోటో )
సాక్షి, తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ‘సేవ్’ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీటీడీ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ ట్విటర్ పేజీ ద్వారా స్పష్టత ఇచ్చింది.
శ్రీవారికి కానుకల రూపంలో అందించిన కానుకల డిపాజిట్లను ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు చైర్మన్ కలిసి తప్పుదోవ పట్టించబోతున్నారనేది ఆ వాట్సాప్ సందేశం సారాంశం. అయితే ఈ ప్రచారంలో ఏ ఒక్కటీ నిజం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆధారాల్లేని ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రజలెవ్వరూ ఇది నమ్మవద్దని, ఇతరులకు ఈ సందేశాలను ఫార్వర్డ్ చేయొద్దని టీటీడీ కోరుతోంది. అంతేకాదు ప్రధాని కార్యాలయం పేరిట అక్కడ కనిపిస్తున్న నెంబర్.. మన్‌కీ బాత్ ప్రొగ్రాంకు సంబంధించిందని స్పష్టం చేసింది.
#FactCheck తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారంలో ఏ ఒక్కటీ నిజం కాదు. దీన్ని రాష్ట్ర ప్రజలెవ్వరూ నమ్మవద్దని, ఇతరులకు పంపవద్దని టీటీడీ కోరుతోంది. pic.twitter.com/PA6TzqokoX
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 14, 2022
Comments
Please login to add a commentAdd a comment