వైఎస్సార్: ఇటీవల వాట్సాప్‌లో వాట్పాప్ అప్‌డేట్ పేరుతో పింక్ లింక్ హల్‌చల్ చేస్తోంది. దీనిపై పోలీసులు మొబైల్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ మొబైల్ అప్లికేషన్ అయినా అప్‌డేట్ ప్లేస్టోర్‌లో మాత్రమే వస్తుంది. లింక్‌ల రూపంలో రాదు. లింక్ రూపంలో వచ్చిందంటే యూజర్‌ల వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు.
ఇలాంటివి ఓపెన్ చేసినప్పుడు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఆ లింక్ షేర్ అవుతుందన్నారు. పొరపాటున ఓపెన్ చేసిన వారు వెంటనే పింక్ కలర్ వాట్సాప్, ఆన్‌లైన్ స్ట్రీమ్‌ను అన్ ఇన్స్‌స్టాల్ చేస్తే లింక్ షేర్ అవ్వకుండా ఆపవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment