wide
-
ఎట్టకేలకు వానలు!
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి మారడం, విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే, ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. ఒకట్రెండు చోట్ల అదీ స్వల్పంగానే వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే అల్పపీడన ద్రోణులు గానీ, ఉపరితల ఆవర్తనాలు గానీ, బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ ఏర్పడాలి. వాటివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయి. కానీ దాదాపు నెల రోజులుగా ద్రోణులు, ఆవర్తనాల జాడ లేదు. వర్షాలకు దోహదపడే నైరుతి రుతుపవనాల ద్రోణి కూడా మూడు వారాలకు పైగా దక్షిణాది వైపునకు రాకుండా హిమాలయాల ప్రాంతంలోనే ఉండిపోయింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఆగస్టు నెల వర్షపాతం సాధారణంకంటే 54 శాతం, నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభం నుంచి ఆగస్టు ఆఖరు వరకు చూస్తే 25 శాతం తక్కువగా నమోదైంది. ఈ తరుణంలో రుతుపవన ద్రోణిలో కదలిక రావడం, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురిసేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. దాదాపు నెలరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలకు ఈ వానలు ఎంతగానో ఊరట కలిగించనున్నాయి. -
చరిత్రలో తొలిసారి.. కొత్త రూల్‌ను పరిచయం చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌ను 143 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు), ఓపెనర్ హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో సైకా ఇషాఖీ (3.1-1-11-4), నాట్ సీవర్-బ్రంట్ (2-0-5-2), అమేలియా కెర్ర్ (2-1-12-2), ఇస్సీ వాంగ్ (3-0-7-1) చెలరేగడంతో చేతులెత్తేసిన గుజరాత్ టీమ్ 15.1 ఓవర్లలో 64 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. pic.twitter.com/EpIaVdOCoX — WPL MAHARASTRA (@WMaharastra) March 4, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. గుజరాత్ ఇన్నింగ్స్ సందర్భంగా సైకా ఇషాఖీ బౌల్ చేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని ఫీల్డ్ అంపైర్ వైడ్ బాల్‌గా ప్రకటించింది. అయితే అంపైర్ కాల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ముంబై కెప్టెన్ హర్మన్ రివ్యూ కోరింది. రీప్లేలో బంతి బ్యాటర్ మోనిక గ్లోవ్స్‌ను తాకినట్లు స్పష్టంగా తెలియడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. క్రికెట్ చరిత్రలో ఇలా వైడ్ బాల్ విషయంలో రివ్యూకి వెళ్లడం ఇదే తొలిసారి. WPLలో వైడ్ బాల్స్‌తో పాటు నో బాల్స్ విషయంలోనూ రివ్యూకి వెళ్లే వెసలుబాటు ఉంది. ఈ ఛాన్స్‌ను హర్మన్ విజయవంతంగా వాడుకుని సక్సెస్ అయ్యింది. గతంలో ఔట్ విషయంలో మాత్రమే అంపైర్ కాల్‌ను ఛాలెంజ్ చేసే అవకాశం ఉండేది. WPL 2023 నుంచి బీసీసీఐ వైడ్, నో బాల్స్ విషయంలోనూ రివ్యూకి వెళ్లే వెసలుబాటు కల్పించింది. హోరాహోరీ మ్యాచ్‌ల్లో రాంగ్ కాల్ (వైడ్, నో బాల్) వల్ల నష్టం జరగకూడదనే బీసీసీఐ ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చింది. వైడ్‌బాల్ రివ్యూ వల్ల ముంబై ఇండియన్స్‌ను ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. ఇలాంటి రూల్ ఒకటి ఉందని సగటు క్రికెట్ అభిమానికి ఈ మ్యాచ్ ద్వారానే తెలిసింది. -
ఆ బాల్ వైడ్‌గా ఇచ్చుంటే..
-
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మికుల విషయంలో అడ్డగోలుగా అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మికులంతా హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకటరమణ (గెడ్డం రమణ) ఒక ప్రకటనలో కోరారు. రెండు ప్రభుత్వాలకు కార్పొరేట్ కంపెనీలకు బానిసల్లా పని చేస్తున్నాయని, కార్పొరేట్‌కు అనుకూలంగా చట్టాలు మారుస్తున్నాయని విమర్శించారు. రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న రోడ్డు భద్రతా చట్టం కార్మికుల పాలిట గుదిబండగా ఉందన్నారు. ఆ చట్టం కనుక అమలైతే రోడ్లపై వాహనాలు నడపలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రానికి తానతందాన అంటూ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు. కార్మికులకు అస్త్రంగా ఉన్న చట్టాల్లో మార్పులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
'విద్యార్థులకు యూకేలో విస్తృత అవకాశాలు'
హైదరాబాద్: యూకేలో భారత విద్యార్థులకు విద్యావకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని హైదరాబాద్‌లో బ్రిటిష్ హై కమిషన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలోని లైఫ్ సైన్స్ సెమినార్ హాల్లో ఈ-లెర్నింగ్‌పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల నుంచి ప్రతినిధులు హాజరై వివిధ అంశాలపై ప్రసంగించారు. ప్రారంభ కార్యక్రమంలో అలిస్టర్ మాట్లాడుతూ భారత్, యూకే విద్యా సంబంధాలు మెరుగుపడ్డాయని, అవి మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. యూకే ప్రభుత్వం ఇండియాతో కలిసి పలు విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. యూకే ప్రధాని, భారత ప్రధాని పలు అంశాలపై అవగాహనకు వచ్చారని తెలిపారు. ఇరు దేశాల సంస్కృతిని తెలుసుకునే విద్యా విధానం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత్‌లోని పలు ప్రాంతాల్లో విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఐఐఎం బెంగళూర్ ప్రొఫెసర్ పీడీ జోష్ మాట్లాడుతూ సాంకేతిక విద్యా విధానానికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. భవిష్యత్‌లో ఇంటర్నెట్ సదుపాయంతో ఇంట్లోనే చదువుకునే అవకాశం వస్తుందన్నారు. అనంతరం హెచ్‌సీయూ ఇన్చార్జీ వీసీ పెరియా సామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో విదేశీ భాషలపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈక్వల్ ప్రాజెక్ట్ ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ జంధ్యాల ప్రభాకర్ రావు, ఈయూ ప్రాజెక్టు మేనేజర్ మంజుల కౌల్లు పాల్గొన్నారు.