wife complaint ot police
-
Extramarital Affair: భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ..
విజయనగరం క్రైమ్: భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ సీసీఎస్‌లో పనిచేస్తున్న షేక్ ఇల్తామష్ భార్య దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. వివరాలి ఉన్నాయి. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పైన ఉన్న సీసీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ ఇల్తా మష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య నసీమా ఆదివారం ఫిర్యాదు చేసిందని విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని దిశ డీఎస్పీ త్రినాథ్ వెల్లడించారు. చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. -
రాజీ పేరుతో కొట్టుకుంటూ లాక్కెళ్లి ప్రాణం తీశారు!
అనంతపురం క్రైం: ‘మాకు ఆరుగురు పిల్లలు. అందులో నలుగురూ ఆడపిల్లలే సార్. నా భర్త సంపాదనతోనే మా కుటుంబం నడుస్తోంది. రాజీ అయ్యామని చెప్పి.. రాత్రికి రాత్రి గుంపుగా ఇంటిపై పడ్డారు. ఇంట్లో ఉన్న నా భర్త ప్రసాద్, అతని తమ్ముడు లోకేష్, నా తమ్ముడు బాబును కొట్టుకుంటూ బయటకు లాక్కెళ్లారు. చివరకు నా భర్త ప్రాణాలు తీసేశారు సార్’ అంటూ హతుడు ప్రసాద్ భార్య లక్ష్మి బోరున విలపించింది. సోమవారం ఉదయం అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తమ కుటుంబసభ్యులందరూ నగరంలోని గౌరీ థియేటర్ వెనుక ఉన్న కొట్టాల్లో నివాసముంటున్నట్లు తెలిపారు. ఈ నెల 6న తన మరిది లోకేష్ కుమారుడి తలనీలాలు సమర్పించేందుకు గుత్తి సమీపంలోని బాట్లో సుంకులమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా.. నీరుగంటి వీధి వద్దకు చేరుకోగానే పాముల కొట్టాలకు చెందిన కొందరు రాంగ్ రూట్లో ద్విచక్రవాహనంపై వస్తూ తమ వాహనాన్ని ఢీకొన్నట్లుగా తెలిపారు. ఆ సమయంలో కాస్త నిదానంగా వెళ్లాలని తన భర్త, మరిది చెప్పారన్నారు. దీంతో వారు కేకలు వేస్తూ లోకేష్‌పై చెయ్యి చేసుకోవడంతో గొడవ మొదలైందన్నారు. ఆ తర్వాత పాముల కొట్టాలకు చెందిన తిరుపతయ్య, తదితరులు కల్పించుకుని రాజీ అవుతున్నట్లుగా చెప్పి.. రాత్రికి రాత్రి ఉన్నఫళంగా పెద్ద గుంపుగా వచ్చి ఇంట్లోకి చొరబడ్డారన్నారు. భర్త ప్రసాద్, మరిది లోకేష్, తమ్ముడు బాబును కొట్టుకుంటూ ఇంటి నుంచి బయటకు లాగారన్నారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసినా వదల్లేదని, వెంటబడి కొట్టుకుంటూ తరిమారన్నారు. వేణుగోపాల్ నగర్ వద్ద ప్రసాద్ కిందపడిపోగా ఆస్పత్రికి తీసుకెళితే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారని వివరించారు. ఉద్దేశపూర్వకంగా తన భర్త ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి తిరుపతయ్య, చిన్న తిరుపతయ్య, నరేంద్ర, మహేష్ తదితరులను కలుపుకుని 17 మందిపై హత్య కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. -
దుర్గంలో కిడ్నాప్ కలకలం
కళ్యాణదుర్గం: స్థానిక కిరోసిన్ డీలర్ మురళీను సోమవారం మధాయ్‌హ్నం 12 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆనంతపురంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం స్థానిక రిక్రియేషన్ క్లబ్లో మురళీ క్యారెం బోర్డు ఆడి 12 గంటలకు బయలకు వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు అతని నోటికి చేతులు అడ్డుపెట్టి కార్లోకి నెట్టి తమ వెంట తీసుకెళ్లారు. మంత్రి ప్రమేయం ఉందా? మురళీ కిడ్నాప్ వెనుక జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తమున్నట్లు పట్టణంలో వదంతులు వ్యాపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు పోలీస్ స్టేషన్లో మురళీ భార్య అనిత ఫిర్యాదు చేశారు. అయితే పట్టణ సమీపంలోని ఒంటిమిద్ది రెవెన్యూ పరిధిలోని భూ వివాదం విషయంగా మురళీని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. భూ విషయంలో ముఖ్యుడైన అపిలేపల్లి రమేష్‌ను ఫోన్ ద్వారా ఎస్ఐ శంకరరెడ్డి సంప్రదించారు. తాను అనంతపురంలో ఉన్నానని సమాధానం ఇవ్వడంతో ఎస్ఐ సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్ళి నిర్ధారణ చేయించాలని ఆదేశించారు. దీంతో అతను జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి పోలీసులతో మాట్లాడించారు. అతనిని అక్కడే ఉంచుకోవాలని ఎస్ఐ సూచించడంతో అనంత పోలీసులు రమేష్‌ను స్టేషన్లోనే ఉంచుకున్నారు. ఫోన్లో అందుబాటులో.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మురళీ మొబైల్ ముగపోయింది. పలుమార్లు కుటుంబసభ్యులు ప్రయత్నించినా అతని ఫోన్ పనిచేయలేదు. అయితే రమేష్‌ను స్టేషన్లో నిర్బంధించిన కొద్ది సేపటి తర్వాత మురళీ శ్రేయోభిలాషులు మరోసారి అతని ఫోన్‌కు కాల్ చేశారు. ఆ సమయంలో మొబైల్లో అతను అందుబాటులోకి వచ్చాడు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, సొంతపనిపై అనంతపురానికి వచ్చినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కిడ్నాపర్ల బెదిరింపులతోనే మురలీ ఈ విధంగా సమాధానం చెబుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ శంకర్‌రెడ్డి అనంతపురానికి చేరుకుని మురళీని వెంటబెట్టుకు వచ్చారు. అనిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
భార్య ఫిర్యాదు చేసిందని.. భర్త అఘాయిత్యం!
నాగోలు: ఇంట్లో గొడవలపై భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం చోలెరామారానికి చెందిన కృష్ణ, వాణిలకు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరు నగరానికి వచ్చి ఎల్బీనగర్ కాకతీయకాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో వాణి మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం మోత్కూరు, సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆదివారం సరూర్‌నగర్ స్టేషన్లో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఉంది. పోలీసులు కృష్ణకు ఫోన్ చేసి కౌన్సెలింగ్‌కు తల్లిని వెంట తీసుకురావాలని చెప్పారు. నగరానికి వచ్చిన కృష్ణ తల్లి బంధువుల ఇంట్లో ఉంది. బంధువులు ఉదయం 6 నుంచి కృష్ణ కు ఫోన్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి కిటికిలో నుంచి చూడగా ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. దీంతో ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. తన మృతికి భార్య, అత్త, మామ, నలుగురు బావమరుదులు, ఇంటి యజమాని కారణమని అందులో పేర్కొన్నాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.