wife dharna
-
భర్త కోసం 41 రోజులుగా దీక్ష
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో ఓ మహిళ తన భర్త కోసం అతడి ఇంటి ఎదుట చేస్తున్న దీక్ష మహిళ దినోత్సవం నాటికి 41వ రోజుకు చేరింది. వివరాల్లోకి వెళ్తే కాలనీలో నివాసం ఉండే పైడి నవీన్‌తో వేములవాడకు చెందిన అరుణకు 2017లో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కట్నం భారీగానే ఇచ్చారు. ఆర్నెళ్ల తర్వాత అదనపు కట్నం కోసం వేధింపుల మొదలయ్యాయి. ఈ క్రమంలో పలుసార్లు గొడవలు జరిగాయి. దాంతో అరుణ తల్లిగారింటి వద్ద కొన్ని రోజులుగా ఉంటోంది. మామ సురేందర్ తనకు పిల్లలు పుట్టరని వదంతులు సృష్టించి తన భర్తకు మరో పెళ్లి చేయాలనే కుట్ర చేయడంతో అడ్డుకున్నానని తెలిపింది. ఇంటికి వచ్చి తన భర్త తనకు కావాలని ఇంటి ఎదుట ధర్నా ప్రారంభించి ఇప్పటికి 41 రోజులు పూర్తయింది. విడాకుల ఇవ్వాలని మధ్యవర్తుల ద్వారా ఒత్తిడులు ఎదురవుతున్నప్పటికీ ఆమె ఇంటి ఎదుట నుంచి కదలడం లేదు. ధర్నాను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు భర్త కుటుంబీకులెవరు ఇటువైపు రాలేదు. అయినా అరుణ ఇంటి ముందు నుంచి కదలడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతుంది. తన భర్తతోనే కాపురం చేస్తానని చెబుతోంది. -
భర్త ఇంటి ముందు భార్య ధర్నా
జలదంకి: భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు భార్య తన పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండలంలోని గట్టుపల్లిలో శనివారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. గట్టుపల్లికి చెందిన సయ్యద్ అల్లాభక్షుకు కావలి తుఫాన్‌నగర్‌కు చెందిన సభానాతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో సభానా కావలిలోని పుట్టింటికి పిల్లలతో సహా వెళ్లిపోయింది. అనంతరం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే రెండేళ్ల క్రితం అల్లాభక్షు ఆత్మకూరుకు చెందిన తస్మితను పెళ్లి చేసుకుని గట్టుపల్లిలో ఉంటున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సభానా తన ఇద్దరి పిల్లలతో కలిసి శనివారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో రెండో భార్య తస్మితను అల్లాభక్షు తండ్రి ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. అల్లాభక్షు మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోలేదని, తనకు అనారోగ్య సమస్య ఉందని, దీంతో తనకు తోడుగా ఉంటుందని తస్మితతో సహజీవనం చేస్తున్నట్లు చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట ధర్నా
-
న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట ధర్నా
తిరుపతి: న్యాయం కోసం.. భర్త ఇంటి ఎదుట భార్య భైఠాయించిన ఘటన తిరుపతిలోని రేణిగుంట రోడ్డు వద్ద పద్మావతీనగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. న్యాయం కోసం మూడేళ్ల కొడుకుతో కలిసి ఆమె ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే.. 2010లో భాస్కర్‌రాజు, రాధికలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే 5 నెలల కిందట భాస్కర్ రెండో పెళ్లి చేసుకున్నాడంటూ రాధిక ఆరోపిస్తోంది. తాను ఉండగానే భర్త మరో పెళ్లి చేసుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భైఠాయించింది. రాధికకు మద్దతుగా మహిళ సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
దుబ్బాక(మెదక్) : కట్టుకున్న భార్య ఉండగానే మరో మహిళతో మనువాడిన భర్త నుంచి న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ మొదటి భార్య ధర్నా చేపట్టిన సంఘటన మంగళవారం దుబ్బాక మండలం దుంపలపల్లిలో జరిగింది. బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమంది గ్రామానికి చెందిన పర్స ఎల్లవ్వ, లింగయ్య దంపతుల ఏకైక కూతురైన అనితను దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామానికి చెందిన దొందడి బాలవ్వ, భూమయ్య దంపతుల కుమారుడైన దొందడి రమేశ్‌కు ఎనిమిదేళ్ల కింద రూ. 5.30 లక్షల నగదు, కట్నకానుకలిచ్చి ఘనంగా వివాహం చేశారు. అప్పటి నుంచి ఐదేళ్ల వరకు ఇరువురి వైవాహిక జీవితం సరిగానే సాగింది. వీరి జీవితంలో మూడేళ్ల నుంచి ఎడ మొఖం, పెడ మొఖం మొదలైంది. అందంగా లేవని, నీకు పిల్లలు పుట్టడంలేదని, మరో రూ. 10 లక్షల డబ్బులు కావాలని మానసికంగా, శారీరకంగా అత్త, మామలు, తొబుట్టువులతో కలిసి భర్త రమేశ్ భార్యను అనితను తరచుగా వేధించడం మొదలు పెట్టాడు. ఇరు గ్రామాల పెద్ద మనుషులు సర్ధిచెప్పినా భర్త మనసులో మార్పు రాలేదు. 8 నెలల కింద అనితను అత్తమామలు, తొబుట్టువులైన ఎల్కపల్లి లక్ష్మి భర్త లక్ష్మణ్, అంబాల బాల్‌లక్ష్మి భర్త రాజులతో కలిసి భర్త రమేశ్ భార్య అనితను చంపడానికి పథకం పన్నుతుండగా విన్న అనిత వారి నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్నితల్లిదండ్రులకు చెప్పింది. కూతురు సంసారం విడిపోతుందనే బాధతోనే కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మహిళా కోర్టులో కేసు పెట్టారు. కేసు నడుస్తుండగానే నిజామాబాద్ జిల్లా బిక్కనూర్ మండలం మల్లుమల్లి గ్రామానికి చెందిన మరో అమ్మాయితో రెండో వివాహాం చేసుకున్నాడు. రమేశ్ తతంగమంతా ఆలస్యంగా తెలియడంతో మంగళవారం వచ్చి భర్త రమేశ్ ఇంటి ఎదుట తల్లిదండ్రులతో కలిసి అనిత ధర్నాకు దిగింది. విషయాన్ని తెలుసుకున్న రమేశ్, తల్లిదండ్రులు ఇంటిని విడిచి పరారయ్యారు. బాధితురాలైన అనిత నుంచి దుబ్బాక ఏఎస్ఐ భూంరెడ్డి ఫిర్యాదు తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
భర్తగారి చెంప చెళ్లుమంది!
హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ భార్య మహిళా సంఘాలతో కలిసి తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. బోడుప్పల్‌కు చెందిన స్వప్నకు బాపూజీ నగర్లో ఉండే ప్రభాకర్‌తో 2009లో పెళ్లి అయ్యింది. కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. నాలుగేళ్ల క్రితం కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. కోర్టులో కేసు నడుస్తుండగా తనని కాపురానికి రానివ్వడం లేదని స్వప్న మహిళా సంఘాల వారితో కలిసి ఆదివారం ముషీరాబాద్‌లోని భర్త ప్రభాకర్ ఇంటి ముందు ధర్నా చేసింది. భర్త బయటకు రావాలని నినాదాలు చేసింది. ఈ సందర్భంగా బయటకు వచ్చిన భర్త, అత్తలపై సహనం కోల్పోయిన స్వప్న చేయి చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.