
భర్తగారి చెంప చెళ్లుమంది!
హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ భార్య మహిళా సంఘాలతో కలిసి తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. బోడుప్పల్కు చెందిన స్వప్నకు బాపూజీ నగర్లో ఉండే ప్రభాకర్తో 2009లో పెళ్లి అయ్యింది. కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. నాలుగేళ్ల క్రితం కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
కోర్టులో కేసు నడుస్తుండగా తనని కాపురానికి రానివ్వడం లేదని స్వప్న మహిళా సంఘాల వారితో కలిసి ఆదివారం ముషీరాబాద్లోని భర్త ప్రభాకర్ ఇంటి ముందు ధర్నా చేసింది. భర్త బయటకు రావాలని నినాదాలు చేసింది. ఈ సందర్భంగా బయటకు వచ్చిన భర్త, అత్తలపై సహనం కోల్పోయిన స్వప్న చేయి చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.