wife Reshma
-
ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను!
నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినిమా తారలు సేద తీరాలనుకుంటారు. గోపీచంద్ కూడా అలా అనుకున్నారో ఏమో! తన సతీమణి రేష్మాతో కలిసి ఆయన మౌంట్ అబు వెళ్లారు. ఈ నెల 15, 16 తేదీల్లో అక్కడి బ్రహ్మ కుమారీస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్లారు. ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు జానకీ జీ, గుల్జార్ జీ, రతన్ మోహినీ జీలను గోపీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మౌంట్ అబులోని డైమండ్ హాల్లో పాతికవేల మంది బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. బ్రహ్మకుమారీలందరూ స్వచ్ఛమైన ప్రేమతో, నిండైన మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రతి ఒక్కరికీ సరైన శాంతి మార్గం చూపుతుందనే నమ్మకం కలిగింది’’ అని చెప్పారు. -
హీరో గోపీచంద్ కు తండ్రి గా ప్రమోషన్
హైదరాబాద్: యువ హీరో గోపీచంద్ అభిమానులకు శుభవార్త. లౌక్యం చిత్రం ద్వారా కెరీర్లో అత్యుత్తమ విజయం సాధించిన గోపీచంద్‌కు ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం గోపీచంద్ నిజజీవితంలో తండ్రి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. గోపీచంద్ భార్య రేష్మ సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపీచంద్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ దేవుడు తనను మగబిడ్డతో ఆశీర్వదించాడని తెలిపాడు. తనకు దీవెనలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ముందు నుంచి గోపీచంద్ ఆశించినట్లు గానే అతనికి మగబిడ్డ పుట్టాడు. తన తండ్రి చిన్నతనంలోనే దూరం కావడం వల్ల మగబిడ్డ పుట్టాలనే గోపీచంద్ కోరుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్యూలో కూడా స్పష్టం చేశాడు. వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తున్న గోపీచంద్ ఇంటికి మరో జూనియర్ రావడంతో అతను ఆనందంలోమునిగితేలుతున్నాడు. హీరో గోపీచంద్ వివాహం రేష్మతో మే 12, 2013న హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. గోపీచంద్ భార్య రేష్మ .. హీరో శ్రీకాంత్ కు బంధువు. -
తండ్రి కాబోతున్న హీరో గోపీచంద్
యువ హీరో గోపీచంద్ వ్యక్తిగత, సినీ జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. లౌక్యం చిత్రం ద్వారా కెరీర్లో అత్యుత్తమ విజయం సాధించిన గోపీచంద్‌కు నిజ జీవితంలోనూ ప్రమోషన్ లభించింది. ఆయన త్వరలో తండ్రి కాబోతున్నారు. గోపీచంద్ భార్య రేష్మ ప్రస్తుతం గర్భవతి. మరో రెండు నెలల్లో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు గోపీచంద్ సన్నిహితులు చెప్పారు. అయితే గోపీచంద్ కుటుంబం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. గోపీచంద్ ఇంట్లో ఇటీవల జరిగిన శుభకార్యక్రమానికి అతని సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. గోపీచంద్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా యువ హీరో అత్యంత సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. హీరో గోపీచంద్ వివాహం రేష్మతో మే 12, 2013న హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. గోపీచంద్ భార్య రేష్మ .. హీరో శ్రీకాంత్ కు బంధువు.