ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను! | gopichand and Wife Reshma visit Mount Abu | Sakshi
Sakshi News home page

ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను!

Published Wed, Mar 18 2015 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను!

ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను!

నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినిమా తారలు సేద తీరాలనుకుంటారు. గోపీచంద్ కూడా అలా అనుకున్నారో ఏమో!  తన సతీమణి రేష్మాతో కలిసి ఆయన మౌంట్ అబు వెళ్లారు. ఈ నెల 15, 16 తేదీల్లో అక్కడి బ్రహ్మ కుమారీస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్లారు. ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు జానకీ జీ, గుల్జార్ జీ, రతన్ మోహినీ జీలను గోపీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మౌంట్ అబులోని డైమండ్ హాల్‌లో పాతికవేల మంది బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. బ్రహ్మకుమారీలందరూ స్వచ్ఛమైన ప్రేమతో, నిండైన మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రతి ఒక్కరికీ సరైన శాంతి మార్గం చూపుతుందనే నమ్మకం కలిగింది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement