windows xp
-
విండోస్ ఎక్స్పీ వాడుతున్నారా... జాగ్రత్త !
-
'విండోస్ ఎక్స్పీ'కి తెర !
-
విండోస్ ఎక్స్పీ కథ కంచికి!
మీరు మీ పీసీలో విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా? వచ్చే వారం.. కచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ 8వ తేదీ తరువాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటారా? మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇస్తున్న సపోర్ట్‌ను ఆ రోజు నుంచి నిలిపివేస్తోంది కాబట్టి. అయితే నాకేంటి? అనుకుంటూంటే... ప్రపంచంలోని మొత్తం కంప్యూటర్లలో మూడొంతులు విండోస్ ఎక్స్‌పీని వాడుతున్నాయి. హ్యాకర్లు దీనిపై దాడులకు తెగబడకుండా ఉండేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు లోటుపాట్లను గుర్తించి సెక్యూరిటీ ప్యాచ్‌లను పంపిస్తూంటుంది. వచ్చే వారం నుంచి ఈ ప్యాచ్‌లు రావన్నమాట. విండోస్ ఎక్స్‌పీతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003కి సంబంధించిన అప్డేట్స్ కూడా అందవు. దీంతో ఏ క్షణంలోనైనా హ్యాకర్లు ఎక్స్‌పీపై దాడులు చేయవచ్చునన్నమాట. వీటి వల్ల వ్యక్తిగతంగా పెద్దగా నష్టం ఉండకపోవచ్చుగానీ... దేశంలోని దాదాపు లక్ష ఏటీఎంల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీటిల్లో ఎక్కువశాతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నారు. అయితే కొన్ని బ్యాంకింగ్ సంస్థలు తమదైన సపోర్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఎక్స్పీ స్థానంలో లీనక్స్ ఆధారిత ‘భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యూషన్స్’ (బాస్)ను వాడేందుకు సిద్ధమవుతోంది. వ్యక్తిగత వినియోగదారులు వీలైతే విండోస్ 7 లేదా 8కు మారిపోవడం మేలు అన్నది నిపుణుల సూచన. -
ఏటీఎంలకు ‘ఎక్స్పీ’ గండం...
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోని చాలా పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలను ఆప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇలా చేయని పక్షంలో ఈ పీసీలకు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని వివరించింది. ఈ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001, ఆక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకబడి ఉంది. వచ్చే నెల 8 నుంచి విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్ సర్వీసులందించడం ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకూ ఏటీఎంలు ఉంటాయని, వీటిల్లో అధిక భాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం(విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే సమస్య ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి. టంకసాలె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీసులు ఆగిపోతే సమస్యలు పెరుగుతాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గత వారంలోనే భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా హెచ్చరించింది. -
ఇక ‘విండోస్ ఎక్స్పీ’ నిర్వహణ వ్యయం రూ. 1200 కోట్లు
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఏప్రిల్ 8 నుంచి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేయనున్న నేపథ్యంలో దీనిపై పనిచేసే పీసీల నిర్వహణ వ్యయాలు ఏటా దాదాపు రూ. 1,190 కోట్లకు (192 మిలియన్ డాలర్లు) పెరగనున్నాయి. విండోస్ ఎక్స్పీ ఓఎస్‌పై పనిచేసే ప్రతి పీసీ నిర్వహణ వ్యయం ప్రస్తుతం 75-100 డాలర్లుగా ఉండగా.. ఏప్రిల్ 8 నుంచి ఇది ఏకంగా 300 డాలర్లకు పెరగనుంది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఈ విషయాలను వెల్లడించింది. భారత్‌లోని భారీ సంస్థల్లో ఎక్స్‌పీని దాదాపు 40 లక్షల పీసీల్లో వినియోగిస్తుండగా, ఇందులో ఇప్పటికే 84% పీసీలు వేరే ఓఎస్‌కి మారడం జరిగిందని మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ కరణ్ బాజ్వా తెలిపారు. మిగతా 16 శాతంలో అత్యధిక సంస్థలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో ఉన్నాయని.. ఇందులోనూ సింహభాగం ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయని ఆయన వివరించారు. తయారీ, కమ్యూనికేషన్, ఐటీ తదితర రంగ సంస్థలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇవి సత్వరమే వేరే లేటెస్ట్ ఓఎస్నకు మారని పక్షంలో కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. 2001లో ఎక్స్పీ వచ్చింది. తర్వాత విండోస్ 7, లేటెస్ట్గా విండోస్ 8 ఓఎస్‌లను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టడం తెలిసిందే.