wine shop owners
-
మద్యం షాపు నిర్వాహకులకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
-
వైన్ షాపుల యజమానులకు వార్నింగ్
సాక్షి, నిజామాబాద్: దసరా పండగ సందర్భంగా వైన్ షాపుల యజమానులకు ఎక్సైజ్ శాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మద్యం ఎమ్మార్పీకి మించి అమ్మితే రూ.2 లక్షల జరిమానా విధించడంతోపాటు వారం రోజులు షాపు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని తెలంగాణ వైన్ షాపుల యజమానులను ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. శుక్ర,శనివారాలలో హైదరాబాద్, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లోని 8 వైన్ షాపుల్లో ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మినట్టుగా స్పెషల్ టీమ్‌లు గుర్తించాయని పేర్కొంది. దసరా పండగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్ షాపు యాజమాని ప్రయత్నించినా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎక్సైజ్ స్టేషన్లకు అదనంగా స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీంలు నాలుగు, ఎన్ఫోర్స్మెంట్ టీంలు పది, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీంలు 34 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఎమ్మార్పీకి మించి ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సంబంధిత ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు స్టేట్ కంట్రోల్ రూం 040–-24733056 హైదరాబాద్ 040-–24746884 రంగారెడ్డి 040–24600450 ఆదిలాబాద్ 08732–220229 నిజామాబాద్ 08762–237551 మెదక్ 08455–-271232 నల్గొండ 08682–224271 మహబూబ్‌నగర్ 08542–242488 వరంగల్ 08702–577412 కరీంనగర్ 08782–262330 ఖమ్మం 08742–224342 -
బంద్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారుల బంద్ కొనసాగుతోంది. మద్యం వ్యాపారులు చేస్తున్న సమ్మెతో రెండు కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పండింది. ఈ నిరవధిక సమ్మెతో జిల్లా వ్యాప్తంగా 241 మద్యం దుకాణాలు, 34 బార్లు మూత పడ్డాయి. ట్రేడ్ మార్జిన్‌ను పెంచాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్‌కు రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసినప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మద్యం వ్యాపారులు బంద్ వైపే మొగ్గు చూపారు. ఈనెల 27 నుంచి మార్జిన్ మనీ 7 నుంచి 24 శాతానికి పెంచాలని బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. -
ఉద్యోగులే... ఓనర్లు
వైన్ షాపులు, బార్లలో ఎక్సైజ్ సిబ్బంది పెట్టుబడులు కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఇదే తీరు రెండు జిల్లాల్లో 30కి పైగా షాపుల్లో భాగస్వామ్యం విజయవాడ : ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులే కింగ్మేకర్లుగా ఎదుగుతున్నారు. సాధారణ ఉద్యోగిగా ప్రభుత్వ సర్వీసులో చేరి అనతి కాలంలోనే కోట్లు గడిస్తున్నారు. బార్, వైన్‌షాపుల నుంచి మామూళ్లు వసూలు చేసి కొందరు జేబులు నింపుకొంటుంటే.. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి బార్, వైన్ షాపుల్లో బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టి భాగస్వాములుగా మారుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బార్లు, వైన్ షాపుల్లో దాదాపు 15 మందికిపైగా ఎక్సైజ్ శాఖలోని వివిధ స్థాయిల్లోని సిబ్బందికి భారీగా వాటాలు ఉన్నాయి. తాజాగా స్వర్ణ బార్ వ్యవహారంతో ఎక్సైజ్ ఉద్యోగుల పాత్ర, మామూళ్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రెండు జిల్లాల్లోని బార్లు, రెస్టారెంట్లలో ఎవరి వాటాలు ఎంత అనే లెక్కలపై అందరి దృష్టీ నెలకొంది. 15 బార్లు, వైన్ షాపుల్లో ఉన్నతాధికారికి వాటాలు... కృష్ణా జిల్లాలో 325 వైన్ షాపులు, 163 బార్లు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 355 వైన్ షాపులు 186 బార్లు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి నెలకు సగటున రూ.230 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అనతికాలంలోనే కోట్లు గడించటం కోసం ఎక్సైజ్ సిబ్బంది కొందరు తమ మామూళ్లను పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న ఒక ఉన్నతాధికారికి జిల్లాలోని ఎక్సైజ్ సిండికేట్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ లావాదేవీలు ఉన్నాయి. ఖమ్మం, విశాఖపట్నం జిల్లాలతో పాటు నగరంలో పేరుమోసిన లిక్కర్ సిండికేట్లతో కలిపి మొత్తం 15 వరకు బార్లు, వైన్ షాపుల్లో వాటాలు ఉన్నట్లు సమాచారం. ఆయన వ్యవహారాలన్నీ చూడటానికి తొలినుంచి నమ్మినబంటుగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. పెట్టుబడులన్నీ అతని పేరుతోనే ఉండటంతో అతనే శాఖాపరమైన విధులతో పాటు వ్యాపార వ్యవహారాలు చూస్తుంటాడు. ఉన్నతాధికారి ఎక్కడ ఉంటే.. అదే జిల్లాలో అతనికీ పోస్టింగ్ ఉండటం గమనార్హం. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు సైతం... కృష్ణా జిల్లాలో ఐదుగురు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు వివిధ బార్లలో భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా నందిగామ స్టేషన్లో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్‌కు రెండు బార్లలో వాటాలు ఉన్నాయి. విజయవాడ నగరంలోని మరో హెడ్ కానిస్టేబుల్‌కు రెండు బార్లలో భాగస్వామ్యం ఉంది. ఒక కానిస్టేబుల్‌కు ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉండగా, దీనిని అతని బంధువులే నిర్వహిస్తున్నారు. డిస్టిలరీలో విధులు నిర్వహించే ఒక కానిస్టేబుల్‌కు, విజయవాడ తూర్పు ఎక్సైజ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్‌కు, గన్నవరం ఎక్సైజ్ స్టేషన్లో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు వివిధ బార్లలో భాగస్వామ్యం ఉంది. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు ఓ బార్లో వాటా ఉంది. గుంటూరు నగరంలోని ఒక కానిస్టేబుల్‌కు పేరేచర్ల, గుంటూరులలో మూడు వైన్ షాపుల్లో వాటాలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు గుంటూరులోని జిన్నాటవర్, చుట్టుగుంట సెంటర్, మరో ప్రాంతంలో ఉన్న బార్లలో వాటాలు ఉండగా, చుట్టుగుంట బార్ ఉన్న స్థలం కూడా అతనితో పాటు పలువురి పేర్లతో ఉంది. దాడులతో వెనుకంజ... 2012కు ముందు వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్సైజ్ సీఐలు మొదలుకొని డిప్యూటీ కమిషనర్ల వరకు సుమారు వందకు పైగా వైన్స్, బార్లలో భాగస్వామ్యం ఉండేది. 2011 డిసెంబర్లో ఎక్సైజ్ శాఖపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు నిర్వహించి పదుల సంఖ్యలో అధికారుల్ని, వ్యాపారుల్ని అరెస్టు చేయటంతో అధికారుల్లో భయం మొదలై ంది. దీంతో నెలవారీ మామూళ్లు తీసుకుంటూ.. బాగా ఆదాయం వచ్చే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ తమ వాటాలు కొనసాగిస్తున్నారు. -
సీఎం ప్రకటనపై వైన్‌షాపు యాజమాన్యాలు నిరసన
విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణదారులు బంద్ పాటిస్తున్నారు. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించరాదని చంద్రబాబు వ్యాఖ్యానించటం ఈ చర్యకు కారణమైంది. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నా కిమ్మనని చంద్రబాబు..విజయనగరం జిల్లాపైనే దృష్టి పెట్టటడమేంటని దుకాణాల యజమానుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల మేరకు విక్రయిస్తున్నా..దోషులుగా చిత్రీకరించటం, మాఫియాగా ముద్ర వేయటం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మద్యం విక్రయాలపై రా? ప్రభుత్వం 27 శాతం కమిషనఖగా ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం 18 శాతం మాత్రమే కేటాయిస్తోందని వారు చెబుతున్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులోనే ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఈ వైఖరిని మార్చుకోకుంటే నిరవధిక బంద్‌కు సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. (ఎస్.కోట) -
మాతోపెట్టుకోవద్దు..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఇదిగో పుల్లగూర... అంటే ఇదిగో తియ్యగూర’ అన్నట్లుగా ఇచ్చిపుచ్చుకునే అలవాటుతో ఇంతకాలం నెట్టుకొస్తున్న మద్యం షాపుల యజమానులు, ఎక్చైజ్ శాఖ మధ్య తేడా వచ్చిపడింది. నిబంధనలు అతిక్రమిస్తున్నారంటూ ఎక్సైజ్ వేధింపులు ఉత్పన్నం కాగా, మునపటి లాగే విక్రయాలు చేస్తున్నామని మద్యం వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చెప్పినట్లు వినడం లేదు... ‘మాతోపెట్టుకోవద్దు’ అంటూ ఎక్సైజ్ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈతతంగం వెనుక రెన్యువల్ మామూళ్ల భాగోతం గుప్పుమంటోంది. జిల్లాలో 269 మద్యం షాపులున్నాయి. వీటిని రెన్యువల్ చేసి మునపటి వేలం పాటల మేరకు అక్కడి యజమానులకు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు రెన్యువల్ చేయించుకునేందుకు యజమానులు ముందుకొచ్చారు. జూలై 1వతేదీ నుంచి నూతన షాపులకు గడువు ప్రారంభం కాగా, ఇప్పటికీ 88 షాపులకు రెన్యువల్ చేయించుకోలేదు. విక్రయాలపై లాభాలు లేకపోవడంతో మద్యం వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో 181 మద్యం షాఫులు రెన్యువల్ చేయించుకుని వ్యాపార క్రయ విక్రయాలు చేస్తున్నారు. రెండున్నర నెలల గడువు పూర్తయ్యాక వారికి కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రతిరోజు తనిఖీల పేరుతో వే ధింపులు అధికమైనట్లు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తున్నారంటూనే..... ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన మద్యం యజమానులను గాడీలో పెట్టేందుకు చర్యలుంటే అందరూ హర్షించాల్సిందే. అలా కాకుండా క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ యజమానులను వేధించేందుకు మాత్రమే పరిమితమయ్యారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉదయం 10 గంటలకు ముందు మద్యం షాపు తెరవకూడదు. రాత్రి 10 గంటలకు మూసేయాలనేది నిబంధనల్లో ఒక భాగం. అలాగే ఎమ్మార్పీ రేటుకు అధికంగా విక్రమించరాదు. వీటిని ఉల్లంఘిస్తే యంత్రాంగం చర్యలు చేపట్టాలి. ఇంతకాలం ఇవేవీ పట్టించుకోని ఎక్సైజ్ శాఖకు ఒక్కమారుగా నిబంధనలు గుర్తుకొస్తున్నాయని మద్యం యజమానులు పేర్కొంటున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటే అదీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రతిరోజు షాపులు తనిఖీలు చేయడం చెప్పినట్లు వినండి, అందరికీ ఉపయోగం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న తతంగం ఇటీవల కాలంలో అధికమైనట్లు సమాచారం. రెన్యువల్ మామూళ్లు కోసమే.... మద్యం వ్యాపారులకు వేలం పాటలు లేకుండా మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గతంలో చెల్లించిన లెసైన్సు ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపించే వ్యాపారుల షాపులను రెన్యువల్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ఇబ్బందులు, ఉత్కంఠత లేకుండా షాపులను అప్పగిస్తున్నాం కదా...రెన్యువల్ మామూళ్లు కింద ఒక్కోక్క షాపు రూ.లక్ష చెల్లించాలని ఎక్సైజ్ యంత్రాంగం ధర నిర్ణయించినట్లు ఆరోపణలున్నాయి. దీనిని వ్యాపారులు బహిరంగంగానే వ్యతిరేకించినట్లు సమాచారం. తుదకు వ్యాపారంలో అపార అనుభవం ఉన్న కొందరు అటు యజమానులు, ఇటు ఎక్సైజ్ అధికారులతో చర్చలు నిర్వహించినట్లు సమాచారం. తీవ్ర చర్చల అనంతరం రూ.50వేలు ఇవ్వాల్సిందేనని ఎక్సైజ్ అధికారులు గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బాగా వ్యాపారం చేపట్టే కొందరు మినహా, ఈ ప్రతిపాదనకు కూడా మద్యం వ్యాపారులు అధిక శాతం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రూ.20వేలు రెన్యువల్ మామూళ్లు ఇవ్వాలని వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరదంటూ ఎక్సైజ్ అధికారులు భీష్మించుకున్నట్లు తెలుస్తోంది. అందుబాటులోకి రాని అధికారులు ఈవిషయాలపై ఎక్సైజ్ సూపరిండెండెంటు వరప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన హలో హలో అంటూ ఫోన్ పెట్టేశారు. ఆపై పలుమార్లు ప్రయత్నించినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని అసిస్టెంటు కమిషనర్ విజయకుమారి వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఆవిషయం ఈఎస్నే అడగండని చెప్పారు. దండోపాయం ప్రయోగం.... ఆశించిన మేరకు మామూళ్లు కట్టబెట్టని మద్యం షాపులపై సామ, దాన, దండోపాయాలు ప్రయోగించే పనిలో ఎక్సైజ్ శాఖ నిమగ్నమైనట్లు సమాచారం. ప్రతిరోజూ తనిఖీలు చేస్తూ మద్యం ప్రియుల ఎదుట వ్యాపారులను అభాసుపాలు చేసే చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. గురువారం కూడా కడప నగరంలో ఓ మద్యం షాపునకు చెందిన బెల్టుషాపుల విక్రయదారులపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 15 బెల్టుషాపుల పరిధిలో విక్రేతలను అదుపులోకి తీసుకొని కేసులు లేకుండా వదిలేసినట్లు సమాచారం. అందుకు కారణం సెటిల్మెంటేనని తెలుస్తోంది. ఎమ్మార్పీ రేటు కంటే అధికంగా విక్రయిస్తున్నారని గ్రామీణ ప్రాంతాలలో కొన్ని షాపులపై కేసుల ఉదంతం కూడా మామూళ్ల కోవలో భాగమేనని పలువురు ఆరోపిస్తున్నారు.