the winner
-
హాకీటోర్నీ విజేత ‘అనంత’ జట్టు
ధర్మవరంటౌన్ : విశాఖపట్నంలోని ఎలమంచిలిలో జరుగుతున్న ఏపీ 7వ జూనియర్ బాలుర హాకీ ఇంటర్ డిస్ట్రిక్ టోర్నీలో ‘అనంత’ జట్టు విజయకేతనం ఎగురవేసింది. సోమవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ‘అనంత’ జట్టు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ‘అనంత’ జట్టు వైజాగ్ జట్టుతో తలపడగా 2–0 తేడాతో విజయం సాధించింది. అనంత జట్టులో సాయి–1, శివ–1లు తలా ఒక గోల్ చేసి జట్టును విజయ తీరానికి చేర్చారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధాన కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఎమ్మెల్సీ చలపతిరావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతిని అందజేశారు. విజేత జట్టుకు హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాంఛోఫెర్రర్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లెం వేణుగోపాల్, బీవీఆర్ శ్రీనివాసులు, పరిశీలకుడు వడ్డే బాలాజీలు అభినందనలు తెలిపారు. -
చెస్ టోర్నీ విజేత సుభాని
ధర్మవరం టౌన్ : స్థానిక ఉషోదయ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో వైఎస్సార్ జిల్లా వాసి అస్రాఫ్ సుభాని విజేతగా నిలిచాడు. శశిధర్ కార్తీక్ (వైజాగ్), ప్రసాద్ (ప్రకాశం) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కింగ్ చెస్ అకాడమి ఆధ్వర్యంలో యువర్స్ ఫౌండేష¯న్ సహకారంతో నిర్వహించిన ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 162 మంది పాల్గొన్నారు. వారిలో ఉత్తమ పాయింట్లు సాధించిన 25 మందిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉషోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతి«థిగా డిప్యూటి డీఎంహెచ్‌వో యుగంధర్, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మాధవరావు, యువర్స్ పౌండేషన్ సభ్యులు చాంధ్‌బాషా, పోలా ప్రభాకర్ హాజరయ్యారు. సుభాని, కార్తీక్, ప్రసాద్‌లతోపాటు మరో 23 మందికి డిప్యూటి డీఎంహెచ్‌వో యుగంధర్, ఎస్బీఐ మేనేజర్ మాధవరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదరంగం క్రీడతో మానవుని మేధస్సును పెంచుకునే వీలుందన్నారు. ఈ క్రీడను అభివృద్ధి చేయడంలో ధర్మవరం వాసులు మంచి కృషి చేస్తున్నారని అభినందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతియేటా నవంబర్ నెలలో రేటింగ్ చెస్ టోర్నీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్ చెస్ అకాడమి నిర్వాహకుడు జాకీర్, ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ బీవీ ప్రకాష్, సీనియర్ చెస్ క్రీడాకారుడు అశ్వర్థనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ-ఏపీ రీజియన్‌కు టైటిల్
ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ క్రీడలు హైదరాబాద్: ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ క్రీడల లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ- ఏపీ రీజియన్ విజేతగా నిలిచింది. సీనియర్ బాలికల కేటగిరీలో శుక్రవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ-ఏపీ రీజియన్ జట్టు 2-1తో తమిళనాడు జట్టును ఓడించి టైటిల్‌ను కై వసం చేసుకుంది. బిహార్-జార్ఖండ్ జట్టు మూడో స్థానంలో నిలవగా... నార్త్ ఇండియా పంజాబ్ జట్టు నాలుగో స్థానంలో సరిపెట్టుకుంది. జూనియర్ బాలికల విభాగంలో తెలంగాణ- ఏపీ రీజియన్ 1-2తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోరుు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ విభాగంలో కర్నాటక 2-0తో తమిళనాడుపై గెలిచి మూడో స్థానాన్ని దక్కించుకుంది. జూనియర్ బాలుర విభాగంలో కర్నాటక... సీనియర్ బాలుర విభాగంలో మహారాష్ట్ర విజేతగా నిలిచారుు. ఈ రెండు విభాగాల్లో తెలంగాణ- ఏపీ రీజియన్‌కు మూడో స్థానం దక్కింది. -
కుర్రాళ్లూ అదుర్స్
వాలెన్సియా: నాలుగు దేశాల అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత యువ జట్టు 5-2 తేడాతో జర్మనీపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే విరుచుకుపడిన భారత్‌కు 10వ నిమిషంలో పర్వీందర్ సింగ్, 22వ నిమిషంలో అర్మాన్ ఖురేషి గోల్స్ అందించారు. ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురుకాకపోవడంతో 40వ నిమిషంలో గుర్జాంత్ సింగ్, 44వ నిమిషంలో వరుణ్ కుమార్ చేసిన గోల్స్‌తో భారత్ 4-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అరుుతే 46, 65వ నిమిషాల్లో జర్మనీకి రెండు గోల్స్ లభించారుు. ఇక 69వ నిమిషంలో ఆనంద్ లక్రా భారత్‌కు ఐదో గోల్ అందించి విజయాన్ని ఖాయం చేశాడు. జట్టు ఆటగాళ్లకు హాకీ ఇండియా లక్ష చొప్పున నజరానా ప్రకటించింది. వ్యక్తిగత ప్రదర్శనకు హర్మన్‌ప్రీత్, వరుణ్ కుమార్‌లకు మరో లక్ష చొప్పున అదనంగా ఇవ్వనుంది. -
అద్వానీకి మరో ప్రపంచ టైటిల్
అడిలైడ్: భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన పీటర్ గిల్‌క్రిస్ట్‌ను 1168 పాయింట్ల తేడాతో ఓడించిన అద్వానీ విజేతగా నిలిచాడు. 30 ఏళ్ల అద్వానీకి ఇది 14వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. గత వారం పాయింట్ ఫార్మాట్ ఫైనల్లో గిల్‌క్రిస్ట్ చేతిలోనే ఓడిన అద్వానీ తాజాగా టైమ్ ఫార్మాట్లో ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. ఆదివారం జరిగిన ఈ ఫైనల్లో పంకజ్ 2408 (127, 360, 301, 284, 124, 101, 106, 171, 114, 430 నాటౌట్) పాయింట్లు సాధించగా... గిల్‌క్రిస్ట్ 1240 (102, 156, 249, 107, 198) పాయింట్లు సాధించి పరాజయం పాలయ్యాడు. అంతకుముందు పంకజ్ ఆరంభంలోనే సెంచరీ (127) బ్రేక్‌తో ఆధిక్యం కనబరిచాడు. ఆ తర్వాత వరుసగా రెండు ట్రిపుల్ సెంచరీ బ్రేక్‌లతో చెలరేగి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ‘చక్కటి ప్రణాళికతోనే ఈ విజయం దక్కింది. ఫైనల్‌కు ముందు రోజు రాత్రి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ శ్రీ సలహాలతో పాటు చక్కటి నిద్ర కూడా ఈ గెలుపునకు కారణమైంది’ అని ఇటీవలే 6-రెడ్ స్నూకర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అద్వానీ తెలిపాడు. -
చాంపియన్ యు ముంబా
ఫైనల్లో బెంగళూరుపై గెలుపు తెలుగు టైటాన్స్‌కు మూడో స్థానం ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్ ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా జట్టు విజేతగా నిలిచింది. తొలి సీజన్లో రన్నరప్‌గా నిలిచిన యు ముంబా ఈసారి కచ్చితంగా టైటిల్ దక్కించుకోవాలనే కసితో ఆరంభం నుంచే అదరగొట్టి చివరకు అనుకున్న ఫలితం సాధించింది. ఆదివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో 36-30 తేడాతో ముంబా నెగ్గింది. విజేతకు రూ. కోటి ప్రైజ్‌మనీ లభించగా... ర న్నరప్ బెంగళూరుకు రూ.50 లక్షలు దక్కాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరును ముంబా జట్టు రెండు సార్లు ఆలౌట్ చేయగా, షబీర్ బాపు 9 రైడ్ పాయింట్లు సాధించాడు. బెంగళూరు కెప్టెన్ మంజీత్ చిల్లార్ కూడా 9 పాయింట్లు సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు నువ్వా.. నేనా అనే రీతిలో తలపడ్డాయి. తొలి పాయింట్‌ను ముంబానే సాధించినప్పటికీ వెంటనే బెంగళూరు తేరుకుని గట్టి పోటీనిచ్చింది. దీంతో ఆరంభ 15 నిమిషాల ఆటలో 7-7తో ఇరు జట్లు సమానంగా పాయింట్లు పంచుకున్నాయి. అయితే అర్ధ భాగం ముగుస్తుందనగా ముంబా ఒక్కసారిగా జోరు పెంచింది. అత్యుత్తమ డిఫెన్స్‌తో ఆకట్టుకుని 16-8తో ఆధిక్యం అందుకుంది. ఆ తర్వాత ద్వితీయార్థం ప్రారంభంలో బెంగళూరు రైడర్స్ కాస్త పోరాడారు. కానీ అటాకింగ్ ఆటతో ముంబా జట్టు పైచేయి సాధించింది. 32వ నిమిషంలో 23-18తో వెనుకబడి ఉన్న సమయంలో బెంగళూరు రైడర్ అజయ్ ఠాకూర్ కోర్టులో ఉన్న ముగ్గురినీ అవుట్ చేసి ఐదు పాయింట్లతో స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయినా ముంబా ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాక పోగా షబీర్ బాపు ఒకేసారి మూడు పాయింట్లతో జట్టును 29-24 ఆధిక్యంలో నిలిపాడు. ఇదే జోరును చివరిదాకా చూపిన ముంబా విజేతగా నిలిచింది. మూడో స్థానంలో తెలుగు టైటాన్స్ లీగ్ ఆద్యంతం అద్భుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు మూడు, నాలుగో స్థానాల కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో 34-26 తేడాతో పట్నా పైరేట్స్‌ను టైటాన్స్ చిత్తు చేసింది. రాహుల్ చౌదరి 10, ప్రశాంత్ రాయ్ 6 రైడ్ పాయింట్లు సాధించారు. పట్నాను రెండు సార్లు ఆలౌట్ చేయగలిగింది. పట్నా కెప్టెన్ సందీప్ నర్వాల్ ఆల్‌రౌండ్ షోతో 11 పాయింట్లు సాధించి ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. తొలి అర్ధ భాగంలోనే 16-8తో టైటాన్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్‌కు రూ.30 లక్షలు, పట్నాకు రూ. 20 లక్షలు ప్రైజ్‌మనీగా ఇచ్చారు. ఉత్తమ ఆటగాళ్లు: ై రెజింగ్ స్టార్ ఆఫ్ ద టోర్నీ: సందీప్ (టైటాన్స్) రూ. 5 లక్షలు ఏ రైడర్ ఆఫ్ ద టోర్నీ: కషిలింగ్ (ఢిల్లీ) రూ. 5 లక్షలు ఏ డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ: రవీందర్ (ఢిల్లీ) రూ. 5 లక్షలు ఏ ఆల్‌రౌండర్ ఆఫ్ ద టోర్నీ: మంజీత్ చిల్లర్ (బెంగళూరు) మహీంద్రా జీపు -
వన్డే నాకౌట్ విజేత ఆంధ్రా బ్యాంక్
సెంచరీతో చెలరేగిన రవితేజ సాక్షి, హైదరాబాద్: కిషన్ పర్షాద్ ‘ఎ' డివిజన్ (మూడు రోజుల జట్ల) వన్డే నాకౌట్ టోర్నమెంట్లో ఆంధ్రా బ్యాంక్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం హకీంపేట్ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో ఆంధ్రా బ్యాంక్ 4 పరుగుల తేడాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా బ్యాంక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ద్వారకా రవితేజ (112) సెంచరీ చెలరేగాడు. రొనాల్డ్ రోడ్రిగ్జ్ (59), అభినవ్ కుమార్ (53)లతో పాటు నీరజ్ బిస్త్ (43) రాణించాడు. ఎస్బీహెచ్ బౌలర్లలో ఆల్ఫ్రెడ్ అబ్సలం, రవికిరణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఎస్బీహెచ్ 49.3 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. డానీ డెరెక్ ప్రిన్స్ (145) భారీ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. అశ్విన్ యాదవ్ (47), అహ్మద్ ఖాద్రీ (30) ఫర్వాలేదనిపించారు. ఆంధ్రా బ్యాంక్ బౌలర్లలో రవితేజ, ఖాదర్, లలిత్ మోహన్, ఆశిష్ రెడ్డి తలా 2 వికెట్లు తీశారు.