తెలంగాణ-ఏపీ రీజియన్‌కు టైటిల్ | Telangana-AP Region to title | Sakshi
Sakshi News home page

తెలంగాణ-ఏపీ రీజియన్‌కు టైటిల్

Published Fri, Nov 11 2016 11:18 PM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

తెలంగాణ-ఏపీ రీజియన్‌కు టైటిల్ - Sakshi

తెలంగాణ-ఏపీ రీజియన్‌కు టైటిల్

ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ క్రీడలు 

హైదరాబాద్: ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ క్రీడల లాన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ- ఏపీ రీజియన్ విజేతగా నిలిచింది. సీనియర్ బాలికల కేటగిరీలో శుక్రవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ-ఏపీ రీజియన్ జట్టు 2-1తో తమిళనాడు జట్టును ఓడించి టైటిల్‌ను కై వసం చేసుకుంది. బిహార్-జార్ఖండ్ జట్టు మూడో స్థానంలో నిలవగా... నార్త్ ఇండియా పంజాబ్ జట్టు నాలుగో స్థానంలో సరిపెట్టుకుంది.

జూనియర్ బాలికల విభాగంలో  తెలంగాణ- ఏపీ రీజియన్ 1-2తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోరుు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ విభాగంలో కర్నాటక 2-0తో తమిళనాడుపై గెలిచి మూడో స్థానాన్ని దక్కించుకుంది. జూనియర్ బాలుర విభాగంలో కర్నాటక... సీనియర్ బాలుర విభాగంలో మహారాష్ట్ర విజేతగా నిలిచారుు. ఈ రెండు విభాగాల్లో తెలంగాణ- ఏపీ రీజియన్‌కు మూడో స్థానం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement