జిల్లా క్రికెట్ పోటీల విజేత భీమడోలు
కొవ్వూరు రూరల్ : ఐ.పంగిడి క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. భీమడోలు టీమ్ విజేతగా నిలిచింది. 18 రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో 32 జట్లు పాల్గొన్నాయి. మంగళవారం ఫైనల్స్‌లో భీమడోలు, ఐ.పంగిడి జట్లు తలపడ్డాయి. తొలి బ్యాటింగ్ చేసిన భీమడోలు 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం పంగిడి జట్టు 15 ఓవర్లలోనే 110 పరుగుల వద్ద ఆల్ అవుట్ కావడంతో భీమడోలు జట్టును విజేతగా ప్రకటించారు. విజేతకు రూ.22,220 నగదుతో పాటు, షీల్డ్‌ను, రన్నరప్‌కు రూ.11,111తో పాటు షీల్డ్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ చేతుల మీదుగా అందించారు. మ్యాన్ఆఫ్ది మ్యాచ్‌గా భీమడోలు టీముతో శివకు, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఐ.పంగిడి జట్టు నుంచి రాచపోలు గోపీకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ముళ్లపూడి రాజేంద్రప్రసాద్, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, పొట్రు సిద్దూ తదితరులు పాల్గొన్నారు.