Winter session of the Assembly
-
సభకు ఆహ్వానం
ఉద్దండరాయునిపాలెంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రత్యేక టెక్నాలజీతో ఏర్పాట్లు, వాటర్ ఫ్రూప్ టెంట్లు ఎమ్మెల్యేలకు హాయ్‌ల్యాండ్‌లో బస సీఎం చంద్రబాబును ఒప్పించిన స్పీకర్ కోడెల విజయవాడ : ఈ ఏడాది అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఉద్దండరాయునిపాలెం వేదిక కానుంది. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబును ఒప్పించటంతో వచ్చే డిసెంబరులో ఐదు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్‌లోని అసెంబ్లీలోనే శాసనసభ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీని విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయించినప్పటికీ సమావేశాల నిర్వహణలో తరచూ చిన్నపాటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మరోపక్క సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, పాలనా యంత్రాంగం కూడా ఎక్కువ రోజులు విజయవాడలోనే ఉంటూ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేబినెట్ సమావేశాలు, పార్టీ రాష్ట్ర సమావేశాలు కూడా ఇక్కడే జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని శంకుస్థాపన జరిగే ప్రాంగణంలోనే సమావేశాలు నిర్వహించనున్నట్లు మంగళవారం కోడెల హైదరాబాదులో ప్రకటించారు. దానికనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు కూడా అందజేశారు. సమావేశాల కోసం భారీ ప్రాంగణం... అధునాతన టెక్నాలజీని ఉపయోగించి రెయిన్ ప్రూఫ్, సన్‌ప్రూఫ్ టెంట్లను వినియోగించి భారీ తాత్కాలిక సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. శంకుస్థాపన కోసం దాదాపు వంద ఎకరాల పైన ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో భద్రతా పరమైన ఏర్పాట్లతోపాటు సభ నిర్వహణకు ప్రాంగణం అనువుగా ఉంటుందని, అలాగే కారుపార్కింగ్, ఇతర సమస్యలు ఉండవనేది అధికారుల భావన. హాయ్‌ల్యాండ్‌లో బస రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి హాజరయ్యే శాసనసభ్యులకు సభ జరిగే ఐదు రోజులపాటు హాయ్‌ల్యాండ్, సమీపంలోని ప్రధాన హోటళ్లలో ప్రభుత్వ ఖర్చులతో బస ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభ అనంతరం యోగ గురువు రామ్‌దేవ్‌బాబాతో ఎమ్మెల్యేలకు యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నేడు వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం భేటీ
సాక్షి, హైదరాబాద్: శీతాకాల అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు వైఎస్సార్సీ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాల యంలో ఈ సమావేశం జరుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో గట్టిగా నిలదీయాలని పార్టీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయి చర్చించారు. సమావేశంలో శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా, కల మట వెంకటరమణ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, వై.విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్వసభ్య సమావేశం అనుమానమే?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ చివరి పాలకమండలి సమావేశం జరుగుతుందా? చివరి భేటీలో అధికారుల తీరును ఇరుకున పెట్టాలనుక్ను ప్రజాప్రతినిధుల ఆశలు అడియాలు కానున్నాయా? కీలక అంశాలు చర్చించకుండానే పాలక మండలి గడువు ముగియనుందా?ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికార వర్గాలు. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చేనెల 3వ తేదీతో ముగుస్తోంది. ఆలోగా చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించాలనుకున్నారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు జీహెచ్ంఎసీ సర్వసభ్య సమావేశం నిర్వహించకూడదు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్అఫీషియో సభ్యులు సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా ఈ నిబంధన రూపొందించారు. ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈనెల 22 వరకే అసెంబ్లీ జరగాలి. దీంతో 29న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి మేయర్ తేదీని ఖరారు చేశారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు 29వ తేదీ వరకు జరిపేందుకు నిర్ణయించడంతో సర్వసభ్య సమావేశం జరిపేందుకు వీల్లేకుండా పోయింది. ఆ తర్వాతనైనా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలనుకుంటే.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసేలోగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. ప్రత్యేక అనుమతులతో తప్ప జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం లేదు. చివరి సమావేశంలో తీవ్రంగా స్పందించాలని పలువురు ప్రజాప్రతినిధులు భావించా రు. ఆమేరకు ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. మేయర్‌కు, కమిషనర్‌కు మధ్య అభిప్రాయభేదాలు బహిరంగం కావడంతో చివరి సర్వసభ్యసమావేశంలో అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య యుద్ధం జరగగలదనే చర్చ జరిగింది. తీరా సర్వసభ్య సమావేశమే జరగని పరిస్థితి ఎదురవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటుండగా... ఎలాగైనా సమావేశాన్ని జరపాలనే యోచనలో కొందరు ఉన్నారు. అందుకు తగ్గ అవకాశాలేమైనా ఉన్నాయేమోననే ఆలోచనలో పడ్డారు. -
పోరుకు సిద్ధం!
= రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు = విమర్శనాస్త్రాలను సిద్ధం చేసుకున్న విపక్షాలు = ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలను ఎండగట్టేలా వ్యూహాలు = సంతోష్ లాడ్‌పై చర్యలకు ఒత్తిడి తెచ్చే అవకాశం = బెల్గాంలో ఇది నాలుగో సమావేశం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలో సోమవారం నుంచి శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశముంది. ఇప్పటికే విపక్షాలు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధం చేసుకున్నాయి. ఈ ఆరు నెలల పాలనలో ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఎండగట్టడానికి పూనుకున్నాయి. సంతోష్ లాడ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించినా.. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నాయి. పథకాలలో చోటుచేసుకున్న అవినీతిపై నిలదీయనున్నాయి. భారీ భద్రత.. బెల్గాంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసన సభ శీతాకాల సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తామని శాసన మండలి చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి తెలిపారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పది రోజుల పాటు సమావేశాలు జరుగుతాయన్నారు. మొత్తం 1,150 ప్రశ్నలకు అవకాశం కల్పించనున్నామన్నారు. మహారాష్ట్రలోని మరాఠీ రెజిమెంట్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో శాసన సభ సమావేశాల్లో పాల్గొనే సభ్యులకు పూర్తి భద్రతను కల్పించాల్సిందిగా సూచించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికార పక్షంగా.... బెల్గాంలో ఈసారి నాలుగో సమావేశాలు జరుగనున్నాయి. 1952 నుంచి ఇప్పటి వరకు మొత్తం 61 ఏళ్లకు గాను కాంగ్రెస్ 43 సంవత్సరాలు అధికారంలో ఉంది. కేవలం 18 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన విపక్షాలు బెల్గాంలో గత మూడు సమావేశాల్లో అధికార పార్టీలుగా ఉంటూ వచ్చాయి. 2005లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్గాంలో శాసన సభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. అప్పట్లో ధరం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే జేడీఎస్ మద్దతు ఉపసంహరణతో ఆయన నాయకత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. తదనంతరం జేడీఎస్-బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి 2006 డిసెంబరు 25 నుంచి ఐదు రోజుల పాటు బెల్గాంలోని కేఈఎల్ సంస్థకు చెందిన జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో తొలి సమావేశాలను నిర్వహించారు. అనంతరం 2009 జనవరి 16 నుంచి అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఐదు రోజులు, గత ఏడాది డిసెంబరు ఐదో తేదీ నుంచి పది రోజుల పాటు జగదీశ్ శెట్టర్లు సమావేశాలను నిర్వహించారు. ఈ మూడు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారం పక్షంగా మారింది.