శీతాకాల అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది.
సాక్షి, హైదరాబాద్: శీతాకాల అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాల యంలో ఈ సమావేశం జరుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో గట్టిగా నిలదీయాలని పార్టీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయి చర్చించారు. సమావేశంలో శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా, కల మట వెంకటరమణ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, వై.విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.