Withdrawn
-
బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్‌కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్‌కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్‌డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా? ) Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank. This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023 బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్), బకాయలను చెల్లించేందుకు తమను సంప్రదించినట్లు బరోడాకు చెందిన బీవోబీ బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. pic.twitter.com/L4BdXxeuyN — Bank of Baroda (@bankofbaroda) August 21, 2023 కాగా మధ్యప్రదేశ్‌లో గురుదాస్ ఎంపీ సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు, ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ విల్లా, సినీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ‘సన్నీ సూపర్ సౌండ్’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్‌కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్ తండ్రి, బాలీవుడ్ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం. -
#Rafael Nadal: తిరగబెట్టిన గాయం.. ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరం
స్పెయిన్ బుల్.. టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు దూరమయ్యాడు. దీనికి తుంటి ఎముక గాయం తిరగబెట్టడమే కారణమని తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తుంటి గాయంతో టోర్నీ మధ్యలోనే నాదల్ వైదొలిగాడు. అప్పటినుంచి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరోసారి గాయం తిరగబెట్టడంతో గురువారం తాను ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం లేదని నాదల్ స్వయంగా స్పష్టం చేశాడు. కాగా 2004 నుంచి వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడుతూ వస్తున్న నాదల్ తనకు అచ్చొచ్చిన గ్రాండ్‌స్లామ్‌కు దూరమవ్వడం ఇదే తొలిసారి. క్లేకోర్టు రారాజుగా అభివర్ణించిన నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కొల్లగొడితే.. అందులో 14 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లే కావడం విశేషం. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్‌లో 115 మ్యాచ్‌లు ఆడిన నాదల్ 112 మ్యాచ్‌లు గెలిచి కేవలం మూడు మాత్రమే ఓడిపోయాడు. దీన్నిబట్టే ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఆధిపత్యం ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక 2024 ఏడాదిలో నాదల్ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలికే అవకాశాలు ఉన్నట్లు AFP ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టిన నాదల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విషయంలో జొకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. -
గవర్నర్ తమిళిసై విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరఫు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో బడ్జెట్ తేదీ మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 3వ తేదీ బదులు 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ తెలంగాణ సర్కార్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్ సిఫార్సులకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో.. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ నాటకీయ పరిణామల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌కు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం. చదవండి: కేసీఆర్ సర్కార్ Vs గవర్నర్.. మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు గతంలో ఏం జరిగింది? రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుండగా, ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సాంకేతికంగా వెసులుబాటు ఉంది. దీనిని ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. తనను అవమానించడానికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగాన్ని రద్దు చేసుకుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గతేడాది గవర్నర్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే సిఫారసు చేయకుండా పెండింగ్‌లో ఉంచగలనని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమైన నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై సోమవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగం ఉంటుందని టీఎస్ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. -
నేరస్తుల అప్పగింత బిల్లు వెనక్కి
హాంకాంగ్/బీజింగ్: కొన్ని నెలలుగా నిరసనలకు కారణమైన వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు బుధవారం హాంకాంగ్ ప్రకటించింది. ఈ బిల్లుపై వ్యతిరేకతే తరువాత కాలంలో మరిన్ని ప్రజాస్వామ్య మార్పులను కోరుతూ తీవ్రమైన నిరసనలకు కారణమైంది. బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్ సిటీ సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ స్థానిక చట్ట సభలో ప్రకటించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు కొందరు ప్రజాస్వామ్య మద్దతుదారులైన సభ్యులు ప్రయత్నించగా ఆయన సమాధానమివ్వలేదు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను మార్చలేదు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్‌ను మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను చైనా తోసిపుచ్చింది. అది స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టించిన రాజకీయ వదంతి అని పేర్కొంది. కేరీ లామ్ స్థానంలో తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను నియమించే దిశగా చైనా ఆలోచిస్తోందని లండన్ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తోసిపుచ్చారు. లామ్‌కు తమ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. హాంకాంగ్‌లో త్వరలోనే హింస నిలిచిపోయి, సాధారణ స్థితి ఏర్పడుతుందన్నారు. నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కు తీసుకోవడంతో పాటు లామ్ రాజీనామా చేయాలన్నది హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య వాదుల ప్రధాన డిమాండ్. బిల్లులో ఏముంది? ఈ బిల్లు ఆమోదం పొందితే చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికైనా నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను హాంకాంగ్ అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హాంకాంగ్‌కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. చైనాతో మాత్రం లేదు. 1997లో హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింద హాంకాంగ్‌కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. చాన్ అనే హాంకాంగ్ పౌరుడు తైవాన్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి తిరిగి హాంకాంగ్‌కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చింది. చాన్ హాంకాంగ్ జైళ్లో ఉన్నాడు. నేరస్తుల అప్పగింతకు ముందు ఆ అభ్యర్థనను కోర్టులో సవాలు చేసే అవకాశం బిల్లులో ప్రతిపాదించారు. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. -
కలెక్టరేట్‌కు వీడని గ్రహణం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కలెక్టరేట్ కొత్త భవన నిర్మాణానికి కాలం కలసి రావడం లేదు. దీని కోసం విడుదలైన నిధులు మళ్లీ వెనక్కి వెళ్లిపోయాయి. రెండేళ్ల కిందట నిధులు మంజూరైనప్పటికీ .. స్థలం ఖరారు కాకపోవటంతో వెనక్కి మళ్లిపోయాయి. ఈసారి ఏ కారణం లేకుండానే సర్కారు విడుదల చేసిన నిధులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. శిథిలావస్థలో ఉన్న నాంపల్లి పాత కలెక్టరేట్ భవన్ స్థానంలో కొత్తది నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.80 కోట్లు విడుదల చేసింది. జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. రెండు జిల్లాలుగా చేయాలన్న అధికార యంత్రాంగం ప్రతిపాదనలకు విపక్షాల ఒత్తిడి కారణంగా బ్రేక్ పడింది. దీంతో కలెక్టరేట్ భవన నిర్మాణానికి ఆటంకాలు తలెత్తాయి. జనాభా ప్రాతిపదికన కొత్త మండలాలు ఏర్పడగలవన్న ఆశలకు కూడా తెరపడినట్లయింది. నిధులు వెనక్కి మళ్లడంతో ఇంకెంత కాలం శిథిల భవన సముదాయాల్లో విధులు నిర్వహించాలనని ఉద్యోగులు అందోళన చెందుతున్నారు.