Woman burned alive
-
కుటుంబ సభ్యుల కళ్లెదుటే మహిళ సజీవదహనం
ప్రత్తిపాడు: కుటుంబ సభ్యుల కళ్లెదుటే మహిళ సజీవదహనమైన హృదయవిదారక ఘటన ప్రత్తిపాడులో జరిగింది. ప్రత్తిపాడు ఎస్ఐ డి.రవీంద్రబాబు కథనం ప్రకారం ప్రత్తిపాడుకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కొత్తా ఆదిలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. ఆస్తుల విషయమై చిన్నకూతురు సుజాత (45) కుటుంబానికి, ఆదిలక్ష్మికి మధ్య వివాదం తలెత్తింది. చిన్నకూతురుతోపాటు ఆమె కుటుంబమంతా తన ఇంట్లో ఉంటూ, తనను కొట్టి చిత్రహింసలు పెడుతోందంటూ ఆదిలక్ష్మి ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. కొద్దిరోజుల కిందట ప్రత్తిపాడుకు వచ్చిన ఎమ్మెల్యేనూ కలిసి గోడును వెల్లబోసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానికుల సమక్షంలో ఆదిలక్ష్మి, పెద్దకుమార్తె కోటేశ్వరి తమ ఇంటి పోర్షన్‌కు హద్దు గోడ నిర్మించుకునేందుకు కూలీలను తీసుకువచ్చారు. దీంతో చిన్న కూతురు సుజాతకు, ఆది లక్ష్మికి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి సుజాత పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుంది. అగ్గిపెట్టెతీసి వెలిగిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఆమె 14 ఏళ్ల కొడుకు వద్దమ్మా అంటూ ప్రాధేయపడినా ఆమె వినలేదు. అగ్గిపెట్టే గీయడంతో చీరకు మంట అంటుకుని క్షణాల వ్యవధిలో అగ్నికీలలు సుజాత దేహమంతా వ్యాపించాయి. దీంతో స్థానికులు దూరంగా పరుగులు తీశారు. కొడుకు, కుటుంబ సభ్యుల ఎదుటే ఆమె పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి పరిశీలించి ఆమె మృతిచెందినట్టు నిర్ధారించారు. ప్రత్తిపాడు ఎస్ఐ రవీంద్ర ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. -
మహిళ సజీవ దహనం
జహీరాబాద్: కర్ణాటకలో జరిగిన కారు ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. గురువారం బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకా పరిధిలోని నిర్ణ క్రాస్‌రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. మన్నాఎక్కెల్లి ఎస్.ఐ సునీత మార కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్ భార్య, కుమారులతో కలసి మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు వైద్యం కోసం వెళ్లాడు. వైద్యం చేయించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యాడు. నిర్ణ సమీపంలో 65వ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఉదయ్ కారును నిలిపి కుమారులు జీవన్‌కుమార్, గగన్‌కుమార్‌లను బయటకు తీశాడు. భార్య కల్యాణి (39)ని కూడా బయటకు తీసే ప్రయత్నం చేయగా ఆమె సీటు బెల్టు ధరించి ఉండటంతో సాధ్యం కాలేదు. ఈలోగా మంటలు మరింత వ్యాపించడంతో కల్యాణి కారులోనే సజీవ దహనమైంది. కారులో హీటర్‌ను వేయడం వల్లే మంటలు అంటుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఉదయ్ హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపాడు. ప్రమాదంపై మన్నాఎక్కెల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వరకట్న వేధింపులు తాళలేక
మహిళ సజీవ దహనం వేలూరు: వరకట్న వేధింపులతో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటన వందవాసిలో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని సూతంబేడు గ్రామానికి చెందిన తంగరాజ్ భార్య తమిళరసి(25) వీరికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆ సమయంలో 15 సవరాల బంగారం, పెళ్లి సామాగ్రిని మహిళ తల్లిదండ్రులు కట్నంగా అందజేశారు. వివాహం జరిగి కొద్ది రోజులు మాత్రమే తంగరాజ్, ఇళవరసి కలిసి సంతోషంగా జీవించారు. అనంతరం అదనపు కట్నం తేవాలని కోరుతూ భర్త తంగరాజ్, అతని కుటుంబ సభ్యులు తరచూ వేధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 7వ తేదీన ఇంట్లో ఉన్న ఇళవరసి కాలిన గాయాలతో ఉన్న విషయాన్ని స్థానికు లు గమనించారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఇళవరసిని స్థానికులు వందవాసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తమిళరసి వద్ద న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. వరకట్నం కోసం తన ను చిత్ర హింసలు పెట్టి తనను కిరోసిన్ పోసి కాల్చారని తెలిపినట్లు తెలిసింది. ఇందుకు కారణం భర్త తంగరాజ్, అమ్మ పెరియమ్మాల్, భర్త అన్న సెల్వమణి, చెల్లెలు విమల నలుగురు కారణమని వాంగ్మూలం ఇచ్చింది. ఇదిలా ఉండగా తమిళరసి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. వీటిపై పోలీసులకు మహిళ తల్లి దండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న తంగరాజ్‌తో పాటు కుటుంబ సభ్యులు నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివాహం జరిగి రెండు సంవత్సరాలు కావడంతో సెయ్యారు సబ్ కలెక్టర్ ప్రభు శంకర్ విచారణ చేస్తున్నారు. -
మహిళ సజీవదహనం
మిర్యాలగూడ కైం : ఓ మహిళ సజీవదహనమైంది. సన్నిహితంగా ఉంటున్న యువకుడే ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పంటించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకా రం.. అనుముల మండలం అల్వాలకు చెందిన కన్నెబోయిన రాములమ్మ కూతురు సరిత(35) వివాహం దేవరకొండకు చెందిన బ్యాంకు ఉద్యోగి నీలం వెంకటేశ్వర్లుతో 14 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు జన్మించారు. మూడేళ్లుగా సరిత భర్తతో విడిగా ఉంటూ మిర్యాలగూడ మందులవారి కాలనీలో నివసిస్తోంది. కుమారుడు రాహుల్ హైదరాబాద్‌లో ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా, కుమార్తె శ్రీజ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి అభ్యసిస్తోంది. సరిత తన తల్లిగారి ఊరైన అల్వాలకు చెందిన యువకుడు ఆవులదొడ్డి కరుణాకర్‌తో సన్నిహితంగా మెలుగుతోంది. ఘర్షణ పడి.. ఆపై కిరోసిన్ పోసి..? అల్వాలకు చెందిన కరుణాకర్ తరచు సరిత ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కరుణాకర్ తీవ్ర ఆవేశానికి లోనైసరితపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో సరిత కరుణాకర్‌ను పట్టుకోవడంతో అతడికి మంటలు అంటుకున్నాయి. ఏదో విధంగా సరితను విడిపించుకున్న కరుణాకర్ ఇంటి ఆవరణలో ఉన్న నల్లా వద్ద మంటలను చల్లార్చుకుని, ఓ యువకుడి సహాయంతో ఆస్పత్రికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లోనే నిద్రిస్తున్న సరిత కూతురు లేచి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలు, పొగరావడాన్ని గమనించారు. వెంటనే ఇంటి వెనుక భాగం తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా మంటల్లో కాలుతున్న సరిత ఒంటిపై నీళ్లు చల్లారు. తీవ్ర గాయాలైన సరిత అక్కడికక్కడే మృతిచెందింది. మరోగదిలో ఉన్న సరిత కూతురును స్థానికులు క్షేమంగా బయటకు పంపారు. పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ మోహన్, సీఐ సుదర్శన్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. పెళ్లికి ఒప్పుకోరనే.. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణాకర్‌ను పోలీసులు విచారించారు. కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్న తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, దీనికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరనే బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే అతడి చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే సరితకు తీవ్ర గాయాలై చనిపోవడం, కరుణాకర్ స్వల్పంగా గాయపడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరుణాకర్ ఈ ఘాతుకానికి ఒటిగట్టి పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా మెరుగైన చికిత్స కోసం కరుణాకర్‌ను అతడి బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి కన్నెబోయిన రాములమ్మ ఫిర్యాదు మేరకు కరుణాకర్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. -
మహిళ సజీవదహనం
తిరుమలంపాలెం(ద్వారకాతిరుమల), న్యూస్‌లైన్ : ఇంట్లో వంట చేస్తూ కాసేపు మంచంపై విశ్రమించిన మహిళను ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. రక్షించండంటూ ఆమె కేకలు పెడుతున్నా.. మంటలు చుట్టూ వ్యాపించడంతో ఇంట్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించక ఆమె సజీవ దహనమైంది. ఈ ఘటన బుధవారం ఉదయం ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుమలంపాలెంకు చెందిన మేకల మంగమ్మ(45) భర్త ఏడేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లితో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఆమెకు గ్రామానికి చెందిన ఈరుళ్లుతో వివాహం కాగా ఏడాదికే విడాకులు పొందారు. అనంతరం ఏలూరు సమీపంలోని మాదేపల్లికి చెందిన కాశితో ఆమెకు పెళ్లైంది. వీరికి పిల్లలు లేరు. ఏడేళ్ల క్రితం కాశి మృతిచెందగా తిరిగి ఆమె తిరుమలంపాలెంలోని పుట్టిం టికి చేరుకుంది. ఏడాది క్రితం తండ్రి రుద్రబోయిన రెడ్డియ్య అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లి గంగమ్మతో కలిసి ఉంటోంది. బుధవారం ఉద యం 6.30 గంటల సమయంలో తల్లిని గ్రామంలోనే ఉంటున్న మృతురాలి సోదరి నెరుసు ఉల్లూరు ఇంటికి పంపి గురువారం బలివే వెళదామని చెప్పి రమ్మంది. తల్లి వెళ్లగానే 7 గంటల సమయంలో మంగమ్మ వంట చేస్తూ.. మంచంపై కాసేపు విశ్రమించింది. కొద్ది నిమిషాల్లోనే మంటలు తాటాకింటికి చుట్టూ వ్యాపించడంతో బయటకు రాలేని పరిస్థితిలో ఆమె సజీవ దహనమైంది. ఎస్సై కర్రి సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొయ్యిలో నిప్పురవ్వలు ఎగసిపడటంతో ప్రమాదం జరిగిందా.. లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్నది తెలియరాలేదు. -
మహిళ సజీవ దహనం
హైదరాబాద్, న్యూస్‌లైన్: దీపావళి పండుగపూట హైదరాబాద్‌లోని పం జాగుట్ట ప్రాంతంలో ఓ ఇంట్లో విషా దం అలముకుంది. టపాసు వచ్చి గుడిసెపై పడడంతో అది పూర్తిగా దగ్ధమై, అందులో నిద్రిస్తున్న ఓ మహిళ సజీవ దహనమైంది. స్థాని కులు స్పందించి మంటలను ఆర్పేయడంతో చుట్టుపక్కల వారికి ప్రమా దం తప్పింది. వివరాలు.. పంజాగుట్ట పరిధిలోని రామకృష్ణనగర్ కాలనీలో కన్నబోయిన సంఘమేశ్వర్, అతని భార్య నాగమణి(50) లు ఓ గుడిసెలో నివసిస్తున్నారు. వీరి పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడంతో వీరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. సంఘమేశ్వర్ శనివారం మెదక్ జిల్లా బాచుపల్లికి వెళ్లడంతో నాగమణి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఇదిలావుంటే, శనివారం అర్ధరాత్రి సమయంలో దీపావళి టపాసు స్కైలాంప్ జీవీకే వైపు నుంచి దూసుకువచ్చి నాగమణి ఉన్న గుడిసెపై పడింది. దీంతో ఒక్కసారిగా గుడిసెకు నిప్పంటుకుంది. అయితే, గాఢనిద్రలో ఉన్న నాగమణి ఈ ప్రమాదం గ్రహించేలోగానే మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. ఇంట్లోని టీవీ, ఫ్యాను, గ్యాస్ స్టౌ, మంచం, బట్టలు, ఇతర వస్తువులు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. ఈ సమయంలో నాగమణి గుడిసెను ఆనుకుని ఉన్న జలేందర్‌కు చెందిన గుడిసెకూ నిప్పంటుకుంది. మంటలు టీవీకి అంటుకుని అది పేలిపోవడంతో జలేందర్ మేల్కొని చూడగా గుడిసె సగభాగం అప్పటికే కాలిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులను బయటకు పంపి, చుట్టుపక్కల వారిని నిద్రలేపి జలేందర్ మంటలను ఆర్పివేశారు. ఇదే ఘటనలో నాగమణి గుడిసెకు ఎదురుగా ఉన్న ఇంట్లో కరెంట్ మీటర్ పూర్తిగా, ఇంటితలుపులు స్వల్పంగా కాలిపోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలిబూడిదైన నాగమణి అస్థికలను ఓ గుడ్డలో చుట్టుకుని పోస్టుమార్టానికి పంపారు. -
ఎర్రమంజిల్‌లో మహిళ సజీవ దహనం
హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో దీపావళి పండగ రోజు విషాద ఘటన జరిగింది. తారాజువ్వపడి గుడిసె దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో నాగమణి అనే మహిళ సజీవ దహనం అయింది. ఘటనా స్థలాన్ని ఆర్డీఓ, తహసీల్దార్, టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. మృతరాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.