woman reservations
-
17% సీట్లు అమ్మాయిలకే..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి అమ్మాయిలకు 17 శాతం సీట్లను కేటాయించేందుకు ఐఐటీ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. గతేడాది సూపర్‌న్యూమరరీ కింద 779 సీట్లను పెంచి అమ్మాయిల ప్రవేశాలను 15.3 శాతానికి చేర్చిన ఐఐటీ కౌన్సిల్ ఈ సారి కనీసంగా 17% దాటేలా చూడాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సీట్ల పెంపునకు చర్యలు చేపట్టింది. 2017–18 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో చేరిన అమ్మాయిల సంఖ్య 9.15 శాతమే ఉండటంతో దానిని 2020–21 విద్యా సంవత్సరం నాటికి కనీసంగా 20 శాతానికి పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018–19 విద్యాసంవత్సరం ప్రవేశాల్లో 14 శాతం సీట్లను కేటాయిస్తామని ప్రకటించింది. ప్రవేశాల కౌన్సెలింగ్‌లో రెగ్యులర్‌గా సీట్లు లభించిన వారు కాకుండా అదనంగా 779 మంది అమ్మాయిలకు ప్రత్యేక సీట్లను కేటాయించింది. దీంతో ఆ విద్యాసంవత్సరంలో ఐఐటీల్లో చేరిన అమ్మాయిల సంఖ్య 1,840కి చేరింది. ఇక ఈసారి (2019–20 విద్యా సంవత్సరం) 17 శాతం సీట్లను పెంచేందుకు ఐఐటీల కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రవేశాలు పెంచేందుకు.. దేశవ్యాప్తంగా 2014–15లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అమ్మాయిల్లో కేవలం 8 శాతం మందికే ఐఐటీల్లో సీట్లు లభించాయి. 2015–16లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 4,600 మంది అమ్మాయిలు అర్హత సాధిస్తే అందులో 850 మందికే సీట్లు వచ్చాయి. 2016–17 విద్యా సంవత్సరంలోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. 2017–18 ప్రవేశాల లెక్కల ప్రకారం ఐఐటీల్లో 9.15 శాతం మంది అమ్మాయిలకే సీట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్య పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు చర్యలు చేపట్టింది. వరుసగా మూడేళ్ల పాటు ప్రత్యేక సీట్లు కేటాయించి అమ్మాయిల ప్రవేశాలను కనీసంగా 20 శాతానికి చేర్చాలని కేంద్రం గతేడాది నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. వీటిని సూపర్‌న్యూమరీ కింద ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. అబ్బాయిల సీట్లను తగ్గించకుండా అమ్మాయిలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయించింది. 2017–18 విద్యా సంవత్సరంలో చేరిన 9.15 శాతానికి 4.85 శాతం కలిపి కనీసంగా 14 శాతం మంది అమ్మాయిలకు ప్రవేశాలు లభించేలా సీట్లను పెంచింది. ఇక ఈసారి 17 శాతం సీట్లను కేటాయించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి బీటెక్ కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య 2 వేలు దాటనుంది. పెరగనున్న సీట్లు.. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 11,279 సీట్లున్నాయి. వాటికి అదనంగా 779 సీట్లు చేర్చి 2018–19 విద్యా సంవత్సరంలో సీట్లను 12,058కి పెంచింది. ఈసారి కనీసంగా 17 శాతం కంటే ఎక్కువ మంది అమ్మాయిలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని ప్రకారం 2019–20 విద్యా సంవత్సరంలో అమ్మాయిలకు అదనంగా వేయి సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది సీట్ల పెంపులో భాగంగా అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అమ్మాయిలకు 113 అదనపు సీట్లు లభించగా, హైదరాబాద్ ఐఐటీలో 57 అదనపు సీట్లు వచ్చాయి. దీని ప్రకారం ఈ సారి వాటి సంఖ్య మరింతగా పెరుగనుంది. -
మళ్లీ మహిళా బిల్లు..!
దేశ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు మరోసారి చర్చనీయాంశమైంది. బుధవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం పురుషులకే పరిమితమైందా ? ముస్లిం మహిళలు ఎదుర్కుంటున్న ట్రిపుల్ తలాఖ్ సమస్యపై ఆ పార్టీ వైఖరేమిటంటూ ఉత్తరప్రదేశ్‌లో గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమది ముస్లింల పార్టీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పిన వార్త పత్రికల్లో చూశానని, అయితే ఆయన పార్టీ ముస్లిం పురుషుల కోసమేనా లేక మహిళల కోసం కూడానా అని ప్రశ్నిస్తున్నామన్నారు. విపక్షాలు పార్లమెంట్ సమావేశాలు స్తంభింపచేస్తూ, ట్రిపుల్ తలాఖ్ వంటి ముఖ్యమైన చట్టాలకు అడ్డుపడుతున్నాయంటూ మోదీ మండిపడ్డారు. ఈ విమర్శలపై స్పందిస్తూ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బేషరతు మద్దతునిస్తున్నట్టు సోమవారం ప్రధానికి ఓ లేఖ రూపంలో రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు. పార్టీలకు అతీతంగా మోదీ వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించాలని, అందుకు తమ పార్టీ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2010లోనే రాజ్యసభ ఆమోదం పొందినా, ఇంకా లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంది. 1974లోనే ఈ అంశంపై తొలిసారిగా చర్చ ఫలితంగా ఓ నివేదికను సమర్పించారు. 1993లో 73, 74 రాజ్యాంగ సవరణల రూపంలో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాలకు పైగా ఈ బిల్లు పయనం సాగిందిలా... -- చట్టసభల్లో మహిళలకు మరింత మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌పై దేశవ్యాప్తంగా చర్చ నేపథ్యంలో 1996లో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తెరపైకి వచ్చింది. – దేవెగౌడ ప్రభుత్వహయాంలో 1996 సెప్టెంబర్ 12న మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. – కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో ఈ బిల్లుపై (81వ రాజ్యాంగ సవరణ రూపంలో) గీతా ముఖర్జీ అధ్యక్షతన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుచేశారు. 11వ లోక్‌సభలో భాగంగా 1996 డిసెంబర్ 9న జేపీసీ నివేదిక సమర్పించింది. –1998 జూన్ 26న (12వ లోక్‌సభలో) ఈ బిల్లును 84వ రాజ్యాంగ సవరణ బిల్లుగా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. –13వ లోక్‌సభలో భాగంగా 1999 నవంబర్ 22న మరోసారి ప్రవేశపెట్టారు. ఈ బిల్లును చేపడితే మద్దతునిస్తామంటూ కాంగ్రెస్, వామపక్షాలు లిఖితపూర్వకంగా హామీనిచ్చా,యి. – మళ్లీ 2002లో ఒకసారి, 2003లో రెండు పర్యాయాలు సభ సమక్షానికి తీసుకొచ్చినా ఆమోదం పొందలేకపోయింది. – 2004 మేలో యూపీఏ హయాంలో కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఈ బిల్లుకు చోటు లభించింది. అయితే ఆ ప్రభుత్వం కూడా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టలేకపోయింది. – 2008 మే 6న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాక, దీనిని స్థాయిసంఘానికి నివేదించారు. – 2009 డిసెంబర్ 17న స్థాయి సంఘం నివేదిక సమర్పణ అనంతరం ఉభయసభల్లో బిల్లు ప్రవేశపెట్టాక సమాజ్‌వాదీ, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు నిరసనలు తెలియజేశాయి. – 2010 ఫిబ్రవరి 25న మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం – 2010 మార్చి 8న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టినా నిరసల నేపథ్యంలో ఓటింగ్ వాయిదా వేశారు. యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామంటూ ఎస్పీ, ఆర్జేడి హెచ్చరించాయి. – 2010 మార్చి 9న పూర్తి మెజారిటీతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. -
ఫిఫ్టీ...ఫిఫ్టీ
- రిజర్వేషన్ల లెక్క తేలింది - మహిళలకు సగం డివిజన్లు - సోమ లేదా మంగళవారాల్లో వార్డుల ఖరారు గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి మహిళలు చక్రం తిప్పనున్నారు. పాలక మండలిలో సగభాగం కాబోతున్నారు. నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. మొత్తం 150 డివిజన్లలో సగం (75) మహిళలకే దక్కనున్నాయి. వీరిలో అన్ని వర్గాల వారూ ఉండబోతున్నారు. శుక్రవారం రిజర్వేషన్ల లెక్క తేలడంతో దీనిపై స్పష్టత వచ్చింది. ఇక ఏ వార్డు.. ఏ వర్గానికి వెళుతుందో రెండు...మూడు రోజుల్లో ఖరారు కాబోతోంది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం. ఏయే వర్గాలకు ఎన్ని వార్డులు వంతున వస్తాయో లెక్క తేలుస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వు చేయాల్సి ఉండటంతో అందుకనుగుణంగా వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లతో సహా) 75 సీట్లు కేటాయించారు. 33 శాతం బీసీలకు కేటాయించాల్సి ఉన్నందున వారికి 50 సీట్లు ఖరారు చేశారు. 150 వార్డుల్లో ఏయే వార్డులు ఎవ రెవరికి అనేది మాత్రం వెల్లడించలేదు. సోమ లేదా మంగళవారాల్లో ఇది ఖరారయ్యే అవకాశం ఉంది. రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ ఏ వార్డు ఎవరికి రిజర్వ్ చేశారో తెలుసుకునేందుకు రాజకీయ పక్షాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. వివిధ డివిజన్ల నుంచి పోటీ చేయాలని యత్నిస్తున్న నాయకులు దీనికి మరింత ఆత్రంగా చూస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారవుతున్నాయని తెలియగానే... ఏ వార్డు ఎవరికో తెలుసుకునే పనిలో పడ్డారు. తాము కోరుకున్న డివిజన్ అంచనాల మేరకు లేకపోతే ఏం చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నారు. ఒక వేళ మహిళలకు రిజర్వు అయితే తమ సతీమణులకో, కుమార్తెలకో బరిలో దించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మేయర్ పీఠం ఈసారి బీసీలకు దక్కనుంది. ఈ నేపథ్యంలో పలువురు బీసీ నేతలు రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసిన వారు సైతం మేయర్ పదవి కోసం కార్పొరేటర్‌గా పోటీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అవకాశాల్లో సగం.. ఆకాశంలో సగమైన మహిళలకు ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సగం అవకాశాలు దక్కనున్నాయి. మొత్తం 150 సీట్లకుగాను వారికి 75 సీట్లు ఖరారయ్యాయి. అంటే పాలక మండలిలో ఈసారి పురుషులతో సమాన సంఖ్యలో మహిళలు ఉంటారన్నమాట. ఇక ఓపెన్ కేటగిరీలో గతంలో 58 సీట్లు ఉండగా... ఈసారి అవి 44కు తగ్గాయి. ఎస్సీలకు గతంలో 12 ఉండగా... ప్రస్తుతం 10కి తగ్గాయి. మహిళలు ఎక్కువగా ఉన్న డివిజన్లు మహిళలకు మొత్తం 75 సీట్లు దక్కనుండటంతో వారికి ఏయే వార్డులు వెళతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుభాష్‌నగర్‌లో అత్యధికంగా 34,152 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. హఫీజ్‌పేటలో 30,528 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 25 వేలకు పైగా ఉన్న డివిజన్లు మొత్తం 26. అవి.. సరూర్‌నగర్ (28,474), ఆర్కేపురం(27,716), సైదాబాద్ (27,638), మూసారాంబాగ్ (25,367), ఐఎస్ సదన్(25,398), మైలార్‌దేవ్‌పల్లి (29,830), జాంబాగ్(26, 878), గన్‌ఫౌండ్రి (25,116), అంబర్‌పేట(25,318), బాగ్‌అంబర్‌పేట (25,504), రామ్ నగర్ (26,126), ఖైరతాబాద్(25,614), కొండాపూర్ (28,252), బాలాజీ నగర్ (26,828), అల్లాపూర్ (25,193), కుత్బుల్లాపూర్ (27,032), నేరేడ్మెట్ (25,999), మౌలాలి (26,913), ఈస్ట్ఆనంద్బాగ్(25,279), మల్కాజిగిరి (26,847), గౌతమ్ నగర్ (27,898), తార్నాక (27,973), బన్సీలాల్‌పేట (25,016), మోండా మార్కెట్(25,592). ఈ డివిజన్లు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. గతంలో వార్డుల రిజర్వేషన్ తీరిదీ.. ఎస్టీ మహిళ: జంగమ్మెట్, ఎస్టీ జనరల్: అమీర్‌పేట ఎస్సీ మహిళలు: యాప్రాల్, అడ్డగుట్ట, పద్మారావునగర్, అల్వాల్. ఎస్సీ జనరల్: గచ్చిబౌలి, మెట్టుగూడ, ఓల్డ్ మల్కాజిగిరి, బన్సీలాల్‌పేట, మచ్చబొల్లారం, కవాడిగూడ, రాజేంద్రనగర్, జియాగూడ. బీసీ (మహిళ): పురానాపూల్, నవాబ్‌సాహెబ్‌కుంట, మారేడ్‌పల్లి, రెడ్‌హిల్స్, చిలకలగూడ, కాచిగూడ, ఫలక్‌నుమా, రామ్‌గోపాల్‌పేట, గుడి మల్కాపూర్, కార్వాన్, జహనుమా, బౌద్ధనగర్, నానల్‌నగర్, ఆసిఫ్‌నగర్, రామ్‌నగర్, ఆర్సీపురం, దత్తాత్రేయనగర్. బీసీ జనరల్: అహ్మద్‌నగర్, అలియాబాద్, జగద్గిరిగుట్ట, చందానగర్, మురాద్‌నగర్, ఎర్రగడ్డ, చావుని, డబీర్‌పురా, శేరిలింగంపల్లి, సుల్తాన్‌బజార్, టోలిచౌకి, గౌలిపురా, మల్లేపల్లి, బాగ్‌అంబర్‌పేట, మూసారాంబాగ్, గాజుల రామారం, ఫతేదర్వాజ, అంబర్‌పేట, సీతాఫల్మండి, చింతల్, హఫీజ్‌పేట, ధూల్‌పేట, షాపూర్‌నగర్, దూద్‌బౌలి, లంగర్‌హౌస్, జీడిమెట్ల, గోషామహల్, మంగళ్‌హాట్, పటాన్చెరు, రహ్మత్‌నగర్, రామ్నాస్పురా, మైలార్‌దేవ్‌పల్లి, బేగంబజార్. మహిళ జనరల్: బల్కంపేట, గడ్డిఅన్నారం, పీఅండ్‌టీ కాలనీ, కర్మాన్‌ఘాట్, బంజారాహిల్స్, చింతల్‌బస్తీ, విజయనగర్ కాలనీ, దోమలగూడ, గౌతంనగర్, సఫిల్‌గూడ, బేగంపేట, డిఫెన్స్ కాలనీ, మౌలాలి, గాంధీనగర్, ముషీరాబాద్, అత్తాపూర్, రామకృష్ణాపురం, హిమాయత్‌నగర్, తార్నాక, బోరబండ, సరూర్‌నగర్, ఉప్పల్, ఘాన్సిబజార్, నల్లకుంట, అడిక్‌మెట్, మన్సూరాబాద్, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ. -
ఎవరి సాధికారతకు మహిళా రిజర్వేషన్లు?
సందర్భం తన పదవిని లేక స్థానాన్ని ఖాళీ చేస్తున్న పురుషుడి ప్రయోజనం కోసం ఆ కుటుంబంలోనే ఒక మహిళను తీసుకొచ్చి అదే స్థానంలో కూర్చుండబెట్టడంగా మహిళా రిజర్వేషన్ అర్థం మార్చుకుంది. అక్కడ మహిళ నామమాత్రంగా ఉండిపోతుండగా, లావాదేవీలన్నింటినీ పురుషులే నిర్వహిస్తుంటారు ముందుగా కాలంలో కాస్త వెనక్కు వెళదాం. సీపీఎం నా యకురాలు బృందాకారత్ ముంబైలో ఒక ప్రెస్ కాన్ఫ రెన్సులో ప్రసంగిస్తున్నారు. పార్లమెంటులో, శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు కోటాను ముందుకు తీసుకుపోవడంలో అసమర్థంగా వ్యవహరించినందుకు ఆమె మునుపటి వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. ఎన్డీయే మహిళా వ్యతిరేక కూటమి అని ఆమె తర్కం. ఈ విషయమై ప్రశ్నించినప్పుడు.. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత దాని భవిష్యత్తు ప్రభుత్వం చేతుల్లో కాకుండా ఎంపీల చేతుల్లోనే ఉంటుందని బృందా కారత్ అంగీకరించారు. మహిళలకు కోటా బిల్లును పార్లమెంటులో సీపీఎం సహ ప్రయాణికులైన ములా యంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ దృఢంగా వ్యతిరేకించారు. మహిళలకు కోటాను వీరు వ్యతిరేకిం చడంలో లింగ పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నందున వీరి పార్టీలు కూడా సామాజిక బాధ్యతకు దూరంగా జరిగాయి. ఆ ఉదంతానికి సంబంధించిన అంశాలు నేటికీ మార్పు చెందలేదు. ఆస్తి హక్కులు, విడిపోయిన అనంతరం ఆర్థిక స్వాంతంత్య్రం వంటి అంశాలతో పాటు మహిళా సాధికారతకు వ్యతిరేకంగా ఎక్కడా వాదనలు ఉండవు. అంటే స్త్రీల విషయంలో సమాన త్వాన్ని అందరూ ఒప్పుకుంటారు. కానీ రాజకీయ సాధికారతే ఇప్పటికీ కీలకంగా ఉంటోంది. స్థానిక సంస్థ ల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు తప్పనిసరిగా కల్పించాలని 73వ రాజ్యాంగ సవరణ నిర్దేశించింది. ఇవి మహిళలకు సరిపోవు కానీ ఈ మాత్రం కోటా అమలు కూడా ఘోరంగా విఫలమైంది. ఇలాంటి ఉత్తమ విధానం కూడా రాజకీయ స్థాయిలో పూర్తిగా వక్రీకరణకు గురైంది. ఇది మనం పరిగణనలోకి తీసు కోలేని పరిణామాలకు దారితీసింది. ఉదాహరణకు, ఈ విధానం మహిళలను సాధారణ గృహాల నుంచి బయ టకు తీసుకువచ్చి చట్టసభల్లో కూర్చుండబెట్టగలిగిందా? పట్టణ పురపాలక సంస్థల్లో సగం సీట్లను మహిళలకు కేటాయించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవ లే ఒక ప్రకటన వచ్చింది. అంటే ఏ పురపాలక సంస్థలో అయినా పురుషులను, మహిళలను సంఖ్యాపరంగా సమాన స్థాయిలో నిలబెట్టగలిగే గణనీయ పెరుగుదల ఇది. అయితే ఇది కూడా అసంపూర్ణమే. ఎందుకంటే మహళలకు ఉద్దేశించిన స్థానాలను వార్డులవారీగా రొటేట్ చేస్తారు. అంటే ఆ స్థానంలో ఇప్పటికే కూర్చుని ఉన్న పురుషులు ఒక టర్మ్ వరకు కొనసాగుతారు. తర్వాత అది మహిళల పరమౌతుంది. మన రాజకీయ నేతల దృష్టిలో అది పెద్ద నష్టమే కదా. ఈ నష్టాన్ని రాజకీయ పలుకుబడి, డబ్బురూపేణా లాభాల దృష్టిలో అంచనా వేస్తారు. డబ్బు సమకూరుతుంది కాబట్టే చాలామంది రాజకీయ నేతలు రాజకీయాలనే తమ కెరీర్లుగా మార్చుకున్నారు. ఇది భూమిని కంపింపచేసే ఆవిష్కరణ కాదు కానీ, తన పదవిని లేక స్థానాన్ని ఖాళీ చేస్తున్న పురుషుడి ప్రయోజనం కోసం ఆ కుటుంబంలోనే ఒక మహిళను తీసుకొచ్చి అదే స్థానంలో కూర్చుండబెట్టడం ప్రధానమై పోయింది. ఈ పరిస్థితులలో మహిళ ప్రజాప్రాతినిధ్య సంస్థలో నామమాత్రంగా ఉండిపోతుంది. అక్కడ జరిగే వ్యవహారాలు, లావాదేవీలన్నింటినీ పురుషులే నిర్వ హిస్తుంటారు. భర్త, సోదరుడు, కుమారుడు లేదా మామ పంచా యతీ కార్యాలయాల్లో రాజ్యమేలుతుండగా, ఎంపికైన మహిళలు తలలు ఊపుతూ కూర్చోవలసిన పరిస్థితుల్లో ఉన్న పంచాయతీలను నేను చాలానే చూశాను. మహారాష్ట్రలో దశాబ్దాల క్రితం కొల్హాపూర్ జిల్లా పరిషత్‌లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించే ప్రయోగం మొదలైన రోజుల్లో ఆ ప్రయోగాన్ని ఇలా వ ర్ణించేవారు. ధీద్ సదస్య. అంటే ఒకటిన్నర సభ్యులు అని అర్థం. దీంట్లో అర్థ భాగం ఎంపికైన మహిళ అన్నమాట. సాధికారతా సాధనంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల పట్ల సమాజం ప్రదర్శించిన పరమ పాక్షిక వైఖరిని ఇది సూచిస్తుంది. నగరాలు కాస్త ఉదారవైఖరితో ఉంటాయని భావిస్తాము కానీ ఈ వైఖరి తర్వాత్తర్వాత నగర పురపాలక సంస్థలకు కూడా విస్తరించింది. బృహన్ ముంబయ్ ప్రాంతంలోని అతిపెద్ద నగరా ల్లో ఒకటైన కల్యాణ్ - దాంబివిలి మునిసిపల్ కార్పొరే షన్‌కు గతవారం జరిగిన ఎన్నికల్లో 50 శాతం మహిళలు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 50 శాతం కోటా గురించి ఆలోచిస్తున్నప్పటికీ అది అమలయ్యేంత వరకు వేచి ఉండని కొద్ది రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా నిలిచింది. కేరళ, క ర్ణాటక కూడా ఇదే బాట పట్టాయి. కానీ కల్యాణ్ - దాంబివిలి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక వాస్తవాన్ని దాచిపెట్టాయి. కార్పొరేషన్‌కు ఎంపికైన 122 మంది సభ్యులలో సగం మంది మహిళలే. వీరిలో ఆరుగురు మహిళలు పలు రాజకీయ పార్టీలకు చెందిన సిట్టింగ్ కార్పొరేటర్ల భార్యలు కావటం గమనార్హం. ఇలా ఎందుకు జరిగిందంటే నగరం విస్తరించినందున వార్డులను పునర్నిర్మించడంతో ఇప్పటికే కార్పొరేటర్లుగా ఉన్న భర్తలకు తమ తరపున ఒక కార్పొరేటర్ ఉండవలసిన అవసరం ఏర్పడింది. గౌరవనీయులైన తమ భార్యల కంటే వారికి మంచివారు ఇక ఎవరు దొరుకుతారు? ఏమైనప్పటికీ మహిళల సాధికారత కోసం వారికే కేటాయించిన సీట్ల కేటగిరీలో ఈ మహిళలు ఎంపికయ్యారు. దీంతో ఒక్కో వార్డు ఒక్కో కుటుంబ జాగీరు అయిపోయింది. దీంతో ఆ కుటుంబంలోని ఇతరుల్లో కూడా ఆ ఎన్నికల్లో పాల్గొనాలనే కుతూహలం పెరిగిపోయింది. మహిళా కోటా విధానం ప్రకారం మహిళలు బలోపేతం కావలసి ఉండగా, దానికి భిన్నంగా ఇప్పటికే అధికారంలో ఉన్న కార్పొరేటర్ కుటుంబానికి రాజకీయ పలుకుబడిని, శక్తిని ఈ విధానం కట్టబెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయ వ్యాపార సంస్థలుగా ఆవిర్భవిస్తున్న కుటుంబాల సాధికారతను మరింతగా పెంచడానికి ఈ మహిళా కోటా మరింతగా ఉపయోగపడుతోంది. మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com)