Woman software employee
-
విశాఖలో దారుణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సింహాచలం(విశాఖపట్నం): సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెందుర్తి మండలం దువ్వుపాలెంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ అప్పారావు తెలిపిన వివరాలివీ.. హైదరాబాద్‌కు చెందిన సౌజన్య(26)కి, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హనుమంతు గిరిప్రసాద్తో 8 నెలల కిందట వివాహం జరిగింది. మూడు నెలల కిందట వీరు దువ్వుపాలెంలో ఇళ్లు కొనుగోలు చేసి నివసిస్తున్నారు. గిరిప్రసాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. సౌజన్య అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోం ద్వారా విధులు నిర్వర్తిస్తోంది. వీరి వివాహం సమయంలో సౌజన్య తండ్రి విష్ణు.. గిరిప్రసాద్‌కు 6లక్షల నగదు, 13 తులా ల బంగారం ఇచ్చారు. చదవండి: నెత్తుటి మరక.. అతనొక మానసిక రోగి అయినా తరచూ డబ్బులు తీసుకురావాలని సౌజన్యతో గిరిప్రసాద్ గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. శనివారం సాయంత్రం గిరిప్రసాద్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి సౌజన్య ఉరివేసుకుని ఉంది. ఈ విషయాన్ని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేసి సీఐ అప్పారావు, ఎస్ఐ సురేష్ దర్యాప్తు చేస్తున్నారు. -
సురేఖ హత్య కేసు.. హంతకునికి యావజ్జీవం
కర్ణాటక, యశవంతపుర: టెక్కీని హత్య చేసిన నిందితుడికి సీబీఐ కోర్టు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. 2010 డిసెంబర్ 17న టెక్కీ పాయల్ సురేఖను జిమ్ ఇన్స్ట్రక్టర్ జేమ్స్ కుమార్ రాయ్ జేపీ నగర 6వ స్టేజీ ఆర్బీఐ లేఔట్లో హత్య చేశాడు. వివరాలు... సురేఖ భర్త అనంత్‌నారాయణ మిశ్రా బెంగళూరు, భువనేశ్వర్‌లో జిమ్ నిర్వహిస్తున్నాడు. బెంగళూరులో పనిచేసే జిమ్‌లో రాయ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడు. సురేఖ సూచనల మేరకు రాయ్‌ను పనిలో నుంచి తొలగించాడు. దీంతో ఆమెపై ద్వేషం పెంచుకుని 2010 డిసెంబర్ 17న దంపతులు ఉంటున్న అపార్టుమెంట్‌కు వెళ్లి సురేఖను హత్య చేశాడు. హత్య చేయటానికి ముందు రెండు మూడు సార్లు నిందితుడు అపార్టుమెంట్‌కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో సురేఖ వెంట్రుకలు, రక్తపు మరకలు నిందితుడు ఉపయోగించిన జాకెట్‌పై ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సురేఖను భర్త మిశ్రానే హత్య చేసి ఉంటాడని అనుమానించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయనపై కూడా కేసు పెట్టారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని సురేఖ తల్లిదండ్రులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. బెంగళూరులోనే చదువుకున్న సురేఖ, మిశ్రాలు 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేఖ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ జేపీ నగరలో నివాసం ఉంటోంది. హత్యకేసును సీరియస్‌గా తీసుకున్న సీబీఐ అధికారులు అన్ని ఆధారాలు సేకరించి రాయ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి సీబీఐ కోర్టు యావజ్జీవ శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణం
హైదరాబాద్‌సిటీ: రామాంతపూర్‌లో పారిజాత(27) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుంది. తలనొప్పి భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోటు రాసింది. సంఘటనాస్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగినితో అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను మలక్‌పేట పోలీసులు శనివారం కటకటాల వెనక్కి నెట్టారు. ఎస్ఐ రంజిత్ కుమార్ కథనం ప్రకారం... వనస్థలిపురానికి చెందిన వివాహిత (28) అమీర్‌పేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో పనిచేస్తున్న స్నేహితురాలి కోసం టీఎంసీ సమీపంలో వేచి ఉంది. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి వెంకటేశ్ (30), ఎంబీఏ విద్యార్థి శ్రీకాంత్ (28), అరుణ్ అనే ముగ్గురు యువకులు కారు (ఏపీ 09సీఆర్ 5130)లో వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెతో వాగ్వాదానికి దిగి చేయిపట్టుకుని లాగారు. ఆమె అరుపులు విని అదే మార్గంలో వెళ్తున్న కిషోర్ అనే వ్యక్తి వారిని అడ్డుకోబోగా.. అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాహితను వేధించిన శ్రీకాంత్, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. అరుణ్ పరారీలో ఉన్నాడు. నిందితులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. శ్రీకాంత్, వెంకటేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఠాణాలో శ్రీకాంత్ తండ్రి హంగామా.. పట్టుబడ్డ నిందితుల్లో శ్రీకాంత్ తండ్రి శ్రీధర్‌యాదవ్ మలక్‌పేట ఠాణాకు వచ్చి పోలీసులతో తన కుమారుడి అరెస్టు విషయమై వాగ్వాదానికి దిగి హంగామా సృష్టించాడు. ఇతను కర్నూలు సీఐడీ విభాగంలో డీఎస్పీగా పని చేస్తున్నట్లు తెలిసింది.