హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను మలక్‌పేట పోలీసులు శనివారం కటకటాల వెనక్కి నెట్టారు. ఎస్‌ఐ రంజిత్ కుమార్ కథనం ప్రకారం... వనస్థలిపురానికి చెందిన వివాహిత (28) అమీర్‌పేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో పనిచేస్తున్న స్నేహితురాలి కోసం టీఎంసీ సమీపంలో వేచి ఉంది.
నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి వెంకటేశ్ (30), ఎంబీఏ విద్యార్థి శ్రీకాంత్ (28), అరుణ్ అనే ముగ్గురు యువకులు కారు (ఏపీ 09సీఆర్ 5130)లో వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెతో వాగ్వాదానికి దిగి చేయిపట్టుకుని లాగారు. ఆమె అరుపులు విని అదే మార్గంలో వెళ్తున్న కిషోర్ అనే వ్యక్తి వారిని అడ్డుకోబోగా.. అతనిపై దాడి చేశారు.
ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాహితను వేధించిన శ్రీకాంత్, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. అరుణ్ పరారీలో ఉన్నాడు. నిందితులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. శ్రీకాంత్, వెంకటేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఠాణాలో శ్రీకాంత్ తండ్రి హంగామా..
పట్టుబడ్డ నిందితుల్లో శ్రీకాంత్ తండ్రి శ్రీధర్‌యాదవ్ మలక్‌పేట ఠాణాకు వచ్చి పోలీసులతో తన కుమారుడి అరెస్టు విషయమై వాగ్వాదానికి దిగి హంగామా సృష్టించాడు. ఇతను కర్నూలు సీఐడీ విభాగంలో డీఎస్‌పీగా పని చేస్తున్నట్లు తెలిసింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితో అసభ్య ప్రవర్తన
Published Sun, Jul 19 2015 8:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM
Advertisement