women driver saritha
-
అక్కా నన్ను బదిలీ చేయించు
ఎంపీ కవితకు మహిళా డ్రైవర్ సరిత వినతి సంస్థాన్ నారాయణపురం: ‘‘అక్కా నేను తెలంగాణ బిడ్డనే.. నన్ను ఢిల్లీ నుంచి ఇక్కడికి బదిలీ చేయించు’’ అని దేశంలోనే మొదటి మహిళా డ్రైవర్ అయిన వాంకుడోతు సరిత విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో కవితను కలసి వినతిపత్రం సమర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం సీత్యతండాకు చెందిన సరితకు మూడేళ్ల నుంచి ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలోని సరోజిని డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తోంది. తల్లిదండ్రుల బాధ్యత ఉండడంతో రెండుమూడు నెలలకోసారి ఇంటికి వచ్చి వెళుతోంది. దీంతో ఇబ్బందులు ఎదురవుతుండడంతో సంస్థాన్ నారాయణపురం జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్ సహకారంతో హైదరాబాద్‌లో కవితను కలిసింది. -
తెలంగాణలో పనిచేయాలని ఉంది: మహిళా డ్రైవర్
హైదరాబాద్ : దేశంలోని మొదటి మహిళా డ్రైవర్ సరిత తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని సచివాలయంలో శుక్రవారం కలిశారు. ఆమె స్వస్థలం నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన సరిత గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్స్ అచీవర్స్‌తో సహా పలు అవార్డులు అందుకున్నారు. దేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ చేతుల మీదుగా సరిత విమెన్ ఆఫ్ పవర్ అవార్డును కూడా అందుకున్నారు. కాగా, తాను తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తానని, తనకు తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే అవకాశం ఇవ్వాలని మంత్రిని కోరింది. పేద కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఎదుగుతున్న తనకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని కోరారు. సరిత విజ్ఞప్తికి మంత్రి మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.