తెలంగాణలో పనిచేయాలని ఉంది: మహిళా డ్రైవర్‌ | first woman driver meets minister mahender reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పనిచేయాలని ఉంది: మహిళా డ్రైవర్‌

Published Fri, Mar 3 2017 2:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

first woman driver meets minister mahender reddy

హైదరాబాద్ : దేశంలోని మొదటి మహిళా డ్రైవర్ సరిత తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని సచివాలయంలో శుక్రవారం కలిశారు. ఆమె స్వస్థలం నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన సరిత గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్స్ అచీవర్స్‌తో సహా పలు అవార్డులు అందుకున్నారు.
 
దేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ చేతుల మీదుగా సరిత విమెన్ ఆఫ్ పవర్ అవార్డును కూడా అందుకున్నారు. కాగా, తాను తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తానని, తనకు తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే అవకాశం ఇవ్వాలని మంత్రిని కోరింది. పేద కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఎదుగుతున్న తనకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని కోరారు. సరిత విజ్ఞప్తికి మంత్రి మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement