women strike
-
సెల్ టవర్ తొలగించాలంటూ మహిళల ఆందోళన
గుంటూరు(ఎడ్లపాడు): జనావాసాల మధ్యలో ఉన్న సెల్ టవర్‌ను తొలగించాలంటూ స్థానిక మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండల కేంద్రంలోని జనావాసాల మధ్య ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ను తొలగించాలంటూ స్థానిక మహిళలు తహసీల్దార్ కార్యలయం ఎదుటు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
రుణమాఫీ కోసం రోడ్డెక్కిన మహిళలు
అనంతపురం: డ్వాక్రా రుణాలు మఫీ చేయలేదని మహిళలు రొడ్డెక్కారు. అనంతపురం జిల్లా రొద్దం మండలకేంద్రంలో గురువారం పెద్ద ఎత్తున మహిళలు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ పాట పాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్వ్రాక్రా రుణాల ఊసెత్తడంలేదని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిపేశారు. (రోద్దం) -
మద్యంపై మహిళా పోరు
మెదక్ : అశాంతికి, అలజడులకు కారణమవుతున్న మద్యం అమ్మకాలను అరికట్టాలనే ఉద్దేశంతో మద్యం నిర్మూలన కోసం మహిళలంతా రోడ్డెక్కారు. తమ బతుకుల్లో చీకటి నింపుతున్న బెల్ట్ షాపులపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పాములపర్తి గ్రామానికి చెందిన మహిళలంతా బెల్ట్‌షాపు వద్దకు చేరుకొని అక్కడ ఉన్న మద్యం సీసాలను తీసుకెళ్లి గాంధీసెంటర్‌లో ధ్వంసం చేశారు. తమ బతుకుల్లో ఆర్థిక స్థిరత్వం లేకపోవడానికి మద్యమే ప్రధాన కారణమని, మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని బెల్ట్ షాపు యజమానులను హెచ్చరించారు.