మెదక్ : అశాంతికి, అలజడులకు కారణమవుతున్న మద్యం అమ్మకాలను అరికట్టాలనే ఉద్దేశంతో మద్యం నిర్మూలన కోసం మహిళలంతా రోడ్డెక్కారు. తమ బతుకుల్లో చీకటి నింపుతున్న బెల్ట్ షాపులపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
పాములపర్తి గ్రామానికి చెందిన మహిళలంతా బెల్ట్‌షాపు వద్దకు చేరుకొని అక్కడ ఉన్న మద్యం సీసాలను తీసుకెళ్లి గాంధీసెంటర్‌లో ధ్వంసం చేశారు. తమ బతుకుల్లో ఆర్థిక స్థిరత్వం లేకపోవడానికి మద్యమే ప్రధాన కారణమని, మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని బెల్ట్ షాపు యజమానులను హెచ్చరించారు.