womens success
-
అవకాశాల్లో ఆ సగమేదీ..
జిల్లా జనాభాలో సగభాగం మహిళలే విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో అరకొరే స్థానిక సంస్థల పదవుల్లో కొలువుదీరినా పెత్తనం పురుషులదే జిల్లాలో మహిళా ఎమ్మెల్యే, మేయర్ పరిస్థితి ఇదే బాట జిల్లా జనాభా 53 లక్షలు – మహిళా జనాభా : 26.52 లక్షలు అక్షరాస్యత 33.48 లక్షలు – మహిళల్లో అక్షరాశ్యులు : 15.8 లక్షలు విద్యార్థులు 11 లక్షలు – విద్యార్థినులు : 6 లక్షలు ఉద్యోగులు 40 వేలు – మహిళా ఉద్యోగులు : 15 వేలు కూలీలు 8 లక్షలు – మహిళా కూలీలు : 3 లక్షలు కార్మికులు 5 లక్షలు – మహిళా కార్మికులు : 2 లక్షలు స్థానిక సంస్థల రిజర్వేషన్ల పుణ్యమా అని... జెడ్పీటీసీలు 62 – మహిళా జెడ్పీటీసీ సభ్యులు : 33 ఎంపీపీలు 62 – మహిళా ఎంపీపీలు : 39 ఎమ్మెల్యేలు 19 – మహిళా ఎమ్మెల్యేలు : 2 మున్సిపల్,నగర పంచాయతీ చైర్మ7 – మహిళా చైర్పర్స¯ŒSలు : 3 మేయర్ : 1 సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆకాశంలో సగం... నినాదం బాగుంది... కానీ అవకాశాల్లో మాత్రం ఆ సగ భాగమేదీ అని ప్రశ్నిస్తోంది నారీ లోకం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోతున్నా మహిళలకు సంపూర్ణ స్వాతంత్య్రం ఎండమావిలానే మోసగిస్తోంది. అన్నింటా మహిళలకు సమాన ప్రాతినిధ్యం అందమైన నినాదంగానే మిగిలిపోతోంది. పునర్విభజనకు ముందు, తరువాత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి. జనాభా పరంగా మొదటి స్థానం ఈ జిల్లాదే. అటువంటి జిల్లాలో అతివలకు సముచిత స్థానం దక్కడం లేదనే ఆవేదన సర్వత్రా వినిపిస్తోంది. రాజకీయాల్లో కూడా మహిళల పాత్ర పరిమితమే. రాజ్యాంగం ప్రకారం మహిళలు పేరుకు పీఠాలు అధిష్టిస్తున్నా పెత్తనమంతా భర్తలదే. స్థానిక సంస్థలు మొదలుకుని ఎమ్మెల్యేల వరకు అన్నింటా జిల్లాలో ఇదే నడత కనిపిస్తోంది. ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే... కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె భర్త సత్యనారాయణమూర్తి అటు పార్టీలోను ఇటు అధికారిక కార్యక్రమాల్లోను తనదైన పాత్ర పోషిస్తున్నారు. రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీశేషసాయి. అధికారిక కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేయాలనే ఆలోచన ఉన్నా పురుషాధిక్య రాజకీయాల్లో ఆచరణలో ఆమె వెనుకడుగు వేయకతప్పడం లేదు. నగర ప్ర«థమ మహిళ అయినా ఆ స్థాయిలో తన ముద్ర వేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో మహిళననే చులకన చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. రాజకీయాల్లో అతివలు రాణించే సత్తా ఉన్నా వారికి సహాయనిరాకణే ఎదురవుతోందదనడానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాగే సాధారణ మహిళలకు కూడా వేధింపులు తప్పడం లేదు. మహిళలపై నిత్యం జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం అమలాపురం పట్టణంలో కళాశాలకు వెళుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను వెంటపడి వేధిస్తున్న యువకులపై పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే పరిస్థితికి దారితీసింది. చివరికి మంత్రి చినరాజప్ప జోక్యం చేసుకుంటే గానీ పోలీసుల్లో కదలిక రాలేదు. జిల్లాలో సగం... జిల్లా జనాభాలో సగానికి పైనే మహిళలున్నారు. కానీ వివిధ రంగాల్లో వారి సంఖ్యకు తగ్గట్టు ప్రాతినిధ్యం లభించడం లేదు. అక్షరాస్యత, ఉద్యోగాలు, కూలీలు, కార్మికులు..ఇలా అన్ని రంగాల్లోనూ వారి సంఖ్య అంతంతమాత్రమే. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతోందని చెబుతున్న ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య చూస్తే అరకొరే. అక్షరాస్యతలో, ఉద్యోగాల్లో, విద్యలో సగ భాగం కూడా దాటని దుస్థితి. చివరకు కార్మికుల సంఖ్య చూసుకున్నా అంతంతే. రిజర్వేషన్లు పుణ్యమా అని స్థానిక సంస్థల్లో సగానికి పైగా కొలువుదీరినా పెత్తనమంతే భర్తలదే. -
చిత్ర పరిశ్రమ
మహిళా విజయం అందమైన చిత్రాలు గీయడం ఓ చక్కటి కళ.వాటిని కొని ఇంట్లో అలంకరించుకోవడం అభిరుచి.కళకు, అభిరుచి కలిగిన వారికి మధ్య వారధిగా మారారు అనిత.చిత్ర ప్రదర్శనకు ఓ పరిశ్రమ రూపం ఇచ్చిన ఆమె అనుభవాలు... ‘‘మా వారు హరిశ్రీనివాస్ మంచి చిత్రకారులు. ఆయన బొమ్మలను ఇష్టపడే వారు చాలామంది ఉన్నారు. ఆయనలో చక్కటి కళాభిరుచి, దానిని ప్రతిబింబించే నేర్పు ఉన్నాయి కానీ వాటిని మార్కెట్ చేసే నైపుణ్యం లేదు. నిజానికి కళాకారుడి దృష్టి మార్కెట్ మీదకు మళ్లడం కష్టం. అలా మళ్లితే కళ కళ తప్పుతుందని నా నమ్మకం. నేరుగా మార్కెట్లోకి దిగకుండా బొమ్మలను ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శించడం వల్ల పెద్దగా లాభించదని కూడా అర్థమైంది. ఈ మథనంలోంచి ఆ పనేదో నేనే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘వెర్మిలియన్ ఆర్ట్ హౌస్’. హరిశ్రీనివాస్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి. వాటర్ కలర్, ఆయిల్ కలర్, చార్కోల్, పెన్సిల్ స్కెచ్‌లు... చాలా రకాల బొమ్మలు వేయగలరు. ఆయన చిత్రాలతో మొదట 2009లో కార్ఖానాలో ఆర్ట్ హౌస్‌ని స్థాపించాను. దానిని ఇటీవల బంజారాహిల్స్‌కు మార్చాను. మా వారి చిత్రాలకు ఓ వేదిక అని స్థాపించిన ఆర్ట్ హౌస్‌ను కొత్త చిత్రకారుల చిత్రాల ప్రదర్శనకు విస్తరించాను. కార్పొరేట్ స్థాయి ఆర్ట్ గ్యాలరీలలో అడుగు పెట్టలేని గ్రామీణ చిత్రకారులకు నేను కల్పించిన వేదిక పెద్ద ఆసరా అవుతోంది. ఈ గ్యాలరీని పాతిక వేలతో ప్రారంభించాను. ఆ తర్వాత ఒక చిత్ర ప్రదర్శనలో మా చిత్రాలను పెట్టే అవకాశం వచ్చింది. కానీ ఉన్నఫళంగా అన్నింటికీ ఫ్రేమ్ కట్టించడం కూడా బరువనిపించింది అప్పట్లో. ఫ్రేమ్ తయారీకి చాలా డబ్బు ఖర్చవుతుందని నేను ఆందోళనగా ఉన్నప్పుడు... ‘ఫ్రేమ్ కట్టిస్తాను, ఎగ్జిబిషన్లో అమ్ముడైన తర్వాత డబ్బివ్వండి’ అని ఫ్రేములు కట్టే లక్ష్మణ్ ధైర్యం చెప్పాడు. క్రమంగా నా మార్కెట్‌ను కార్పొరేట్ రంగానికి కూడా పరిచయం చేశాను. కొండ మన దగ్గరకు రాకపోతే... మార్కెట్ పరంగా నేనుప్రధానంగా తాజ్ వంటి పెద్ద హోటళ్లు, అపోలో వంటి హాస్పిటళ్లకు చిత్రాలను అందిస్తున్నాను. అలాగే నా చిత్రాల ధరలు మధ్య తరగతికి కూడా అందుబాటులో ఉంటాయి. అదే నా విజయ రహస్యం. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ప్రదర్శిస్తున్నాను. కొనుగోలుదారులు నా గ్యాలరీకి రావాలని కూర్చోలేదు. ఆసక్తి ఉన్న వారిని వెతుక్కుంటూ నేనే వెళ్లాను. అలా ప్రారంభించిన తరవాత వేగంగా చొచ్చుకుపోగలిగాను. శని, ఆదివారాల్లో క్లబ్ హౌస్‌లు, విల్లాలలో ప్రదర్శిస్తున్నాను. అక్కడ చాలామంది ఉత్సాహం చూపించేవారు. పిల్లల కోసం వారాంతాలలో, మహిళల కోసం మిగిలిన రోజుల్లో చిత్రలేఖనం నేర్పించమని అడిగారు. గతంలో సమ్మర్ క్యాంపుల్లో కోచింగ్ ఇచ్చాం, కానీ ప్రస్తుతం టైమ్ బాలన్స్ అవడం లేదు. గ్యాలరీ నిర్వహణలో నిలదొక్కుకున్న తర్వాత ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని మా ఇద్దరి కోరిక. నా వంతు సామాజిక బాధ్యతగా... మాది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చట్టం పరిధిలోకి వచ్చేటంత పెద్ద పరిశ్రమ కాదు. కానీ మా వంతు బాధ్యతగా క్యాన్సర్ పేషెంట్ల సహాయార్థం ప్రదర్శనలు పెట్టి, అమ్ముడైన చిత్రాల మీద వచ్చిన ఆదాయాన్ని విరాళంగా ఇస్తుంటాం. అలా మా చిత్రాలను ఉపాసన, రామ్‌చరణ్, జయసుధ, సోనూసూద్ వంటి సెలబ్రిటీలు చాలామంది క్యాన్సర్ పేషెంట్ల కోసం తమ వంతు సహాయంగా కలెక్ట్ చేశారు. మొదటి ప్రదర్శన రవీంద్రభారతిలో. ఇప్పటికి 53 ప్రదర్శనలు పెట్టాను. విజిటర్స్ ఫీడ్ బ్యాక్ చాలా బాగా వస్తోంది. ఫలక్‌నుమాలో పెట్టిన ప్రదర్శనలో ఖతర్ రాజు పది చిత్రాలను తీసుకున్నారు. సమాజంలో మధ్యతరగతి, దిగువ స్థాయిలో నివసిస్తున్న వారిలో చక్కటి చిత్రకారులున్నారు. తమ కళను ప్రదర్శించే అవకాశం లేక అలాంటి ఎందరో కళాకారులు తెరముందుకు రాలేకపోతున్నారు. నా గ్యాలరీ అలాంటి వారికి వేదిక కావాలనేదే నా ఆశయం. మా నాన్నది ఆదిలాబాద్, అమ్మది మహారాష్ట్ర. మా మేనమామ బొమ్మలు వేసేవారు. బహుశా నాకూ ఆ కళ అలా వారసత్వంగా అబ్బిందనుకుంటాను. చిన్నప్పుడు బొమ్మలు వేసి మిత్రులకు బహుమతిగా ఇచ్చేవాడిని. అది గమనించిన మా డ్రాయింగ్ టీచర్ ప్రోత్సహించారు. ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఉంటుందని కూడా ఆయన చెప్తేనే తెలిసింది. కోర్సు పూర్తయిన తర్వాత యాడ్ ఏజెన్సీ స్థాపించాను. బహుశా నాలోని చిత్రకారుడు... తాను బతికి ఉండడం కోసమే నా యాడ్ ఏజెన్సీని సరిగ్గా నడవనివ్వలేదేమో అనుకుంటాను. - హరిశ్రీనివాస్, చిత్రకారుడు -
జనుము నుంచి ధనము!
మహిళా విజయం నాగదేవి గోదావరి తీరాన పుట్టిన అచ్చమైన తెలుగింటి అమ్మాయి. పదవ తరగతితో చదువాపేసి తలవంచుకుని తాళి కట్టించుకున్న అమ్మాయి. అది ఒకప్పుడు... మరి ఇప్పుడు... పది మంది మహిళలకు ఉపాధినిస్తోన్న మహిళా పారిశ్రామికవేత్త! నేషనల్ జ్యూట్ బోర్డు ప్రోత్సాహంతో పొరుగు రాష్ట్రాల్లో మన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సృజనశీలి! వివరాలు ఆమె మాటల్లోనే... మాది రాజమండ్రి. మా వారు (జీవీఎస్ఎస్ నారాయణ) ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తారు. పెళ్లయిన తర్వాత హైదరాబాద్‌లో కాపురం పెట్టాం. ఐదేళ్ల కిందట రెండు కుట్టు మెషీన్లతో మొదలైన నా జ్యూట్ బ్యాగ్ యూనిట్ ఇప్పుడు 18 మెషీన్లతో నడుస్తోంది. ఎనిమిది మంది నెల జీతానికి పనిచేస్తున్నారు. మరో ఐదారుగురు పీస్ లెక్కన పనిచేస్తున్నారు. ఇంకో ఇరవై మంది శిక్షణ కోసం వస్తున్నారు. చిన్నప్పటి సరదాకి శిక్షణ తోడైంది... చిన్నప్పుడు బుట్టలు అల్లేదాన్ని. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కుటుంబం, పిల్లలతో అలవాటు తప్పింది. ఒకసారి ‘నేషనల్ జ్యూట్ బోర్డు’ వాళ్లు మా ఇంటికి దగ్గరలో ఉన్న సాకేత్ హాలిడే హోమ్స్ దగ్గర ఉచిత శిక్షణ క్యాంపు పెట్టారు. ఓసారి చూసి వద్దామని వెళ్లిన దాన్ని కాస్తా 21 రోజుల శిక్షణలో చేరి జ్యూట్‌తో సంచులు, ఇతర వస్తువులను చేయడం నేర్చుకున్నాను. శిక్షణ తర్వాత, జ్యూట్ బోర్డు జిల్లాల్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు, ఆ తర్వాత ఎలీప్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాలలోనూ టీచర్‌గా పనిచేశాను. ఖాళీ సమయంలో మార్కెటింగ్... శిక్షణ కార్యక్రమాలకు నాకు రోజుకు వెయ్యి రూపాయలిచ్చేవారు. క్లాసులు లేని సమయాల్లో మాకు దగ్గరలో ఉన్న ‘జ్యూటెక్స్ విలేజ్’లో తయారయ్యే వస్తువులను మార్కెట్ చేయడం మొదలుపెట్టాను. పెద్ద మొత్తంలో సరుకు తీసుకుని ఖైరతాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్, శిల్పారామంలలో స్టాల్ పెట్టేదాన్ని. అక్కడే కొత్త ఆర్డర్లు వచ్చేవి. వినియోగదారుల అవసరాన్ని బట్టి కొత్త డిజైన్లు రూపొందించి జ్యూటెక్స్ పరిశ్రమ నుంచి తయారు చేయించుకునేదాన్ని. ఇది గమనించిన జ్యూట్‌బోర్డు డెరైక్టరు నరసింహులుగారు ‘నువ్వే పరిశ్రమ స్థాపించవచ్చుకదా’ అన్నారు. అలా మొదలైందే ‘దేవి జ్యూట్ బ్యాగ్స్’! యాభై వేలతో... 2009లో రెండు మెషీన్లతో ప్రారంభించాను. రెండు మెషీన్లకు పాతికవేలు, ముడి సరుకుకు పాతిక వేలయింది. నాతోపాటు మరొక అమ్మాయి పనిచేసేది. నాకప్పటికి జీతం ఇవ్వగలననే భరోసా కూడా లేదు. ఆమెకి పీస్లెక్కన డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసుకున్నాను. ఇద్దరం కలిసి రోజుకు యాభై సంచులు కుట్టేవాళ్లం. ఇరవై రోజులు పని చేసుకుని ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లేదాన్ని. ప్రతినెలా ఏదో ఒక చోట జ్యూట్ బోర్డు వారి ప్రదర్శనలుండేవి. ప్రదర్శనలో ఉత్పత్తుల అమ్మకానికి వెళ్లిన వారికి జ్యూట్‌బోర్డు... టి.ఎ, డి.ఎ, ఉచితంగా స్టాల్‌తోపాటు బస కూడా ఇస్తుంది. అలా పుణే, నాగపూర్, గోవా, సూరత్‌లలో కూడా అమ్మాను. లక్ష సరుకును లక్షా యాభై వేలకు అమ్మవచ్చు. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: వి.రవీందర్ ఏలూరు నుంచి జనుము... పరిశ్రమ నిర్వహణకు ముడిసరుకు ఏలూరు జ్యూట్ మిల్ నుంచి తెచ్చుకుంటాను. మధ్యలో కొద్దిపాటి అవసరాలకు దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న జ్యూట్సెంటర్లో తీసుకుంటాను. బేగంబజార్‌లో చెక్క గుండీల వంటివి దొరుకుతాయి. ఈ పరిశ్రమకు మరో శాఖను మా సొంతూరు రాజమండ్రిలో స్థాపించాలని ఉంది. - జి.నాగదేవి ఈసీఐఎల్, హైదరాబాద్ ఫోన్: 8886665898 -
మా ఇల్లొక ప్రయోగశాల!
మహిళా విజయం బాలామణి పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. ఆమెకు రంగుల అద్దకపు అందం తెలిసింది అత్తారింట్లో. చేనేత కుటుంబం కావడంతో ఇంట్లో అందరూ నిష్ణాతులే. ఆ ఇంటి మగ్గాలకు ఇరుసుగా మారిన మహిళ విజయగాథ ఇది. మా అత్తవాళ్ల కుటుంబానిది చేనేతతో విడదీయలేని బంధం. ఇకత్ నేతలో నిష్ణాతులు. గోల్కొండ నవాబులకు వస్త్రాలు నేసేవారు. అప్పట్లో వస్త్రాలకు సహజ రంగులే వాడేవారు. కృత్రిమ రంగుల ధాటికి అవి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. సహజరంగుల తయారీ శ్రమతో కూడినది. కేటాయించాల్సిన సమయమూ ఎక్కువే. దాంతో తయారీ ఖర్చులు పెరుగుతాయి. సంపన్నవర్గాల దృష్టి వీటి మీద పడటంతో మళ్లీ సహజరంగులు అద్దిన బట్టల అమ్మకాలు పెరుగుతున్నాయి. నేచురల్ కలర్స్‌కి ముడిసరుకు బేగంబజార్‌లో దొరుకుతుంది. చెట్ల బెరడు, పండ్ల తొక్కలు, పూలరెక్కలు వంటివన్నీ ఎండబెట్టి అమ్ముతారు. పొడులు కూడా దొరుకుతాయి కానీ కల్తీ ఉంటుందేమోననే సందేహంతో నేను యథాతథంగా కొని మర పట్టించుకుంటాను. ఇండిగో మాత్రం చెన్నై నుంచి తెప్పిస్తాను. ఈ యూనిట్ నడపాలంటే పారే నీటి సౌకర్యం ఉండి తీరాలి. గతంలో గండిపేట, కాప్రా, దుర్గం చెరువుల్లో అద్దిన వస్త్రాలను శుభ్రం చేసేవాళ్లం. ఇప్పుడవీ కలుషితమయ్యాయి. ఇంట్లోనే సొంతబావి ఉండటంతో పెద్ద సిమెంటు తొట్టి, నీరు ప్రవహించే ఏర్పాటు చేసుకున్నాను. మా యూనిట్లో నాతోపాటు మా తోడికోడళ్లు శ్రీలత, సంగీత కూడా చురుగ్గా పాల్గొంటారు. మాది ఉమ్మడి కుటుంబం కావడమే ఈ యూనిట్‌ని సమర్థంగా నిర్వహించడానికి ప్రధాన కారణం. విస్తరించిన పరిశ్రమ... నా భర్త నరసింహులు, మామ నాగయ్య నాకు వస్త్రాన్ని నేయడం నేర్పించారు. పెళ్లయిన నాలుగేళ్లకు అంటే 1984లో నా చేత్తో తొలి వస్త్రం (లుంగీ) నేశాను. 2004లో నిఫ్ట్ విద్యార్థిని సౌమ్య చల్లాకు డెనిమ్ క్లాత్ మీద కలంకారీలో టాటూ డిజైన్ వేసిచ్చాను. ఆమె పేపర్ మీద తెచ్చుకున్న డిజైన్ని పెన్ కలంకారీ విధానంలో చిత్రించాను. అది పదివేల రూపాయల ప్రథమ బహుమతికి ఎంపికైంది. ఆమె ఫోన్లో థ్యాంక్స్ చెప్పినప్పుడు సంతృప్తిగా అనిపించింది. నేనూ అవార్డు అందుకోగలననే ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందా సంఘటన. రెండేళ్ల కిందట ‘ఇకత్ డబుల్ డోరియా చీర’ నేసి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి పొందాను.మా పెద్దవాళ్లు కాటన్ మీద మాత్రమే రంగులద్దేవారు. ఇప్పుడు ప్యూర్ సిల్క్, షిఫాన్, క్రేప్, జార్జెట్ల మీద కూడా అందమైన రంగులతో ప్రింట్స్ వేస్తున్నాను. ఇండియన్ ఎంపోరియమ్ వంటి ప్రఖ్యాత వస్త్రాలయాలకు రన్నింగ్ ఫ్యాబ్రిక్ సరఫరా చేస్తున్నాం. ఈ కళను ప్రదర్శించుకోవడం మాకు తెలియదు. కానీ ఈ పనిలో ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉన్నాం. నెలకు యాభై వేలకు పైగా జీతాల రూపంలో ఖర్చయినప్పటికీ... బయట పని చేస్తే వచ్చే జీతాలకంటే మెరుగైన రాబడి ఉంటోంది. హోమ్‌సైన్స్ విద్యార్థులు, నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) విద్యార్థులు వీవింగ్, నేచురల్ ప్రింటింగ్ శిక్షణ తరగతులకు నా దగ్గరకు వస్తుంటారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మానసపుత్రిక అయిన ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా రూపుదిద్దుకున్న ‘వందేమాతరం’ పథకం ద్వారా శిక్షణనిస్తున్నాను. - కందగట్ల బాలామణి, తాళ్లగడ్డ(హైదరాబాద్)లోని ‘ఇండియన్ ఇకత్స్’ చేనేత, అద్దకం పరిశ్రమ నిర్వాహకురాలు రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి , ఫొటోలు : శివ మల్లాల -
ఉద్యోగులు కూడా మా కుటుంబసభ్యులే!
మహిళా విజయం ‘దేశంలో మొదటి స్థానానికి చేరుకుంటాం’. ఓ మహిళా పారిశ్రామికవేత్త ఆత్మవిశ్వాసంతో అన్న మాట ఇది. ఆమె విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ సరోజా వివేకానంద. సామాన్యులకు ఆమె మాజీ ఎం.పి వివేక్ సతీమణి మాత్రమే. పరిశ్రమల రంగంలో మహిళలకు మాత్రం ఆమె ఓ చుక్కాని, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ చైర్పర్సన్. ఒకప్పుడు ఆమె సంప్రదాయ కుటుంబంలో పుట్టిన సాధారణమైన అమ్మాయి. రాజకీయరంగంలో తలపండిన జి.వెంకటస్వామి ఇంటికి కోడలైన తర్వాత, పరిశ్రమను విజయవంతంగా నడిపిస్తున్న పారిశ్రామికవేత్త. ఈ పరిణామక్రమాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నాన్న అనుకున్నట్లే... ‘‘మా నాన్న వాస్తు పండితులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం. కూతురి కోసం అల్లుడు వెతుక్కుంటూ వస్తాడని ఆయనకు నమ్మకం. అవి నేను ఇందిరాప్రియదర్శిని కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న రోజులు. నాన్న నమ్మకమే నిజమైంది. అదే సమయంలో వివేక్ ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసి పరిశ్రమ స్థాపించే ప్రయత్నంలో ఉన్నారు. భవనం వాస్తు నమూనా కోసం మా నాన్న దగ్గరకు పలుమార్లు రావాల్సి వచ్చింది. ఆ పరిచయంతో ఆయన ప్రపోజ్ చేశారు. 1986లో పెళ్లయ్యే నాటికి నాకు ఇరవై ఏళ్లు. మామగారి ప్రోత్సాహంతో... మా మామగారు నన్ను, మా తోడికోడల్ని ‘అమ్మాయిలు చదువుకున్నారు, ఆడవాళ్లు వ్యాపారాలు, ఉద్యోగాలు చేయకూడదని ఎవరన్నారు. పని చేసి నిరూపించుకోవాలి’ అని ప్రోత్సహించేవారు. అలా ఇరవయ్యేళ్ల కిందట విశాఖ కంపెనీకి డెరైక్టర్నయ్యాను. 1994లో చిన్నబ్బాయి పుట్టిన తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాను. చక్కటి కుటుంబం! వివేక్ రాజకీయంగా ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కుటుంబానికి ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారు. కానీ తెలంగాణ మూవ్మెంట్ తీవ్రంగా ఉన్న ఐదేళ్లు మాత్రం ఫోన్‌కు కూడా అందని పరిస్థితుల్లో గడిచింది. ఎప్పుడైనా నేను అయోమయంలో పడితే ‘ఇంతకంటే పెద్ద ఇష్యూస్‌నే సమర్థంగా డీల్ చేశావు. దీనికెందుకు వర్రీ’ అంటూ భరోసా ఇస్తుంటారు. ఎప్పుడైనా నేను అయోమయంలో పడితే ‘ఇంతకంటే పెద్ద ఇష్యూస్‌నే సమర్థంగా డీల్ చేశావు. దీనికెందుకు వర్రీ’ అంటూ భరోసా ఇస్తుంటారు వివేక్. - సరోజా వివేకానంద, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ విశాఖ ఫ్యామిలీ! మా పరిశ్రమలలో పని చేసే వారి ఫోన్ నంబర్లన్నీ విశాఖ ఫ్యామిలీ అనే గ్రూప్‌లో ఉంటాయి. ప్రతి ఉద్యోగి పుట్టిన రోజుకీ నా తరఫున శుభాకాంక్షలు అందుతాయి. వాళ్ల ఇంట్లో పెళ్లి వంటి వేడుకలు జరుగుతుంటే బొకే పంపిస్తాం. నెలకోసారి మా ఉద్యోగుల్లో ఒకరి ఇంట్లో లంచ్ చేస్తాను. ఇప్పుడు మా చిన్నబ్బాయి కూడా ఇండస్ట్రీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. దాంతో నా హాబీలకు సమయం కేటాయించుకోవడానికి వెసులుబాటు దొరికింది. స్మిమ్మింగ్ క్లాసులు, సింగింగ్ క్లాసులతోపాటు గోల్ఫ్ ఆటతో గడుపుతున్నాను. హైదరాబాద్‌లో లేడీస్ గోల్ఫ్ బృందం ఉంది. - వాకా మంజులారెడ్డి