అవకాశాల్లో ఆ సగమేదీ.. | womens day special | Sakshi
Sakshi News home page

అవకాశాల్లో ఆ సగమేదీ..

Published Tue, Mar 7 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

womens day special

  • జిల్లా జనాభాలో సగభాగం మహిళలే
  • విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో అరకొరే
  • స్థానిక సంస్థల పదవుల్లో కొలువుదీరినా పెత్తనం పురుషులదే
  • జిల్లాలో మహిళా ఎమ్మెల్యే, మేయర్‌ పరిస్థితి ఇదే బాట
  • జిల్లా జనాభా 53 లక్షలు – మహిళా జనాభా : 26.52 లక్షలు
    అక్షరాస్యత 33.48 లక్షలు – మహిళల్లో అక్షరాశ్యులు : 15.8 లక్షలు
    విద్యార్థులు 11 లక్షలు – విద్యార్థినులు : 6 లక్షలు
    ఉద్యోగులు 40 వేలు – మహిళా ఉద్యోగులు : 15 వేలు
    కూలీలు 8 లక్షలు – మహిళా కూలీలు : 3 లక్షలు
    కార్మికులు 5 లక్షలు – మహిళా కార్మికులు : 2 లక్షలు
    స్థానిక సంస్థల రిజర్వేషన్ల పుణ్యమా అని...
    జెడ్పీటీసీలు 62 – మహిళా జెడ్పీటీసీ సభ్యులు : 33
    ఎంపీపీలు 62 – మహిళా ఎంపీపీలు : 39
     
    ఎమ్మెల్యేలు 19 – మహిళా ఎమ్మెల్యేలు : 2
    మున్సిపల్‌,నగర పంచాయతీ చైర్మ7 – మహిళా చైర్‌పర్స¯ŒSలు : 3
    మేయర్‌ : 1
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    ఆకాశంలో సగం... నినాదం బాగుంది... కానీ అవకాశాల్లో మాత్రం ఆ సగ భాగమేదీ అని ప్రశ్నిస్తోంది నారీ లోకం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోతున్నా మహిళలకు సంపూర్ణ స్వాతంత్య్రం ఎండమావిలానే మోసగిస్తోంది. అన్నింటా మహిళలకు సమాన ప్రాతినిధ్యం   అందమైన నినాదంగానే మిగిలిపోతోంది. పునర్విభజనకు ముందు, తరువాత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి. జనాభా పరంగా మొదటి స్థానం ఈ జిల్లాదే. అటువంటి జిల్లాలో అతివలకు సముచిత స్థానం దక్కడం లేదనే ఆవేదన సర్వత్రా వినిపిస్తోంది. రాజకీయాల్లో కూడా మహిళల పాత్ర పరిమితమే. రాజ్యాంగం ప్రకారం మహిళలు పేరుకు పీఠాలు అధిష్టిస్తున్నా పెత్తనమంతా భర్తలదే. స్థానిక సంస్థలు మొదలుకుని ఎమ్మెల్యేల వరకు అన్నింటా జిల్లాలో ఇదే నడత కనిపిస్తోంది. 
    ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే...
    కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె భర్త సత్యనారాయణమూర్తి అటు పార్టీలోను ఇటు అధికారిక కార్యక్రమాల్లోను తనదైన పాత్ర పోషిస్తున్నారు. 
    రాజమహేంద్రవరం మేయర్‌ పంతం రజనీశేషసాయి. అధికారిక కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేయాలనే ఆలోచన ఉన్నా పురుషాధిక్య రాజకీయాల్లో ఆచరణలో ఆమె వెనుకడుగు వేయకతప్పడం లేదు. నగర ప్ర«థమ మహిళ అయినా ఆ స్థాయిలో తన ముద్ర వేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో మహిళననే చులకన చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. 
    రాజకీయాల్లో అతివలు రాణించే సత్తా ఉన్నా వారికి సహాయనిరాకణే ఎదురవుతోందదనడానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాగే సాధారణ మహిళలకు కూడా వేధింపులు తప్పడం లేదు. మహిళలపై నిత్యం జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం అమలాపురం పట్టణంలో కళాశాలకు వెళుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను వెంటపడి వేధిస్తున్న యువకులపై పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే పరిస్థితికి దారితీసింది. చివరికి మంత్రి చినరాజప్ప జోక్యం చేసుకుంటే గానీ పోలీసుల్లో కదలిక రాలేదు. 
    జిల్లాలో సగం...
    జిల్లా జనాభాలో సగానికి పైనే మహిళలున్నారు. కానీ వివిధ రంగాల్లో వారి సంఖ్యకు తగ్గట్టు ప్రాతినిధ్యం లభించడం లేదు. అక్షరాస్యత, ఉద్యోగాలు, కూలీలు, కార్మికులు..ఇలా అన్ని రంగాల్లోనూ వారి సంఖ్య అంతంతమాత్రమే. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతోందని చెబుతున్న ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య చూస్తే అరకొరే. అక్షరాస్యతలో, ఉద్యోగాల్లో, విద్యలో సగ భాగం కూడా దాటని దుస్థితి. చివరకు కార్మికుల సంఖ్య చూసుకున్నా అంతంతే. రిజర్వేషన్లు పుణ్యమా అని స్థానిక సంస్థల్లో సగానికి పైగా కొలువుదీరినా పెత్తనమంతే భర్తలదే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement