World beautiful
-
ఖరీదైన కారు కొన్న మాజీ విశ్వసుందరి.. ఎన్ని కోట్లో తెలుసా?
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి బీ టౌన్లో పరిచయం అక్కర్లేదు. గతంలో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీతో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి. సుష్మితా సేన్ 1994లో విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచింది. హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. అయితే సుస్మితా సేన్ తాజాగా ఓ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. డ్రైవింగ్‌ను ఇష్టపడే మహిళగా ఈ బహుమతి ఇచ్చుకున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. సుస్మితా సేన్ కొన్న కారు ధర రూ.1.92 కోట్లుగా ఉంది. సుస్మితా సేన్ ప్రస్తుతం ఆర్య -3 అనే సీరియల్లో నటిస్తోంది. రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో నమిత్ దాస్, మనీష్ చౌదరి, సికందర్ ఖేర్, వినోద్ రావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఈ షో రెండో సీజన్ డిసెంబర్ 2021లో విడుదలైంది. మూడో సీజన్ విడుదల తేదీని వెల్లడించలేదు. ఇది కాకుండా, సుస్మిత తాళి అనే కొత్త వెబ్ సిరీస్‌లో నటించనుంది. ట్రాన్స్‌జెండర్ కార్యకర్త గౌరీ సావంత్ పాత్రలో కనిపించనుంది. -
ప్రపంచంలో అందమైన మహిళలు.. టాప్ టెన్‌లో బాలీవుడ్ నటి..!
బాలీవుడ్లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన ఉనికి చాటుకుంది. తాజాగా ఆమె పేరు అరుదైన జాబితాలో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన పది అందమైన మహిళల లిస్ట్‌లో ఇండియా నుంచి ఆమెకు స్థానం లభించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు దీపికా పదుకొణే. 'ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై' పేరుతో ఈ జాబితాను తాజాగా విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో ఎంపికైన వారి గోల్డెన్ రేషియో వరుసగా బియాన్స్ – 92.44 శాతం, అరియానా గ్రాండే – 91.81 శాతం, టేలర్ స్విఫ్ట్ – 91.64శాతం, కిమ్ కర్దాషియాన్ – 91.28 శాతం, దీపికా పదుకొణే 91.22 శాతంగా వెల్లడించారు. జోడీ కమర్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల జాబితాను తయారు చేసింది. ప్రస్తుతం దీపిక పలు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె షారుఖ్‌తో కలిసి పఠాన్‌లో కనిపించనుంది. వార్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కె లో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇవే కాకుండా అమెరికన్ కామెడీ చిత్రం ది ఇంటర్న్‌లో కనిపించనుంది. హృతిక్ రోషన్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఫైటర్ మూవీలో నటిస్తోంది. -
వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..
ఇంతవరకు ఎన్నోరకాల మమ్మీలు గురించి చదివాం. పైగా వాటి అవయవాలు జాలా జాగ్రత్తగా భద్రపర్చారంటూ విన్నాం. ఆయా మమ్మీల వద్ద విలువైన నాణేలు, బంగారం వంటి వస్తువులను చూశాం. ఇంతవరకు చూసిన మమ్మీలన్నీ చాలా వరకు కాస్త డికంపోజ్ అయినట్లుగానే ఉన్నాయి. చనిపోయినప్పుడు ఎలా ఉండేవో అలానే యథాతథంగా ఉండటం అసాథ్యం. కానీ ఇక్కడొక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది. వివరాల్లోకెళ్తే....రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న తన రెండో పుట్టిన రోజున చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి 1920 మధ్య కాలంలో స్పానిష్ ప్లూ మహమ్మారీ ప్రబలంగా ఉండేది. ఆ సమయంలో ఈ చిన్నారి ఆ మహమ్మారి బారిన పడి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ చిన్నారి మృతదేహాన్ని మమ్మీలా అత్యంతా జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ మేరకు ఆ చిన్నారి మృతదేహం ఉత్తర సిసిలీలో పలెర్మోలోని కాపుచిన్ కాటాకాంబ్స్ అనే చోట భద్రపరచారు. వందేళ్ల తర్వాత కూడా ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడూ ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండటం గమనార్హం. పర్యావరణ కారకాల నుంచి ఆ మృతదేహం పాడవకుండా అత్యంత బహు జాగ్రత్తగా నైట్రోజన్‌తో నిండిన గాజు సేవ పేటికలో భద్రపరిచారు. ఈ చిన్నారి మమ్మీ ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ కాపుచిన్ కాటాకాంబ్స్ అనేది దక్షిణ ఇటలీలో ఉండే అతి పెద్ద మమ్మీల పరిశోధన కేంద్రం లేదా మమ్మీలను భద్రపరిచే భూగర్భ శ్మశాన వాటిక. ఇందులో దాదాపు ఎనిమిది వేల మమ్మీలు ఉన్నాయి. రోసాలియా అనే రెండెళ్ల చిన్నారిని భద్రపరిచినంతగా మిగతా వాటిని భద్రపర్చలేదు. ఆ చిన్నారి రాగి జుట్టు, చర్మం రంగు మారకుండా ఏదో మనిషి నిద్రపోతున్నట్లుగా ఉంటుంది. చాలామంది నకిలీ మమ్మీ అని, మైనపు ముద్ద అంటూ పుకార్లు సృష్టించారు. మరికొంతమంది ఆ చిన్నారిని చూసినప్పుడు మమ్మల్ని చూసి రెప్పవేసిందని కూడా చెప్పారు. ఐతే వాటన్నింటిని కొట్టి పారేస్తూ...ఆ చిన్నారి శరీరం పై చేసిన పరిశోధనల్లో శరీరం, ఎముకలు, అవయవాలు ఏ మాత్రం చెక్కు చెదరలేదని, కేవలం మెదడు మాత్రమే ఉండాల్సిన పరిమాణం నుంచి 50% తగ్గిపోయిందని నిర్థారించారు ఆర్కియాలజిస్ట్‌లు. ఏ మాత్రం పాడవకుండా ఉన్న ఈ చిన్నారి మమ్మీ ఇటలీ పురాణాల్లో ప్రసిద్ద అంశంగా మారింది. ఈ చిన్నారిని టాక్సీడెర్మిస్ట్, ఎంబాల్మర్ ఆల్ఫ్రెడో సలాఫియాలు మమ్మీగా మార్చారని చెబుతున్నారు. కానీ కొంతమంది శాస్తవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ కలిగించి ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!) -
ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం
-
ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం
లాస్ఏంజెల్స్: ప్రపంచంలోనే అత్యంత అందమైన 30 మంది మహిళల్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు(34) రెండోస్థానం లభించింది. ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ బజ్‌ఫీడ్ నిర్వహించిన పోల్‌లో హాలీవుడ్ తారలు ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్, బ్లాక్ లివ్లీ తదితరులను వెనక్కి నెట్టి ప్రియాంక రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాప్ గాయని బియాన్స్ మొదటిస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రియాంక తనకు ఓటేసిన అభిమానులకు, బజ్‌ఫీడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ మోడల్ టేలర్ హిల్ జాబితాలో మూడోస్థానం దక్కించుకున్నారు. అమెరికా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆరోస్థానంలో, ప్రముఖ నటి ఏంజెలినా జోలీ 8వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డు అందుకున్న ఎమ్మా స్టోన్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వీరితో పాటు వండర్ ఉమెన్ నటి గల్ గడట్, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్ఫ్రే, తదితరులు తుది జాబితాలో చోటుదక్కించుకున్నారు.