ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం | Priyanka Chopra is world's second most beautiful woman | Sakshi
Sakshi News home page

ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం

Published Tue, Apr 4 2017 2:19 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం

ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానం

లాస్‌ఏంజెల్స్‌: ప్రపంచంలోనే అత్యంత అందమైన 30 మంది మహిళల్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు(34) రెండోస్థానం లభించింది. ప్రముఖ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ బజ్‌ఫీడ్‌ నిర్వహించిన పోల్‌లో హాలీవుడ్‌ తారలు ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్, బ్లాక్‌ లివ్లీ తదితరులను వెనక్కి నెట్టి ప్రియాంక రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాప్‌ గాయని బియాన్స్‌ మొదటిస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రియాంక తనకు ఓటేసిన అభిమానులకు, బజ్‌ఫీడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రముఖ మోడల్‌ టేలర్‌ హిల్‌ జాబితాలో మూడోస్థానం దక్కించుకున్నారు. అమెరికా డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఆరోస్థానంలో, ప్రముఖ నటి ఏంజెలినా జోలీ 8వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఎమ్మా స్టోన్‌ 12వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వీరితో పాటు వండర్‌ ఉమెన్‌ నటి గల్‌ గడట్, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రే, తదితరులు తుది జాబితాలో చోటుదక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement