world heritage city
-
ఎలిఫెంటా కేవ్స్ ఏనుగు కోసం వెతకొద్దు!
ఎలిఫెంటా కేవ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ముంబయి టూర్లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. సముద్రం మధ్యలో ఓ దీవి. అందులో ఓ కొండ. ఆ కొండలో తొలిచిన గుహలివి. అయితే ఈ కొండ మీద కానీ, గుహల్లోనూ ఎంత వెదికినా ఏనుగు మాత్రం కనిపించదు. బ్రిటిష్ వారు ముచ్చటపడి తమ దేశం తీసుకెళ్లాలనుకున్నారట. పెకలించే ప్రయత్నంలో డ్యామేజ్ అవడంతో ఏనుగును వదిలేసి కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనంతో సరిపెట్టుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనవాళ్లు డ్యామేజ్ అయిన ఏనుగు విగ్రహానికి మరమత్తులు చేసి నగరంలోని శివాజీ మ్యూజియంలో ఉంచారు. ఏనుగు లేదని ఈ గుహలను చూడడం మానుకోకూడదు. ఈ గుహలు మన వారసత్వానికి ప్రతీకలు. ఈ గుహలను చేరడానికి అరేబియా సముద్రంలో సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.నీరెండలో కడలి విహారంఎలిఫెంటా కేవ్స్‌కి ముంబయిలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫెర్రీలో వెళ్లాలి. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తీసుకెళ్తాయి. ఈ సీజన్లో మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యుడు గోరువెచ్చగానే ఉంటాడు. ఫెర్రీ బోట్‌పై అంతస్థులో ప్రయాణిస్తూ ముంబయి తీరంలో అరేబియా తీరాన్ని వీక్షించడం ఆహ్లాదకరం మాత్రమే కాదు ఓ ఎడ్యుకేషన్ కూడా. హార్బర్‌కు వచ్చిన షిప్పులు పోర్టులో బెర్త్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. బకెట్‌కి తాడు కట్టి బావిలో నీటిని తోడినట్లు సముద్రపు నీటిని తోడుకుని షిప్ లోపలికి వెళ్తుంటారు. ఇంటర్నేషనల్ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని. ఎలిఫెంటా కేవ్స్ టూర్లో ఇది బోనస్. షిప్పులు తీరానికి రెండు కిలోమీటర్ల వరకు ఆగి ఉంటాయి. వాటిని చూస్తూ ప్రయాణించడం వల్ల కేవ్స్‌కు పదికిలోమీటర్లు ప్రయాణించిన విషయం అర్థం కాదు. కడలి గర్భం నుంచి తీరాన్ని చూడవచ్చుకొండ దగ్గర ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. గుహలను చేరడానికి టాయ్‌ట్రైన్ ఉంది. కానీ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది. ట్రైన్ కోసం ఎదురు చూడాలా నడవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. సముద్రం లోపల పది కిలోమీటర్ల దూరం నుంచి తీరాన్ని చూడడం బాగుంటుంది. సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గుహల్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మరో ప్రపంచం. శిల్పాలు మాట్లాడతాయి!ఈ గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి. శిల్పాల్లో బౌద్ధం, శైవం ప్రభావం కనిపిస్తుంది. ఒక్కో శిల్పం ఒక్కో కావ్యంతో సమానం. మనం చూస్తున్న శిల్పంలో దాగిన కావ్యకథ గైడ్ వివరించే వరకు అర్థం కాదు. విధ్వంసకారులు ఏ శిల్పాన్నీ వదల్లేదు. ప్రతి శిల్పానికి ఎక్కడో ఓ చోట గాయం తప్పనిసరి. హీనయాన బౌద్ధులు ఈ కొండలను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు. బౌద్ధ శిల్పాలను చెక్కారు. శివపురాణం ఆధారంగా చెక్కిన ఘట్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. బౌద్ధం సన్నగిల్లిన తర్వాత ఈ ప్రదేశం హిందువుల ఆధీనంలోకి వచ్చింది. శైవం పతాకస్థాయికి చేరిన కాలంలో కాలచూరులు, రాష్ట్రకూటులు ఈ శిల్పాలను చెక్కించారు. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో సమాజం స్త్రీ పురుష సమానత్వం గురించి ఆలోచించింది. సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి శైవాన్ని మాధ్యమం చేసుకుంది. అలా రూపొందిన శిల్పమే అర్ధనారీశ్వరుడి శిల్పం. పిఎస్: ఎలిఫెంటా కేవ్స్ సందర్శనకు సోమవారం సెలవు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: ఆర్ట్‌తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!) -
హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తెస్తాం
రాయదుర్గం: హైదరాబాద్‌కు యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాలు ఉన్నాయని, ఎన్నింటినో గుర్తించి, ఆధునీకరించామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నగరంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ 2036 నాటికి ఒలింపిక్స్ హౌజ్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న ఉప్పల్, ఎల్బీ స్టేడియాలను మరింత ఆధునీకరించి, కొత్త స్టేడియాలను, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తున్నామని, వచ్చే పదేళ్లలో 24 గంటలపాటు తాగునీరు అందేలా చేయాలని, వచ్చే అయిదేళ్ల కాలంలో రోజువారీగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరాన్ని తొమ్మిదిన్నరేళ్లలో భూతల స్వర్గం చేశామని చెప్పమని, కానీ చిత్తశుద్ధితో కష్టపడి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేశామని చెప్పగలనన్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీకి మరో ఇద్దరు అదనపు కమిషనర్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందని కేటీఆర్ చెప్పారు. చెరువులు పరిరక్షణ, పర్యవేక్షణ, సుందరీకరణకు ఒక ప్రత్యేక కమిషనర్, పార్కులు, హరిత పరిరక్షణకు మరో ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కాలుష్య రహిత రవాణా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రోను రానున్న కాలంలో 415 కి.మీ.కు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. లింకురోడ్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తున్నామని, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ ప్లాన్ చాలా బాగుందని మెచ్చుకున్నారన్నారు. -
అహ్మదాబాద్‌కు అరుదైన గుర్తింపు
ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్ అహ్మదాబాద్: గుజరాత్లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్ ఈ గౌరవాన్ని అందుకుంది. భారత దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. భారత్‌లోని చరిత్రాత్మక అహ్మదాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటిస్తున్నామని ‘యునెస్కో’ శనివారం రాత్రి ట్విటర్ ద్వారా తెలిపింది. యునెస్కో నిర్ణయంతో భారత్ చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ వారసత్వ నగరంగా ఎంపిక కావడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. అహ్మదాబాద్ ఇంత గొప్ప గుర్తింపు పొందడం అత్యంత సంతోషదాయకమని గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని వ్యాఖ్యానించారు. తమ నగరానికి అరుదైన గుర్తింపు దక్కడం పట్ల అహ్మదాబాద్ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
గూగుల్‌లో వరంగల్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వరల్డ్ హెరిటేజ్ సిటీగా ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం దక్కించుకున్న వరంగల్ మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. మరో కొన్ని గంటల్లో అరుదైన ఘట్టాన్ని చేరుకోనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా భౌగోళిక స్వరూపం ప్రపంచం ముంగిట్లోకి వెళ్లనుంది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, రోడ్లు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయూలు, ఆస్పత్రులు, గ్రామాల ఛాయూచిత్రాలను గూగుల్‌లో ప్రత్యక్షంగా వీక్షించే అద్భుత గడియ రానే వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘వరంగల్ ఆన్లైన్’ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజ్, కలెక్టర్ కిషన్, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ లతిటేష్ కాట్రగడ్డ, న్యూ బిజినెస్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కిరణ్‌బాప్న, ప్రోగ్రాం మేనేజ్మెంట్ డెరైక్టర్ సురేన్ రేహలా హాజరుకానున్నారు. హైదరాబాద్ తర్వాత జిల్లాకే.. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాకే ఈ అవకాశం దక్కనుంది. కాకతీయుల ఖిల్లా, రామప్ప చెరువు, వరంగల్‌లోని విద్య, వైద్య సముదాయాలు, వారసత్వ కట్టడాలను గూగుల్ వెబ్సైట్ నుంచి మనం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. జిల్లాలోని ప్రధాన రహదారులు, పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు, రెవెన్యూ గ్రామాలు, సహజ వనరులన్నింటినీ ఎన్ఐటీ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ విద్యార్థుల సహాయంతో గూగుల్ విజ్వలైజ్ చేసింది. విజువల్స్ కోసం అధునాతన 3డీ టెక్నాలజీని ఉపయోగించారు. జిల్లా అంతకు ముందు పనిచేసిన కలెక్టర్ రాహుల్‌బొజ్జా హయాంలో గూగుల్ విజువలైజేషన్ కార్యక్రమం చేపట్టగా... ఇప్పటి కలెక్టర్ జి.కిషన్ ఆధ్వర్యంలో గూగుల్ ద్వారా ‘వరంగల్ ఆన్లైన్’ అందుబాటులోకి రానుంది. మంత్రి పొన్నాల చొరవ.. జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌ను గుగూల్లో చూపించేందుకు ప్రత్యేక చొరవ చూపించారు. గూగుల్ సంస్థ ప్రతినిధులకు అందుకు కావాల్సిన సహకారాన్ని ఆయన అందించారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదేశాలతో జిల్లాలోని సమగ్ర సమాచారాన్ని క్రోఢీకరించడంలో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా... అధికార యత్రాంగాన్ని భాగస్వాములను చేశారు. రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో విలేజ్ రెవెన్యూ, సర్వేల్యాండ్ అధికారుల సహకారంతో భౌగోళిక స్వరూపాన్ని గుగూల్లో పొందుపరిచారు. 51 మండలాల సమాచారం జిల్లాలోని 51 మండలాల్లో ఉన్న 1066 గ్రామాలు, 10వేల ప్రాంతాలు, 700 ప్రధాన రోడ్లు ‘వరంగల్ ఆన్లైన్’లో కనిపిస్తాయి. ఇవేగాక ఖిలావరంగల్ కోట, వేరుుస్తంభాలగుడి, రామప్ప గుడి, కోటగూళ్లు, పాకాల, లక్నవరం సరసులు, కాకతీయ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) , ఎంజీఎం, కాకతీయ మెడికల్ కళాశాల, కాజీపేట రైల్వే స్టేషన్... ఇలా అనేక చారిత్రక ప్రదేశాలు, పురావస్తు కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ‘వరంగల్ ఆన్లైన్’లో ప్రత్యక్షంగా కనిపించనున్నాయి.